iDreamPost
android-app
ios-app

RTC ప్రయాణికులకు బిగ్ అలెర్ట్.. సొంతూర్లకు వెళ్తున్నారా?

Hyderabad News: సెలవులు వస్తున్నాయి అంటే చాలు బస్టాండ్ లు, రైల్వే స్టేషన్లలో జనం కిక్కిరిసి కనిపిస్తుంటాయి. సొంతూర్లకు వెళ్లేందుకు నగరవాసులు సిద్ధమవుతుంటారు. ఈ నేపథ్యంలోనే నగరంలోనే ప్రధాన బస్ స్టేషన్లు ప్రయాణికులకతో కిటకిటలాడుతుంటాయి.

Hyderabad News: సెలవులు వస్తున్నాయి అంటే చాలు బస్టాండ్ లు, రైల్వే స్టేషన్లలో జనం కిక్కిరిసి కనిపిస్తుంటాయి. సొంతూర్లకు వెళ్లేందుకు నగరవాసులు సిద్ధమవుతుంటారు. ఈ నేపథ్యంలోనే నగరంలోనే ప్రధాన బస్ స్టేషన్లు ప్రయాణికులకతో కిటకిటలాడుతుంటాయి.

RTC ప్రయాణికులకు బిగ్ అలెర్ట్.. సొంతూర్లకు వెళ్తున్నారా?

సెలవులు అంటే చాలు సొంతూర్లకు వెళ్లేందుకు నగరవాసులు సిద్ధమవుతుంటారు. ఈ నేపథ్యంలోనే నగరంలోనే ప్రధాన బస్ స్టేషన్లు ప్రయాణికులకతో కిటకిటలాడుతుంటాయి. తాజాగా నేటి నుంచి ఐదు రోజులు సెలవులు రావడంతో చాలా మంది తమ సొంతూర్లకు బయల్దేరుతున్నారు. ఈ క్రమం గురువారం జూబ్లీ బస్ స్టేషన్ లో ప్రయాణికుల రద్దీ బాగా కనిపించింది. ఏ బస్ చూసిన జనాలతో కిటకిటలాండిది.

నేడు ఆగష్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం, ఆగస్ట్ 16న వరలక్ష్మి వ్రతం, ఆగస్టు 17, 18 వీకెండ్ కావడంతో వరుస సెలవులు వచ్చాయి. దీంతో హైదరాబాద్ నగరంలో ఉద్యోగాలు  చేస్తున్న జనం సొంతూళ్ల పయనం అవుతున్నారు. పాఠశాలలు, కాలేజీలతో పాటు పలు ప్రభుత్వ ఆఫీసులకు హాలీడే కావడంతో జేబీఎస్ నుంచి ఉత్తర తెలంగాణ వైపు వెళ్లే బస్సులు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. అలానే నల్గొండ, వరంగల్ వైపు వెళ్లే బస్సుల్లో కూడా రద్దీ బాగా ఉంది. సికింద్రాబాద్, కాచిగూడా రైల్వే స్టేషన్లలో కూడా దాదాపు ఇదే పరిస్థితి కనిపించింది. ఏపీతో పాటు ఇతర రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికులతో ప్రధాన రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లలో పండుగల సమయంలో కనిపించే దృశ్యాలు కనిపించాయి. ఎంజీబీఎస్ బస్ స్టేషన్ లో సైతం ప్రయాణికులు ఫుల్ ఉన్నారు. విజయవాడ వైపు వెళ్లే బస్సుల్లో ఖాళీ లేని పరిస్థితి. పిల్లలతో వెళ్లే వారు కాస్తా జాగ్రత్తగా జర్నీని ప్లాన్ చేసుకోవాలని అధికారులు చూస్తున్నారు.

సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రజలు బస్సులు, రైళ్లలో ముందే బుక్ చేసుకున్నారు. అదే విధంగా ముందుగా రిజర్వేషన్ చేసుకోకుండా నేరుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు, జేబీఎస్, ఎంజీబీఎస్ వెళ్తున్న ప్రయాణికులు సీట్ల కోసం ఇబ్బందులు పడుతున్నారు. ఊళ్లకు వెళ్లే ప్రయాణికులతో ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్, ఎల్బీ నగర్ ప్రాంతాల్లో గురువారం ఫుల్ రష్ కనిపించింది. నగర శివారు ప్రాంతాలతో పాటు బీబీనగర్ టోల్ ప్లాజా, పంతంగి టోల్ ప్లాజా వద్ద  కిలోమీటర్ల  మేర ట్రాఫిక్ జామైంది. ఇక.. సొంతూర్లకు వెళ్లే వారిని పోలీసులు అలర్ట్ చేశారు. డబ్బు, బంగారు నగలు సహా విలువైన వస్తువులను ఇండ్లలో పెట్టకూడదని సూచిస్తున్నారు. సొంతూరికి వెళ్తున్నట్లు సోషల్ మీడియా అకౌంట్లలో షేర్ చేయొద్దని సూచించారు. మొత్తంగా ఊర్లకు వెళ్తున్న వారు పై విషయాలను గమనించి ప్రయాణలు చేయడం ఉత్తమం.