iDreamPost
android-app
ios-app

హైదరాబాద్ లో సరికొత్త మోసం! ఒక్క వాట్సాప్ మెసేజ్ తో రూ.13.26 కోట్లు కొట్టేశారు!

  • Published Sep 05, 2024 | 12:27 PM Updated Updated Sep 05, 2024 | 12:27 PM

India's Biggest Cyber Crime In Hyderabad: ఇండియాలోనే అతి పెద్ద సైబర్ క్రైమ్ హైదరాబాద్ లో వెలుగు చూసింది. సుమారు కోట్ల రూపాయలకు పైగా నష్టపోయాడు ఓ వృద్ధుడు. ఆ వివరాలు..

India's Biggest Cyber Crime In Hyderabad: ఇండియాలోనే అతి పెద్ద సైబర్ క్రైమ్ హైదరాబాద్ లో వెలుగు చూసింది. సుమారు కోట్ల రూపాయలకు పైగా నష్టపోయాడు ఓ వృద్ధుడు. ఆ వివరాలు..

  • Published Sep 05, 2024 | 12:27 PMUpdated Sep 05, 2024 | 12:27 PM
హైదరాబాద్ లో సరికొత్త మోసం! ఒక్క వాట్సాప్ మెసేజ్ తో రూ.13.26 కోట్లు కొట్టేశారు!

సమాజంలో సైబర్ నేరాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. వీటిపై అధికారులు ఎంత అవగాహన కల్పించినా.. ఎంత ప్రచారం చేసినా ఈ తరహా నేరాలు మాత్రం ఆగడం లేదు. ఇక తాజాగా ఇండియాలోనే అతి పెద్ద సైబర్ మోసం.. హైదరాబాద్ లో వెలుగు చూసింది. ఓ వృద్ధుడిని సైబర్ కేటుగాళ్లు నిండా ముంచారు. ఏకంగా కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులో పేరుతో ఈ మోసానికి పాల్పడ్డారు. దీంతో బాధితుడు సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. ఆ వివరాలు..

స్టాక్ మార్కెట్లలో పెట్టుబడుల పేరుతో సైబర్‌ నేరస్థుల వలకు చిక్కిన హైదరాబాద్ కు చెందిన ఓ వృద్ధుడు ఏకంగా రూ.13.26 కోట్లు పొగొట్టుకున్నాడు. హైదరాబాద్ లోనే ఇదే అతిపెద్ద సైబర్ మోసం అని పోలీసులు చెబుతున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి వాట్సప్‌ నెంబర్‌కు కొన్ని రోజుల క్రితం ఆన్‌లైన్‌ స్టాక్‌ బ్రోకింగ్‌ పేరిట మెసేజ్‌ వచ్చింది. సదరు రిటైర్డ్ ఉద్యోగికి గతంలో స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన అనుభవం ఉండటంతో.. ఆ మెసేజ్ కు స్పందించాడు.

కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో బాధితుడిని చేర్చిన సైబర్ కేటుగాళ్లు.. ప్రముఖ కంపెనీల లిస్టును అందులో పెట్టారు. ఆయా కంపెనీల ప్రతినిధులుగా తమను తాము పరిచయం చేసుకున్న సైబర్ మోసగాళ్లు బాధితుడికి షేర్ల గురించి వివరించారు. వారి మాటలు పూర్తిగా నమ్మిన బాధితుడు ఆయా కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపాడు.

సదరు ఉద్యోగి తమను పూర్తిగా నమ్మాడు అని నిర్ధారించుకున్న తర్వాత.. సైబర్ కేటుగాళ్లు..  బాధితుడి చేత పలు బ్యాంక్ అకౌట్ల నెంబర్లకు ముందుగా కొంత నగదును జమ చేయించుకున్నారు. వాటిని షేర్లలో పెట్టుబడికి ముందు లాభాలు చూపించారు. వాటిని విత్ డ్రా చేసుకునేందుకు అవకాశం కల్పించారు. దాంతో బాధితుడు సైబర్ కేటుగాళ్లను పూర్తిగా నమ్మాడు.

ఇది గమనించిన సైబర్ కేటుగాళ్లు.. బాధితుడి నుంచి దఫల వారీగా డబ్బులు లాగటం ప్రారంభించారు. ఇలా పలు ధపాలుగా మెుత్తం రూ.13.26 కోట్లను సైబర్ నేరగాళ్లు పలు బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయించుకున్నారు. ఆ తర్వాత సైబర్ నేరగాళ్ల నుంచి ఎటువంటి స్పందన లేకపోవటంతో.. తాను మోసపోయినట్లు గ్రహించాడు. వెంటనే పోలీసులను ఆశ్రయించగా.. కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైం పోలీసులు విచారణ చేపట్టారు.

విచారణ చేపట్టిన పోలీసులు ఈ కేసులో ఇప్పటికే ముగ్గురుని అదుపులోకి తీసుకోగా.. అసలు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.  ఒక వ్యక్తి సైబర్ మోసగాళ్ల చేతికి చిక్కి మోసపోవటం తొలిసారి అని పోలీసులు అంటున్నారు. సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలని అవగాహన పెంచుకోవాలని సూచిస్తున్నారు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş