iDreamPost
android-app
ios-app

హుస్సేన్ సాగర్ లోకి భారీ వరద.. ప్రజలను అలర్ట్ చేసిన అధికారులు!

Hyderabad News: హైదరాబాద్ నగరంలో కుండపోతగా వాన కురిసింది. సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం ఉదయం వరకు వాన దంచికొట్టింది. దీంతో హుస్సేన్ సాగర్ నిండుకుండాల మారింది. ఈ క్రమంలోనే నగర ప్రజలను అధికారులు అలెర్ట్ చేశారు.

Hyderabad News: హైదరాబాద్ నగరంలో కుండపోతగా వాన కురిసింది. సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం ఉదయం వరకు వాన దంచికొట్టింది. దీంతో హుస్సేన్ సాగర్ నిండుకుండాల మారింది. ఈ క్రమంలోనే నగర ప్రజలను అధికారులు అలెర్ట్ చేశారు.

హుస్సేన్ సాగర్ లోకి భారీ వరద.. ప్రజలను అలర్ట్ చేసిన అధికారులు!

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. వివిధ జిల్లాల్లో భారీ వానలకు కురవడంతో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. హైదరాబాద్ నగరంలో కూడా సోమవారం నుంచి భారీ వాన కురుస్తుంది. ఇక సోమవారం సాయంత్రం, మంగళవారం తెల్లవారు జాము సమయంలో కుండపోత వాన కురిసింది. దీంతో నగరంలోని అనేక ప్రాంతాలు, కాలనీలు చెరువులను తలపించాయి. ఇదే సమయంలో హుస్సేన్ సాగర్ కి భారీగా వరద నీరు చేరి..నిండుకుండాల మారింది. దీంతో ప్రజలను జీహెచ్ఎంసీ అధికారులు అలెర్ట్ చేస్తున్నారు.

హైదరాబాద్ లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి  హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది. ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో నీటి నిల్వ ప్రమాదకర స్థాయికి చేరింది. హుస్సేన్ సాగర్ వద్ద నీటిమట్టాన్ని జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత, అధికారులు పరిశీలించారు. సాగర్ దిగువన ఉన్న ప్రాంతాల ప్రజలు అప్రమతంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా బంజారా, పికెట్, కూకట్ పల్లి ప్రాంతాల నుంచి హుస్సే సాగర్ లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ క్రమంలో సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టంకి చేరింది.

హుస్సేన్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 513.41 మీటర్లు కాగా.. ప్రస్తుతం  513.40 మీటర్ల మేర నీటి మట్టం ఉంది. ఇక ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు ప్లువీస్ గేట్ ఓపెన్ చేసి మూసీలోకి అధికారులు నీటిని విడుదల చేశారు. అదే విధంగా తూముల ద్వారా సాగర్ నుంచి నీటిని మూసీ నదిలోకి  విడుదల చేస్తున్నారు. వరద నీరు తగ్గడపోవడంతో హుస్సేన్ సాగర్ నీటి మట్టాన్ని ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తున్నారు.  ప్రస్తుతం సాగర్ ఇన్ ఫ్లో 1850 క్యూసెక్కులు కాగా… ఔట్ ఫ్లో 1600 క్యూసెక్కులుగా ఉంది. ఈ నేపథ్యంలో హుస్సేన్ సాగర్ దిగువ ప్రాంత ప్రజలను జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం చేశారు.

ఇక హైదరాబాద్ నగరంలో సోమవారం నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రహదారులపై వరద నీరు చేరిపోవటంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యి.. రాకపోకలు సాగించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక నగరంలోని పలు కాలనీలు అయితే వరద నీటిలో చిక్కుకున్నాయి. పలు ప్రాంతాల్లో బైకులు, కార్లు వరద నీటిలో కొట్టుకోపోయాయి. అలానే పార్సిగూడా ప్రాంతంలో ఓ గుర్తు తెలియన వ్యక్తి మృతదేహం వరద నీటిలో కొట్టుకొచ్చింది. ఇది  ఇలాంటే.. నగరానికి వాన ముప్పు ఇంకా ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం సాయంత్రం మరోసారి వాన కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు.