iDreamPost
android-app
ios-app

Hyderabad వాసులకు అలర్ట్‌.. ఆ ప్రాంతాల్లో తాగు నీరు బంద్.. ఎప్పటి వరకంటే!

  • Published Aug 30, 2024 | 10:53 AM Updated Updated Aug 30, 2024 | 10:53 AM

Hyderabad Water Supply: హైదరాబాద్‌ వాసులకు అలర్ట్‌.. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో తాగు నీటి సరఫరాకు ఆటంకం ఏర్పడనుంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు మీకోసం..

Hyderabad Water Supply: హైదరాబాద్‌ వాసులకు అలర్ట్‌.. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో తాగు నీటి సరఫరాకు ఆటంకం ఏర్పడనుంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు మీకోసం..

  • Published Aug 30, 2024 | 10:53 AMUpdated Aug 30, 2024 | 10:53 AM
Hyderabad వాసులకు అలర్ట్‌.. ఆ ప్రాంతాల్లో తాగు నీరు బంద్.. ఎప్పటి వరకంటే!

సాధారణంగా వేసవి కాలంలో భాగ్యనగరంలో నీటి ఎద్దడి సమస్య వెంటాడుతుంది. ఈసారి ఎండాకాలంలో ఈ సమస్య తీవ్రత అధికాం అయ్యింది. జూలై నెల వరకు కూడా సరిపడా నీటి సరఫరాల లేక.. చాలా మంది ఇళ్ల యజమానులు, మాల్స్‌ యాజమాన్య.. ట్యాంకర్ల మీద ఆధారపడ్డారు. ఇప్పుడే సమస్య కాస్త తగ్గింది. ఇదిలా ఉండగా.. తాజాగా హైరదాబాద్‌ జలమండలి అధికారులు.. నగర వాసులకు అలర్ట్‌ జారీ చేశారు. నగరంలోని పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనున్నట్లు ప్రకటించారు. ఈ విషయం గమనించి ప్రజలు అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.

నగరానికి తాగు నీరు సరఫరా చేసే కృష్ణా డ్రింకింగ్‌ వాటర్‌ సప్లయి లైన్‌‌లో సాంకేతిక సమస్య ఏర్పడిందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో గ్రేటర్ పరిధిలోని పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని మెట్రో వాటర్ వర్క్స్ అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. నేడు అనగా ఆగస్టు 30, శుక్రవారం నాడు పలు ప్రాంతాల్లో తాగు నీటి సరఫరా ఉండదని తెలిపారు.

జలమండలి డివిజన్-2 (బీ), బాలాపూర్ రిజర్వాయర్ పరిధిలోని గుర్రం చెరువు నుంచి సన్నీ గార్డెన్స్ వరకు జీహెచ్‌ఎంసీ, బాక్స్ డ్రెయిన్ నిర్మాణం పనులు జరుగుతున్నాయని.. ఈ బాక్స్ డ్రెయిన్ నిర్మాణానికి ఇబ్బందులు కలగకుండా బాలాపూర్ రిజర్వాయర్ అవుట్ లెట్ 450 ఎంఎం డయా పైప్‌లైన్ డైవర్షన్ పనులు చేపట్టనున్నట్లు వాటర్ వర్క్స్ అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో అత్యవసరంగా నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడే ప్రాంతాలు ఇవే..

ఓఅండ్ఎం డివిజన్ – 2బీ: రాజా నరసింహ కాలనీ, దర్గా బురాన్షాహి, గాజీ-మిల్లత్, ఇందిరా నగర్, ఫీసల్‌ బండా, జీఎంచౌని, లలితా బాగ్, ఉప్పుగూడ, గారిసన్ ఇంజినీర్ -1, 2, డీఆర్‌డీఓ, మిధాని, డీఎంఆర్‌ఎల్‌, డీఎల్‌ఆర్‌ఎల్‌, ఒవైసీ హాస్పిటల్, సీఆర్‌పీఎఫ్‌, బీడీఎల్‌, కేంద్రీయ విద్యాలయం ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది.

ఓఅండ్ఎం డివిజన్–2ఏ: యాదగిరి కమాన్ ఎదురుగా ఉన్న ప్రాంతం, హస్నాబాద్, ఖలందానగర్, సంతోష్ నగర్, హెచ్‌ఐజీహెచ్‌, ఎంఐజీహెచ్‌, ఎల్ఐ‌జీహెచ్‌ కాలనీలు, ఫహబా మసీదు, హనుమాన్ టైలర్ గల్లీ, మారుతీ నగర్, పోచమ్మ గడ్డ ప్రాంతాల్లో నేడు తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది.

ఓఅండ్ఎం డివిజన్–10 ఏ: మక్బూల్ నగర్, జీఎం నగర్, బాబా నగర్, క్వాద్రీ కాలనీ ప్రాంతాలు. తాగునీటి సరఫరాలో కొన్ని చోట్ల పూర్తి అంతరాయం కలగనుండగా.. మరికొన్ని చోట్ల తాగు నీటి సరఫరాలకు పాక్షిక అంతరాయం ఏర్పడుతుందని జల మండలి అధికారులు చెప్పుకొచ్చారు. ఈ ప్రాంతాల వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోవాలని వాటర్ బోర్డు అధికారులు సూచించారు.