iDreamPost
android-app
ios-app

ఫొటోషూట్ కోసం Hyderabadలో బెస్ట్ లోకేషన్లు ఇవే.. రూపాయి ఖర్చు లేకుండా

  • Published Aug 16, 2024 | 8:01 PM Updated Updated Aug 18, 2024 | 11:33 AM

Hyderabad Best Photoshoot Locations: నేటి కాలంలో ఫొటోషూట్ లకు ప్రాధాన్యత పెరుగుతోంది. మరి హైదరాబాద్ లో బెస్ట్ లోకేషన్స్ ఎక్కడ ఉన్నాయో మీరు తెలుసుకొండి.

Hyderabad Best Photoshoot Locations: నేటి కాలంలో ఫొటోషూట్ లకు ప్రాధాన్యత పెరుగుతోంది. మరి హైదరాబాద్ లో బెస్ట్ లోకేషన్స్ ఎక్కడ ఉన్నాయో మీరు తెలుసుకొండి.

  • Published Aug 16, 2024 | 8:01 PMUpdated Aug 18, 2024 | 11:33 AM
ఫొటోషూట్ కోసం Hyderabadలో బెస్ట్ లోకేషన్లు ఇవే.. రూపాయి ఖర్చు లేకుండా

ఒకప్పుడు ఫొటోలు దిగాలంటే.. పెళ్లి వంటి శుభకార్యాలు జరగాలి. లేదంటే ఫొటో స్టూడియోకి వెళ్లాలి. అది కాదనుకుంటే.. ప్రత్యేకంగా ఫొటో గ్రాఫర్ ని ఇంటికి పిలిపుంచుకోవాల్సి వచ్చేది. అయితే మారుతున్న కాలంతో పాటు కొత్త ట్రెండ్స్ వస్తున్నాయి. ఇక నేటి కాలంలో పెళ్లి, ప్రెగ్నెన్సీ, బిడ్డ పుట్టినప్పుడు, వారు పెరుగుతున్న సమయంలో ఇలా ప్రతి ప్రత్యేక సందర్భాన్ని ఫొటోల్లో బంధిస్తూ.. అందమైన అనుభూతులుగా మలచుకోవాలని భావిస్తున్నారు. దీనిలో భాగంగా వచ్చిందే ఫొటోషూట్ ట్రెండ్. పెళ్లి తంతుతో మొదలైన ఈ ఫొటో షూట్ ట్రెండ్ ని.. ఇప్పుడు ప్రతి చిన్నా, పెద్దా శుభకార్యానికి ఫాలో అవుతున్నారు.

ఫొటోషూట్ చేసుకోవడం కోసం మంచి లోకేషన్ ను సెలక్ట్ చేసుకోవడం అన్నింటి కన్నా ముఖ్యం. ఇందుకోసం మీరు ఎక్కెడెక్కడికో వెళ్లాల్సిన పని లేదు. మన హైదరాబాద్ లోనే బెస్ట్ లోకేషన్లు అందుబాటులో ఉన్నాయి. పైగా ఇక్కడ ఫొటోషూట్ కోసం మీరు రూపాయి ఖర్చు చేయాల్సిన పని లేదు. ఆ వివరాలు..

గోల్కొండ కోట

నగరంలో బెస్ట్ ఫొటోషూట్ లోకేషన్ అనగానే అందరికి ముందుగా గుర్తుకు వచ్చేది గోల్కొండ కోట. ఇక ప్రీవెడ్డింగ్, కిడ్స్ షూట్, మెటర్నిటీ షూట్లకు కూడా ఇది బెస్ట్ లొకేషన్ అని చెప్పొచ్చు. కెమెరాకు ప్రత్యేక ధర చెల్లిస్తే ఇక్కడ షూట్ చేసుకోవచ్చు.

అమ్మపల్లి టెంపుల్

ఫొటోషూట్ కోసం నగరంలో బెస్ట్ లోకేషన్ అంటే అమ్మపల్లి టెంపుల్. శంషాబాద్ బస్ స్టాప్ నుంచి సుమారు 5 కిమీ దూరంలో ఉంటుందీ ఆలయం. దీన్నే అమ్మపల్లి శ్రీ రామ చంద్ర స్వామి టెంపుల్ అనీ పిలుస్తారు. ఈ గుడి సమీపంలో ఉన్న కొలను దగ్గర ఎన్నో సినిమా షూటింగ్ లు జరిగాయి. ఇక్కడ ఫొటోషూట్ కోసం బట్టలు మార్చుకోడానికి వసతులు కూడా ఉంటాయి. కాకపోతే ఇక్కడ షూటింగ్ కోసం మూడు వేల దాకా చెల్లించాల్సి ఉంటుంది.

చార్మినార్

చార్మినార్, ఆ వీధి అందాలను సరైన సమయంలో క్లిక్ మనిపిస్తే ఫొటోలు అద్భుతంగా వస్తాయి. రాత్రి పూట లాడ్ బజార్లో, ఉదయం సమయంలో చార్మినార్ ముందు షూటింగ్ చేయొచ్చు. రూపాయి ఖర్చు లేకుండా ఫొటోషూట్ అయిపోతుంది.

శిల్పారామం

మాదాపూర్‌లో సుమారు 65 ఎకరాల్లో విస్తరించి ఉన్న శిల్పారామం.. పల్లెటూరి వాతావరణం థీమ్‌తో ఫొటోషూట్ కోసం బెస్ట్ లోకేషన్. వీకెండ్స్‌లో రద్దీ వల్ల ఇక్కడ షూట్ కష్టం. కానీ వారం మధ్యలో వెళ్తే మంచి ఫొటోలు తీసుకోవచ్చు.

ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్

సంజీవయ్య పార్కు రోడ్డు నుంచి ట్యాంక్ బండ్, అటు నుంచి ఎన్టీ‌ఆర్ గార్డెన్స్.. ఇవన్నీ ఫొటోషూట్ కోసం బెస్ట్ లొకేషన్లు. ఉదయం పూట సూర్యోదయం సమయంలో వెళ్తే తక్కువ రద్దీ ఉంటుంది. మెటర్నిటీ, ప్రీవెడ్డింగ్.. ఏవైనా షూట్ చేసుకోవచ్చు.

వీటితో పాటే.. దుర్గం చెరువు, దక్కన్ పార్క్, లుంబినీ పార్క్, లోటస్ పాండ్, చౌమహల్లా ప్యాలెస్, తారామతి బరాదారి, ది హిడెన్ క్యాసల్, అమీన్ పుర లేక్, ఫలక్‌నుమా ప్యాలెస్, దుర్గం చెరువు లేక్ ఫ్రంట్ పార్క్, లుంబిని పార్క్, ఎన్‌టీఆర్ గార్డెన్స్ వంటి ప్రాంతాలు కూడా ఫొటోషూట్ కోసం బెస్ట్ లోకేషన్స్ అని చెప్పవచ్చు.