Dharani
Hyd Metro Rail Management-Parking Fees: హైదరాబాద్ మెట్రో పార్కింగ్ ఫీజు విధించిన నిర్ణయం.. ప్రయాణికుల్లో తీవ్ర అసంతృప్తి నింపింది. వారు ఆందోళనకు దిగడంతో.. మెట్రో రైలు మేన్మేజ్మెంట్ దీనిపై క్లారిటీ ఇచ్చింది. ఆ వివరాలు..
Hyd Metro Rail Management-Parking Fees: హైదరాబాద్ మెట్రో పార్కింగ్ ఫీజు విధించిన నిర్ణయం.. ప్రయాణికుల్లో తీవ్ర అసంతృప్తి నింపింది. వారు ఆందోళనకు దిగడంతో.. మెట్రో రైలు మేన్మేజ్మెంట్ దీనిపై క్లారిటీ ఇచ్చింది. ఆ వివరాలు..
Dharani
హైదరాబాద్ మెట్రో స్టేషన్లలో పార్కింగ్ ఫీజులు వసూలు చేస్తున్నారంటూ బుధవారం(ఆగస్టు 14) ఉదయం నుంచి వస్తోన్న వార్తల పట్ల ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు నాగోల్ మెట్రో స్టేషన్ పార్కింగ్ ఏరియాలో వాహనాలను ఉచితంగా పార్కింగ్ చేసే అవకాశం ఉండేది.. కానీ బుధవారం నుంచి పెయిడ్ పార్కింగ్ మొదలు పెట్టారు. దీనిపై నాగోల్ స్టేషన్‌లో ప్రయాణికులు తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. మిగతా ప్రయాణికులు కూడా దీనిపై అసంతృప్తితో ఉనారు. అయితే.. ఈ పార్కింగ్ ఫీజుల విషయంపై మెట్రో యాజమాన్యం స్పందిస్తూ.. పూర్తి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది.
పార్కింగ్ ఫీజు వసూలు అంశంపై మెట్రో యాజమాన్యం స్పందిస్తూ.. నాగోల్ మెట్రో స్టేషన్‌లో ఈరోజు పార్కింగ్ ఫీజు వసూలు చేసింది నిజమే కానీ.. ఇది కేవలం పైలట్ రన్ మాత్రమేనని స్పష్టం చేసింది. ఆగస్టు 25వ తేదీ నుంచి నాగోల్ మెట్రో స్టేషన్‌లో, సెప్టెంబర్ 1వ తేదీ నుంచి మియాపూర్ మెట్రో స్టేషన్‌లో పార్కింగ్ ఫీజుల వసూళ్లు అధికారికంగా ప్రారంభమవుతాయని మెట్రో యాజమాన్యం ప్రకటించింది.
అయితే.. ఈరోజు పైలట్ రన్‌లో భాగంగానే.. వివిధ సిస్టమ్‌ల పని తీరు, సామర్థ్యాన్ని పరీక్షించడానికి నాగోల్ పార్కింగ్ సదుపాయంలో ట్రయల్ నిర్వహించినట్టు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ప్రయాణికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. మెట్రో స్టేషన్‌లో ఆందోళనకు దిగారు. దీనిపై మెట్రో యాజమాన్యం స్పందిస్తూ.. తమ ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్టు తెలిపింది. అంతేకాక పార్కింగ్ సదుపాయాల్లో ఉన్న ప్రత్యేకతల గురించి కూడా మెట్రో యాజమాన్యం చెప్పుకొచ్చింది.
తాము తీసుకున్న నిర్ణయం కేవలం ప్రయాణికులకు సురక్షితమైన, మరింత సౌకర్యవంతమైన పార్కింగ్ అనుభూతిని కల్పించగలవని తాము విశ్వసిస్తున్నామని మెట్రో యాజమాన్యం ప్రకటించింది. ఈ అంశంలో ప్రయాణికులు తమ మద్దతు, సహకారాన్ని అందించాల్సిందిగా హైదరాబాద్ మెట్రో యాజమాన్యం కోరింది.