Arjun Suravaram
Hyderabad News: ఇటీవల కాలంలో కొందరు పెట్రోల్ బంకుల యజమానలు మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగ పెట్రోల్ కు బదులుగా నీళ్లు కొట్టారంటూ వినియోగాదారులు ఓ బంక్ ముందు ఆదోళనకు దిగారు.
Hyderabad News: ఇటీవల కాలంలో కొందరు పెట్రోల్ బంకుల యజమానలు మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగ పెట్రోల్ కు బదులుగా నీళ్లు కొట్టారంటూ వినియోగాదారులు ఓ బంక్ ముందు ఆదోళనకు దిగారు.
Arjun Suravaram
ఇటీవల కాలంలో మోసాలు అనేవి బాగా పెరిగిపోయాయి. తినే ఆహారపదార్థాల నుంచి వాహనాలకు వినియోగించే ఇంధనం వరకు అన్నిటిలో మోసం జరుగుతుంది. అలానే కొన్ని పెట్రోల్ బంకుల్లో మోసాలు బయటపడుతున్నాయి. పెట్రోల్ కి బదులు నీళ్లు రావడం, లీటర్ కి బదులు తక్కువ మొత్తంలో పెట్రోల్ కొట్టడం వంటివి మోసాలు బయటపడుతున్నాయి. తాజాగా హైదరాబాద్ లోని ఓ పెట్రోల్ బంకు ముందు వాహనదారులు ఆందోళనకు దిగారు. మరి.. అసలు ఏం జరిగింది, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం…
హైదరాబాద్ లోని తార్నాక్ ప్రాంతంలోని ఓ పెట్రోల్ బంకు వద్ద పెట్రోల్ కొట్టించుకున్న పలు వాహనాలు బ్రేక్ డౌన్ అయ్యాయి. మెకానిక్ లకు చూపించగా..నీళ్ల పెట్రోల్ కారణంగా ఇంజిన్ ఆగిపోయిందని తెలిపారు. దీంతో సదరు వాహనదారులు అవాకైయ్యారు. దీంతో వెంటనే ఆ బంక్ వద్దకు వెళ్లి సిబ్బందిని ప్రశ్నించగా..నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని వాహనదారులు చెబుతున్నారు. దీంతో వారు ఆ పెట్రోల్ బంకు వద్దు ఆందోళనకు దిగారు.
లాలాపేట్‌కు చెందిన రమేశ్ అనే వ్యక్తి ఆదివారం తార్నాక్ ప్రాంతంలోని హెచ్ పీ బంక్ కు వెళ్లి కారులో10 లీటర్ల పెట్రోల్ కొట్టించాడు. అయితే అతడి కారు సడెన్ గా ఘట్ కేసర్ వద్ద ఆగిపోయింది. మరో వ్యక్తి కారులో ఉప్పల్ వెళ్తూ రూ.500 పెట్రోల్కొట్టించుకోగా, హబ్సిగూడ దాటకముందే బ్రేక్ డౌన్ అయింది. ఇలా కేవలం వీరిద్దరి వాహనాలే కాకుండా అక్కడ పెట్రోల్ కొట్టించిన పలు వాహనాలు బ్రేక్ డౌన్ అయ్యాయి. పెట్రోల్ పోయించుకుని కిలో మీటరు వెళ్లగానే సడన్ గా ఆగిపోయాయి. దీంతో 25 మంది బాధితులు తార్నాక్ లోని ఆ పెట్రోల్ బంక్‌కు వద్దకు చేరుకుని సిబ్బందిని నిలదీశారు. అయితే తమ ఓనర్ దుబాయ్ లో ఉంటాడని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని బాధితులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే సోమవారం వాహనదారులు ఆందోళనకు దిగారు.
పెట్రోల్‌బంక్‌లో మొదటి నుంచి కల్తీ పెట్రోల్ అమ్ముతూ వాహనదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని పలువురు ఆరోపించారు. బంక్‌ను సీజ్‌చేయాలని హెచ్‌పీ కార్పొరేషన్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. చివరకు ఆ వాహనదారుల ఆందోళనతో బంక్ మేనేజర్ స్పందించారు. పెట్రోల్ లో వాటర్ కలిసినట్లు గుర్తించామని, బ్రేక్ డౌన్ అయిన వాహనాలకు రిపేరు చేయిస్తామని హామీ ఇవ్వడంతో వాహనదారులు ఆందోళన విరమించారు. గతంలోనూ ఈ బంక్‌లో పలుమార్లు ఇలాగే పెట్రోల్ లో నీరు రావడం, కల్తీ పెట్రోల్, మీటర్ ట్యాంపరింగ్ చేసి తక్కువ పోయడం వంటి ఘటనలు జరిగాయని కొందరు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా తూనికలు కొలతల శాఖ అధికారులు స్పందించి కల్తీ పెట్రోల్, మోసాలకు పాల్పడుతున్న పెట్రోల్ బంక్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని వాహనదారులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.