iDreamPost
android-app
ios-app

Varalakshmi Tiffins: మరోసారి వరలక్ష్మీ టిఫిన్స్ యజమాని అరెస్ట్.. అప్పుడు డ్రగ్స్- ఇప్పుడు అమ్మాయిలు!

Hyderabad Varalakshmi Tiffins: హైదరాబాద్ నగర వాసులకు పరిచయం చేయనక్కర్లేని టిఫిన్ సెంటర్.. వరలక్ష్మీ టిఫిన్ సెంటర్. టేస్ట్, నాణ్యతలో బెస్ట్ గా నిలవడంతో అక్కడికే క్యూ కట్టేవారు. కానీ అనూహ్యంగా గత ఏడాది డ్రగ్ కేసులో అరెస్టయ్యాడు యజమాని ప్రభాకర్ రెడ్డి.. తాజాగా మరోసారి..

Hyderabad Varalakshmi Tiffins: హైదరాబాద్ నగర వాసులకు పరిచయం చేయనక్కర్లేని టిఫిన్ సెంటర్.. వరలక్ష్మీ టిఫిన్ సెంటర్. టేస్ట్, నాణ్యతలో బెస్ట్ గా నిలవడంతో అక్కడికే క్యూ కట్టేవారు. కానీ అనూహ్యంగా గత ఏడాది డ్రగ్ కేసులో అరెస్టయ్యాడు యజమాని ప్రభాకర్ రెడ్డి.. తాజాగా మరోసారి..

Varalakshmi Tiffins: మరోసారి వరలక్ష్మీ టిఫిన్స్ యజమాని అరెస్ట్.. అప్పుడు డ్రగ్స్- ఇప్పుడు అమ్మాయిలు!

హైదరాబాద్‌లోని వరలక్ష్మి టిఫిన్స్‌ సెంటర్‌ ఎంత ఫేమస్సో దాని ఓనర్ కూడా డ్రగ్ కేసులో అరెస్టై అంతే సంచలనమయ్యాడు. గత ఏడాది డ్రగ్ కేసులో ముగ్గురు నిందితులు అరెస్టు అయ్యారు. వారిలో ఒకరు వరలక్ష్మి టిఫిన్స్‌ సెంటర్‌ ఓనర్ ప్రభాకర్ రెడ్డి. మరొకరు డ్రగ్ డీలర్ అనురాధ. సామాన్య కుటుంబం నుండి వచ్చిన ప్రభాకర్.. కష్టపడి టిఫిన్స్ బిజినెస్ స్టార్ట్ చేశాడు. గబ్చిబౌలి, డీఎల్ఎఫ్ వీధిలోని ఫుడ్ లేన్లతో పాటు హైదరాబాద్ నగరంలో 10కి పైగా బ్రాంచులను ఏర్పాటు చేశాడు. ఈ టిఫిన్ సెంటర్ల గురించి తెలియని హైదరాబాద్ వాసులుండరు. అక్కడ టిఫిన్‌కు అంత డిమాండ్. ఎప్పుడూ రష్ ఉండేది. కానీ అనూహ్యంగా డ్రగ్ కేసులో అరెస్టయ్యాడు ప్రభాకర్. కాగా, ఇటీవల బెయిల్ పై బయటకి వచ్చాడు. అంతలోనే మరో వివాదంలో చిచ్చుకున్నాడు. మరోసారి అతడ్ని అరెస్టు చేశారు పోలీసులు. ఎందుకనుకుంటున్నారా…?

వరలక్ష్మి టిఫిన్ సెంటర్ యజమాని ప్రభాకర్ రెడ్డిని మరోసారి పోలీసులు అరెస్టు చేశారు. తమను పెళ్లి చేసుకుంటామని చెప్పి మోసం చేశాడంటూ ఇద్దరు అమ్మాయిలు ఫిర్యాదులు ఇవ్వడంతో గచ్చిబౌలి పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. పెళ్లి పేరుతో తనను లొంగదీసుకున్నాడని, ఆపై మోసం చేశాడంటూ ఓ బాధితురాలు గత జనవరిలో ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. తాజాగా ఆ ఫిర్యాదులపై స్పందించారు. ప్రభాకర్ పై కేసు నమోదు చేసిన పోలీసులు… అతడిపై 417, 420, 354A కింద కేసులు బనాయించారు. చివరకు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. గతంలో డ్రగ్ కేసులో.. ఇప్పుడు అమ్మాయిల మోసం చేశాడన్న ఆరోపలణలపై అరెస్టు అయ్యాడు ప్రభాకర్. 2017లో జీవనోపాధి కోసం ప్రకాశం జిల్లా నుంచి హైదరాబాద్‌కు వచ్చాడు ప్రభాకర్.

గచ్చిబౌలి పరిధిలోని డీఎల్‌ఎఫ్‌లో వరలక్ష్మీ టిఫిన్ సెంటర్ పేరుతో చిన్న టిఫిన్‌ సెంటర్‌ ప్రారంభించాడు. రుచి, నాణ్యత బాగుండటంతో ఆ టిఫిన్ సెంటర్ వద్దకు క్యూ కట్టారు నగర వాసులు. దీంతో వ్యాపారంలో లాభాలు రావడంతో.. హైదరాబాద్ నగరంలో వ్యాపారాన్ని విస్తరించాడు. పదో తరగతి కూడా చదువుకోని ప్రభాకర్ రెడ్డి.. తన తెలివితేటలతో వ్యాపారంలో కోట్లు గడించాడు. అన్ని ఫుడ్‌ డెలివరీ యాప్‌లలో వరలక్ష్మీ టిఫిన్ సెంటర్‌కు మంచి రేటింగ్ కూడా ఉంది. అలాంటిది ప్రభాకర్ జల్సాలకు అలవాటు పడ్డాడు. స్నేహితులతో కలిసి పబ్‌లకు వెళ్లడం, పార్టీలు చేసుకోవడం ప్రారంభమైంది. డ్రగ్స్‌కు, ఇతర వ్యసనాలకు బానిసయ్యాడు. పగలంతా వరలక్ష్మి టిఫిన్స్‌లో ఇడ్లీ, దోశ, వడ వంటి రుచికరమైన టిఫిన్స్‌ అమ్మే ప్రభాకర్‌రెడ్డి.. రాత్రిపూట డ్రగ్స్‌ దందా చేసే స్థాయికి ఎదిగాడు. అనురాధ ద్వారా గోవా నుంచి నగరానికి డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ చేయించేవాడని తేలడంతో పోలీసులకు చిక్కాడు.