iDreamPost
android-app
ios-app

వణికిస్తున్న వర్షాలు.. హైదరాబాద్‌ ప్రజలకు GHMC కమిషనర్‌ వార్నింగ్‌!

  • Published Sep 01, 2024 | 3:49 PM Updated Updated Sep 01, 2024 | 3:49 PM

Heavy Rain, GHMC Commissioner, Amrapali, Hyderabad: భారీ వర్షాలతో భయాందోళనలకు గురవుతున్న హైదరాబాద్‌ నగర వాసులకు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆమ్రపాలి కీలక సూచనలు చేశారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

Heavy Rain, GHMC Commissioner, Amrapali, Hyderabad: భారీ వర్షాలతో భయాందోళనలకు గురవుతున్న హైదరాబాద్‌ నగర వాసులకు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆమ్రపాలి కీలక సూచనలు చేశారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

  • Published Sep 01, 2024 | 3:49 PMUpdated Sep 01, 2024 | 3:49 PM
వణికిస్తున్న వర్షాలు.. హైదరాబాద్‌ ప్రజలకు GHMC కమిషనర్‌ వార్నింగ్‌!

భారీ వర్షాలు.. హైదరాబాద్‌ను హడలెత్తిస్తున్నాయి. ఎక్కడ చూసినా.. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. శనివారం నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు నగరం అంతా అతలాకుతలం అవుతోంది. ఈ క్రమంలోనే జీహెచ్‌ఎంసీ(గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌) కమిషనర్‌ ఆమ్రపాలి నగరవాసులకు హెచ్చరికలు జారీ చేశారు. అత్యవసరం అయితే తప్ప.. ఎవరూ బయటికి రావొద్దంటూ సూచించారు. ఇప్పటికే పలు కాలనీలు నీట మునిగి ఉన్నాయి.. అలాగే పలు చోట్ల రోడ్లన్నీ జలమయంగా మారిపోయాయి. తెలుగుతల్లి ఫ్లైఓవర్‌ వద్ద ఓ భారీ వృక్షం కూడా కూలిపోయింది.

నగర ప్రజలను సురక్షితంగా ఉంచేందుకు జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తంగా ఉంచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని కమిషనర్‌ వెల్లడించారు. ప్రజలు మ్యాన్ హోల్స్ ఓపెన్ చేయకూడదని, ఎక్కడైనా ఓపెన్ చేసి ఉంటే.. జీహెచ్ఎంసీ కంట్రోల్ రూంకు తెలియజేయాలని కోరారు. వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. సహాయం కోసం హెల్ప్ లైన్ 040- 21111111 లేదా 9000113667(DRF) నంబర్లను సంప్రదించాలని కమిషనర్ సూచించారు.

ఇప్పటికే వాతావరణ శాఖ గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ప్రజలు ఇంటి వద్దనే ఉండాలని, అత్యవరమైతేనే బయటకు రావాలని కోరింది. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్దులు ఎట్టి పరిస్థితుల్లోనూ.. ఒంటరిగా బయటకు రాకుండా ఉండాలని హెచ్చరించింది. అనవసరంగా బయటికి వచ్చి.. రోడ్ల పై నడవడం, నీరు నిలువ ఉన్న ప్రాంతాల్లో సంచరించడం లాంటివి చేయకూడదని సూచించింది. బైకులతో రోడ్లపై నీరు నిలువ ఉన్న ప్రాంతాల్లో వెళ్లొద్దని కూడా సూచించారు. మరి వర్షాల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ తీసుకుంటున్న చర్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.