Dharani
Rs 99 Fare From Bangalore-Hyderabad: హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లాలంటే ఎంత లేదన్న.. వేల రూపాయలు ఖర్చు చేయాలి. కానీ మీ కోసం ఓ ఆఫర్.. కేవలం 99 రూపాయలకే హైదరాబాద్ టూ బెంగళూరు వెళ్లవచ్చు. ఎలా అంటే..
Rs 99 Fare From Bangalore-Hyderabad: హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లాలంటే ఎంత లేదన్న.. వేల రూపాయలు ఖర్చు చేయాలి. కానీ మీ కోసం ఓ ఆఫర్.. కేవలం 99 రూపాయలకే హైదరాబాద్ టూ బెంగళూరు వెళ్లవచ్చు. ఎలా అంటే..
Dharani
సాధారణంగా రైలు ప్రయాణంలో మాత్రమే టికెట్ రేటు చాలా తక్కువగా ఉంటుంది. స్లీపర్ బుక్ చేసుకున్నా.. టికెట్ రేటు మాత్రం బస్సుతో పోలిస్తే.. తక్కువే. ఇక బస్సుల్లో అది కూడా లోకల్ ప్రయాణాలకు టికెట్ ధర తక్కువగా ఉంటుంది. కానీ అంతర్రాష్ట్ర ప్రయాణాలు చేయాలంటే.. భారీగానే ఖర్చు చేయాల్సి వస్తుంది. మన దగ్గర ఎక్కువగా బెంగళూరు నుంచి హైదరాబాద్ తిరిగే ప్రయాణికులు సంఖ్య భారీగానే ఉంటుంది. వీరిలో కొందరు రైళ్లలో ప్రయాణం చేస్తే.. చాలా మంది త్వరగా వెళ్లాలనే ఉద్దేశంతో.. బస్సులకే ప్రాధాన్యత ఇస్తారు. అయితే టికెట్ రేటు మాత్రం భారీగానే ఉంటుంది. కానీ ఓ కంపెనీ ఇప్పుడు మీకు బంపరాఫర్ ఇస్తుంది. కేవలం 99 రూపాయలకే బెంగళూరు నుంచి హైదరాబాద్ ప్రయాణం చేయవచ్చు. ఆ వివరాలు..
బెంగళూరు నుంచి హైదరాబాద్ కు కేవలం 99 రూపాయల ఖర్చుతో ప్రయాణించవచ్చని ప్రకటించింది జర్మనీ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు నిర్వర్తిస్తున్న ట్రావెల్- టెక్ సంస్థ ఫ్లిక్స్‌బస్. తన బస్సు సర్వీసుల్ని దక్షిణ భారతదేశంలోకి విస్తరించినట్లు సెప్టెంబర్ 3న దీనిపై ప్రకటన చేసింది. సెప్టెంబర్ 10 నుంచి బస్సు కార్యకలాపాలు ప్రారంభమవుతాయని పేర్కొంది. ఈ సర్వీసులు బెంగళూరు నుంచి హైదరాబాద్, చెన్నైకి ఉంటాయని ఫ్లిక్స్ బస్ వెల్లడించింది. ఆ తర్వాత దక్షిణ భారతదేశంలోని ఇతర ప్రధాన నగరాలైన కోయంబత్తూర్, మదురై, తిరుపతి, విజయవాడ, బెళగావికి విస్తరించనున్నట్లు సంస్థ తెలిపింది.
ఈ ఫ్లిక్స్‌బస్ ఇప్పటివరకు 6 బస్ ఆపరేటర్లతో భాగస్వామ్యం కలిగి ఉంది. ఇక దీనిని త్వరలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళలోని 33 నగరాలు సహా సౌత్ ఇండియాలో మొత్తం మరో 200 కనెక్షన్స్‌కు బస్సు సర్వీసులు కల్పించేందుకు ప్రయత్నిస్తామని ఫ్లిక్స్ బస్ పేర్కొంది. అంతేకాక ప్రారంభ ఆఫర్ లో భాగంగా 99 రూపాయలకే ప్రయాణం చేసే అవకాశం కల్పిస్తోంది.
ఈ ఆఫర్ లో భాగంగా బెంగళూరు నుంచి ఎక్కడికైనా తమ బస్సు సర్వీసుల్లో ప్రమోషనల్ ఆఫర్ కింద రూ. 99 తోనే ప్రయాణించే వెసులుబాటు కల్పిస్తున్నట్లు ఫిక్స్‌బస్ వెల్లడించింది. బెంగళూరు నుంచి హైదరాబాద్, చెన్నైలకు రూ.99తోనే ప్రయాణం చేయవచ్చన్నమాట. సెప్టెంబర్ 3-15 వరకు ఈ ఆఫర్ ఉంటుందని.. అప్పటి వరకు మాత్రమే ఈ రూట్లలో టికెట్స్ బుక్ చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ రోజుల్లో బుక్ చేసుకున్నవారు సెప్టెంబర్ 10 నుంచి అక్టోబర్ 6 వరకు ప్రయాణ తేదీల్లో రూ. 99తోనే ప్రయాణించొచ్చని వెళ్లడించింది. ఈమధ్య కాలంలో బెంగళూరు నుంచి హైదరాబాద్ ప్రయాణం చేయాలనుకునే వారు ఈ ఆఫర్ వినియోగించుకోవాలని సంస్థ కోరింది.