P Krishna
GHMC Mayor Gadwal Vijayalakshmi: భాద్రపద మాసంలో శుక్ల పక్ష చతుర్ధి తేది గణేష్ ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. రేపు శనివారం (సెప్టెంబర్ 7) నాడు గణేష్ చతుర్ది జరుపుకుంటారు. పది రోజుల పాటు జరిగే ఈ పండుగ దేశం మొత్తం ఎంతో భక్తితో జరుపుకునేందుకు సిద్దమవుతున్నారు భక్తులు.

గణేష్ చతుర్ధి సందర్భంగా గణపతి బప్పాకు స్వాగతం పలికేందుకు దేశ వ్యాప్తంగా మండపాలు సిద్దమయ్యాయి. గణేష్ భక్తులు ఈ పండుగను ఎంతో వైభవంగా జరుపుకుంటారు. స్వామి వారి కీర్తనలు, భజనలు తో వీధులన్నీ ప్రతిధ్వనిస్తుంటాయి. ఇంట్లో గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించి నైవేద్యాలు సమర్పిస్తారు భక్తులు. 10 రోజుల పాటు జరిగే ఈ పండుగ అనంత చతుర్ధశి నాడు గణేష్ నిమజ్జనంతో ముగుస్తుంది. వినాయక చవితి సందర్భంగా పర్యావరణ హితం కోసం మట్టి గణపతి విగ్రహాలను ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాగే మండపాల్లో కొన్ని నియమనిబంధనలు పాటించాల్సి ఉంటుంది. వివరాల్లోకి వెళితే..
రేపు వినాయక చవితి.. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా హైదరాబాద్ జీహెచ్ఎంసీ అధ్వర్యంలో 3.50 లక్షల మట్టి గణపతి విగ్రహాలు పంపినీ చేసినట్లు నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో గురువారం ఆమె ఉద్యోగులుకు, సిబ్బందికి మట్టి విగ్రహాలు పంపిణీ చేశారు. పర్యావరణం పట్ల ప్రజలకు అవగాహన పెంచేందుకు జీహెచ్ఎంసీ ద్వారా మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్నామని ఆమె చెప్పారు. వినాయక చవితి ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు.
నగరంలో మండపాల్లో ఈ రూల్స్ తప్పనిసరి :