Krishna Kowshik
Hyderabad: హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ మాములుగా ఉండదు. ప్రయాణికులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతంకు వెళ్లాలన్నా నరకయాతన పడుతున్నారు. రోజు రోజుకు ఈ సమస్య పెరుగుతోంది. దీనికి చెక్ పెట్టేందుకు కొత్త ఫ్లైఓవర్లు నిర్మించనుంది రేవంత్ సర్కార్. ఏ ఏరియాల్లో అంటే.?
Hyderabad: హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ మాములుగా ఉండదు. ప్రయాణికులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతంకు వెళ్లాలన్నా నరకయాతన పడుతున్నారు. రోజు రోజుకు ఈ సమస్య పెరుగుతోంది. దీనికి చెక్ పెట్టేందుకు కొత్త ఫ్లైఓవర్లు నిర్మించనుంది రేవంత్ సర్కార్. ఏ ఏరియాల్లో అంటే.?
Krishna Kowshik
హైదరాబాద్ మహా నగరంలో రోజూ రోజూకు జన జీవనం పెరుగుతోంది. చదువు, ఉద్యోగం, వ్యాపారం, ఇతర పనుల మీద పొరుగు రాష్ట్రాలకు చెందిన ప్రజలు వచ్చి జీవిస్తున్నారు. మిగిలిన నగరాలన్నీ నిద్రపోతాయో లేదో తెలియదు కానీ భాగ్య నగరి మాత్రం బజ్జోదు. 24/7 ఇక్కడ రహదారుల్లో వాహనాలు రాకపోకలు సాగిస్తూనే ఉంటాయి. పగటి పూటే కాదు నగరంలో రాత్రుళ్లు కూడా విపరీతమైన రద్దీ ఉంటుంది. దీంతో గమ్య స్థానాలకు చేరుకోవాలంటే గంటల పాటు ప్రయాణించాల్సి వస్తుంది. ఒక్కసారి ట్రాఫిక్‌లో చిక్కుకున్నామంటే.. ఆఫీసుకు లేదా ఇంటికి ఎప్పుడు చేరుకుంటామో చెప్పడం కష్టం. ఆ ట్రాఫిక్, రద్దీని దృష్ట్యా ఇప్పటికే పలు వంతెనలు, రోడ్ల విస్తరణ చేపడుతుంది రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ సర్కార్. ఇప్పుడు మరికొన్నింటిపై దృష్టి సారిస్తుంది.
రద్దీని తగ్గించేందుకు ట్రాఫిక్ ప్రధాన కారిడార్లలో కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించినట్లు జీహెచ్ఎంసీ కమీషనర్ ఆమ్రపాలి వెల్లడించారు. ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉండే.. చార్మినార్ జోన్‌లో రహదారులను ఆమె తనిఖీ చేశారు. ఈ మేరకు ఏఏ రహదారుల విస్తరణ చేపట్టే ప్రతిపాదన ఉందో.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. శాస్త్రీపురం జంక్షన్ నుంచి ఇంజన్‌బౌలి వరకు 100 అడుగులతో రహదారి నిర్మించనున్నారు. బెంగళూరు జాతీయ రహదారి నుంచి శాస్త్రీపురం జంక్షన్ వరకు 100 అడుగుల రహదారి విస్తరణ చేపట్టనున్నారు. అలాగే చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్ నుంచి పోలీస్ స్టేషన్ మీదుగా బార్కాస్ రహదారి వరకు 60 అడుగుల మేర రోడ్డు విస్తరణ చేపట్టనున్నారు. ఆజీం హోటల్ నుంచి చర్చి గేట్ వరకు రోడ్డు విస్తరణ చేపట్టనున్నారు. 80 అడుగుల మేర రహదారిని విస్తరిస్తారు. లక్కీ స్టార్ హోటల్ నుంచి హఫీజ్ బాబా నగర్ వరకు 60, 40 అడుగుల వెడల్పు రోడ్డును నిర్మిస్తారు
అలాగే హఫీజ్ బాబా నగర్ జంక్షన్ వద్ద ఫ్లైఓవర్ నిర్మించనున్నారు. బండ్లగూడ జంక్షన్ వద్ద కొత్తగా ఫ్లైఓవర్, ఒవైసీ జంక్షన్ వద్ద ఎడమవైపు డౌన్ ర్యాంపు నిర్మాణం చేపట్టనున్నారు. అదే బండ్లగూడ నుండి ఎర్రకుంట వరకు రోడ్డు విస్తరణ, అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. అయితే ఇవన్నీ ప్రతిపాదన దశలో ఉన్నాయి. వీటికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలున్నాయి. ఈ పనులు చేపడితే.. చార్మినార్ జోన్, బండ్లగూడ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పడినట్లే. ఇవే కాదు ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు మెట్రో కూడా విస్తరిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. హైదరాబాద్ శివారు ప్రాంతాలైన హయత్ నగర్, శంషాబాద్, బీహెచ్ఈఎల్, పటాన్ చెరు వరకు విస్తరించేందుకు ప్రణాళిక సిద్దం చేశారు.