iDreamPost
android-app
ios-app

Hyd వాహనదారులు అలెర్ట్.. వారం పాటు ఆ రూట్ లో వెళ్లకండి!

  • Published Oct 24, 2024 | 12:45 PM Updated Updated Oct 24, 2024 | 12:45 PM

Hyderabad: హైదరాబాద్ నగరంలో వాహనాలు నడిపే వారికి బిగ్ అలర్ట్. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Hyderabad: హైదరాబాద్ నగరంలో వాహనాలు నడిపే వారికి బిగ్ అలర్ట్. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

  • Published Oct 24, 2024 | 12:45 PMUpdated Oct 24, 2024 | 12:45 PM
Hyd వాహనదారులు అలెర్ట్.. వారం పాటు ఆ రూట్ లో వెళ్లకండి!

హైదరాబాద్ నగరం విశ్వనగరంగా ఎదుగుతోంది. హైదరాబాద్ ని మరింత సుందరీకరణ చేయాలని, నెంబర్ వన్ పర్యాటక కేంద్రంగా తీర్చి దిద్దే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. ఈ క్రమంలోనే   జాతీయ, అంతర్జాతీయ సంస్థలు నగరంలో పెట్టుబడులు పెట్టేలా ప్రయత్నాలు కొనసాగిస్తుంది. ఇప్పటికే నగరంలో పలు ప్రాంతాల్లో కొత్త రహదారులు నిర్మించారు. రాబోయే రోజుల్లో మరిన్ని అండర్ పాస్ లు, ఫ్లైఓవర్స్ నిర్మించేందుకు సిద్దమయ్యారు.  తాజాగా హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు జారీ చేశారు అధికారులు. ఈ ఆంక్షలు వారం రోజుల పాటు ఉంటాయని తెలిపారు.

హైదరాబాద్ నగరాభివృద్దిలో భాగంగా పలు కీలక ప్రాంతాల్లో అండర్‌పాసులు, స్కైవేలు, ఫ్లైఓవర్లు నిర్మిస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని వాహనదారులకు ట్రాఫిక్ అధికారులు కీలక సూచన చేశారు. నగరంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ ఎస్‌ఆర్‌డీపీ పనుల్లో భాగంగా శిల్పా లేఅవుట్ ఫేజ్-2 పరిధిలో కొత్తగా ఫ్లై ఓవర్‌ని నిర్మిస్తున్నారు.  నిత్యం రద్దీగా ఉండే గచ్చిబౌలి ఫ్లై ఓవర్ ని ముందుజాగ్రత్త చర్యగా వారం రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అక్టోబర్ 28వ తేదీ వరకు ఈ ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయెల్ డేవిస్ తెలిపారు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని అన్నారు. మిగతా సమయాల్లో వాహనదారులు రాకపోకలు సాగించే అవకాశం ఉందని అన్నారు. రాత్రి 11 తర్వాత ప్రయాణాలు సాగించే వారు వారు రోజులు ప్రత్యామ్నాయ రూట్లు ఎంచుకొని ప్రయాణాలు సాగించాలని కోరారు.

ఆంక్షలు ఉన్న సమయంలో ఈ రూట్‌లో వెళ్లకండని సూచించారు. బయోడైవర్సిటీ జంక్షన్ నుంచి ఐఐఐటీ జంక్షన్ వైపు వెళ్లే వాహనాదారులను గచ్చిబౌలి ఫ్లై ఓవర్ వద్ద బైపాస్ చేస్తారు. బిచ్చారెడ్డి స్వీట్స్ నుంచి గచ్చిబౌలి జంక్షన్ మీదుగా ఐఐఐటీ జంక్షన్ కు చేరుకునేలా ట్రాఫిక్ ను మళ్లిస్తున్నారు. ఐఐఐటీ జంక్షన్ నుంచి బయోడైవర్సీటీ జంక్షన్ కు వెళ్లే వాహనదారులు గచ్చిబౌలి జంక్షన్ పక్క నుంచి బైపాస్ చేస్తారు. అటునుంచి బయోడైవర్సిటీ జంక్షన్ కు చేరుకునేలా వీలు కల్పించారు ట్రాఫిక్ పోలీసులు. వాహనదారులు ఈ ట్రాఫిక్ మళ్లింపులను దృష్టిలో పెట్టుకొవాలని సూచించారు. వాహనదారులు తమ గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుకోవాల్సిందిగా అధికారులు చెబుతున్నారు.