P Krishna
Chaderghat Hydra Demolitions: హైదరాబాద్‌లో చెరువులు, నాలాలు, ప్రభుత్వ స్థలాలు కబ్జ చేసిన నిర్మించిన కట్టడాలను బుల్డోజర్ల సాయంతో కూల్చి వేస్తుంది ‘హైడ్రా’. సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా విషయంలో ఎక్కడ తగ్గడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి.
Chaderghat Hydra Demolitions: హైదరాబాద్‌లో చెరువులు, నాలాలు, ప్రభుత్వ స్థలాలు కబ్జ చేసిన నిర్మించిన కట్టడాలను బుల్డోజర్ల సాయంతో కూల్చి వేస్తుంది ‘హైడ్రా’. సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా విషయంలో ఎక్కడ తగ్గడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి.
P Krishna
హైదరాబాద్ లో హైడ్రా మరోసారి హల్ చల్ కొనసాగించింది. ఓ వైపు తెలంగాణ హై కోర్టు చివాట్లు పెట్టినా..హైడ్రా తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. సోమవారం కోర్టు హైడ్రా చట్టబద్దత ఏంటీ? కూల్చి వేతలపై ఎందుకు అంతగా ఫోకస్ పెడుతున్నారు? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే హైడ్రా వీటిని ఏమాత్రం పట్టించుకోకుండా కూల్చివేతల కార్యక్రమాన్ని కొనసాగిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే మంగళవారం (అక్టోబర్ 1) చాదర్ ఘాట్ ముసానగర్, శంకర్ నగర్ లో రెడ్డ మార్క్ వేసిన ఇళ్ల కూల్చివేతల పనులు ప్రారంభం అయ్యాయి. ఈ క్రమంలో అక్కడ బస్తీవాసులు అధికారులపై తిరగబడ్డారు. వివరాల్లోకి వెళితే..
మూసీ పరివాహక ప్రాంతాల్లో మంగళారం ఉదయం హైడ్రా కూల్చి వేతల పనులు మొదలు పెట్టింది. మూసీ రివర్ బెడ్ లో అక్రమంగా నిర్మించిన నిర్మాణలను రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు తొలగిస్తున్నారు. చాదర్ ఘాట్, శంకర్ నగర్, రసూల్‌పురా, వినాయక్‌నగర్ బస్తీల్లో కూల్చి వేతలను అధికారులు ప్రారంభించే సమయంలో అక్కడ కొంతమంది బస్తీవాసులు నిరసనలు తెలిపారు. తాము RB- X అని రాసి ఇళ్లను మాత్రమే కూల్చి వేస్తున్నామని అధికారులు వెల్లడించారు. కూల్చి వేతల సమయంలో ఎలాంటి అవాంతరాలు జరగకుండా భారీగా పోలీసులను మోహరించారు. ఇప్పటికే మూసీ రివర్ బెడ్ నుంచి ఖాళీ చేయించిన కుటుంబాలకు పిల్లిగుడిసెలు ప్రాంతంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయించిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే శంకర్ నగర్ వాసులకు అధికారులకు మధ్య పెద్ద ఎత్తున వాగ్వాదం మొదలైంది. ఇళ్లు ఖాళీ చేయాలని శంకర్ నగర్ వాసులకు అధికారులు కోరగా.. ససేమిరా అన్నారు బస్తీవాసులు. ఈ క్రమంలోనే అక్కడ టెన్షన్ వాతారణం ఏర్పడింది. కూల్చి వేతల సమయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న దృష్ట్యా ఓల్డ్ మలక్ పేటలో కూడా భారీగా పోలీసుల బలగాలు మోహరించాయి. మరోవైపు బస్తీవాసులు అధికారులతో తాము ఇళ్లు ఖాళీ చేయమని.. తమకు డబులు బెడ్ రూమ్ కూడా అవసరం లేదని స్థానికి అధికారులతో పెద్ద ఎత్తున గొడవకు దిగారు. ఇక్కడ కాలనీ వాసులు అధికారులపై తిరగబడటంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.