P Krishna
Durgam Cheruvu: ఖాళీ స్థలం కనిపిస్తే చాలు.. సొంత ప్రాపర్టీగా భావించి కబ్జాలు చేసి నిర్మాణలు చేపట్టిన అక్రమార్కుల గుండెల్లో ఇప్పుడు రైళ్లు పరుగెడుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ కట్టడాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే ‘హైడ్రా’ నేతృత్వంలో అక్రమ కట్టడాలపై కొరఢా ఝులిపిస్తుంది.
Durgam Cheruvu: ఖాళీ స్థలం కనిపిస్తే చాలు.. సొంత ప్రాపర్టీగా భావించి కబ్జాలు చేసి నిర్మాణలు చేపట్టిన అక్రమార్కుల గుండెల్లో ఇప్పుడు రైళ్లు పరుగెడుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ కట్టడాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే ‘హైడ్రా’ నేతృత్వంలో అక్రమ కట్టడాలపై కొరఢా ఝులిపిస్తుంది.
P Krishna
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి తన దూకుడు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఆరు గ్యారెంటీ పథకాల అమలుపై ఫోకస్ పెట్టి కొన్ని అమలు చేశారు. ఇటీవల రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేశారు. త్వరలో నిరుద్యోగులకు ఉద్యోగాల నోటిఫికేషన్ వేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు హైదరాబాద్ లో అక్రమ కట్టడాల ప్రక్షాళన మొదలు పెట్టారు. అక్రమాలు నేలమట్టం చేసి హైదరాబాద్ లో వరదలకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగా ‘హైడ్రా’ ఏర్పాటు చేశామని రేవంత్ రెడ్డి తెలిపారు. అక్రమ కట్టడాలు కట్టింది తన సొంతవాళ్లయినా నిర్మోహమాటంగా కూల్చి వేయిస్తామని చెప్పారు. ఈ క్రమంలోనే దుర్గం చెరువులోని కాలనీల్లో పలు భవనాలకు నోటీసులు ఇచ్చారు. పూర్తి విరాల్లోకి వెళితే..
హైదరాబాద్ లో గత కొన్నిరోజులుగా అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారి కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది ‘హైడ్రా’. ప్రభుత్వ భూములు, చెరువులు, నాళాలు ఆక్రమించి, అనుమతులు లేకుండా, పరిమిషన్ తీసుకొని నిబంధనలు ఉల్లంఘించి కట్టడాలు నిర్మించిన వారికి నోటీసులు ఇస్తూ ‘హైడ్రా’ అధికారులు కూల్చివేస్తున్న విషయం తెలిసిందే. సామాన్యులు, సెలబ్రెటీలు, రాజకీయ నేతలు ఎవరైనా సరే అక్రమ కట్టడాలు నిర్మించారని తెలిస్తే చాలు నోటీసులు ఇవ్వడం కూల్చివేయడమే లక్ష్యంగా ‘హైడ్రా’ ముందుకు సాగుతుందని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైటెక్ సిటీలోని రాయదుర్గం, మాదాపూర్ పరిధిలో ఉండే దుర్గం చెరువు చుట్టూ విలాసవంతమైన భవనాలు నిర్మించిన విషయం తెలిసిందే.
ఇక్కడ కొంతమంది నిబంధనలు ఉల్లంఘించిన నిర్మాణాలు చేపట్టినట్లు హైడ్రా దృష్టికి వచ్చినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే దుర్గం చెరువులోని కాలనీల్లో మొత్తం 204 ఇళ్లకు జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. దీంతో నోటీలసులు అందుకున్న వాళ్లంతా వణికిపోతున్నారు. కాగా, నోటీసులు అందుకున్న వారిలో సినీ, రాజకీయ, పారిశ్రామిక రంగాలకు చెందిన వారు కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతే కాదు ఇక్కడ ఐఏఎస్, ఐఆర్ఎస్ అధికారలు నివాసం ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే మాదాపూర్ లో నటుడు నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ని కూల్చి వేసిన విషయం తెలిసిందే.