Dharani
Heavy Rain In Hyderabad: మంగళవారం ఉదయాన్నే జోరు వాన మొదలైంది. నగరం తడిసి ముద్దయ్యింది.
Heavy Rain In Hyderabad: మంగళవారం ఉదయాన్నే జోరు వాన మొదలైంది. నగరం తడిసి ముద్దయ్యింది.
Dharani
హైదరాబాద్‌లో మంగళవారం ఉదయం వాతావరణం ఒక్కసారిగా మారింది. అప్పటి వరకు పొడిగా ఉన్న వెదర్ ఉన్నట్లుండి ఒక్కసారిగా మారిపోయింది. జోరు వాన కురిసింది. దాంతో ఉదయం పూట ఆఫీసులు, స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే వారికి తీవ్ర ఇబ్బంది తలెత్తింది. ఇక ఆదివారం రాత్రంతా జోరు వాన కురిసింది. సోమవారం ఉదయం 8 గంటల ప్రాంతం వరకు ముసురు కొనసాగింది. తర్వాత వాతావరణం పొడి బారింది. మళ్లీ మంగళవారం ఉదయం వాన దంచి కొట్టింది. నేడు నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్, యూసుఫ్‌గూడ, మధురానగర్ సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది.
ఇప్పటికే నగరంలో జోరు వాన కురుస్తుండగా.. హైదరాబాద్ వాతావరణ కేంద్రం మరో అలర్ట్ జారీ చేసింది. రానున్న నాలుగు రోజులు ఇలానే వర్షాలు కురుస్తాయని చెప్పుకొచ్చింది. వాతావరణం మేఘావృతమై ఉంటుందని అంచనా వేసింది. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అంతేకాక తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు పడతాయని కూడా చెప్పింది వాతావరణ కేంద్రం. హైదరాబాద్‌తో పాటు సంగారెడ్డి, కరీంనగర్, సిద్దిపేట, మల్కాజిగిరి, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, కరీంనగర్ జిల్లాలలో వర్షాలు పడే సూచనలు ఉన్నాయని తెలిపింది.
నేడు హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం అయ్యారు. లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అలాగే సహాయక సిబ్బంది కూడా అలర్ట్ అయ్యారు. ఎక్కడైన ఇబ్బందులు తలెత్తిత్తే వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు అందించనున్నారు.