Hyderabad: ప్రియురాలి కోసం ఎంతకి తెగించాడో ఈ ప్రేమికుడు..

ప్రియురాలి కోసం ఎంతకి తెగించాడో ఈ ప్రేమికుడు..

Hyderabad: డబ్బుకు లోకం దాసోహం.. డబ్బు కోసం ఎలాంటి దారుణాలకైనా తెగబడుతున్నారు. కొంతమంది కేటుగాళ్లు ఎంతో నమ్మకంగా ఉంటూ అన్నం పెడుతున్న కంపెనీలకే సున్నం పెడుతున్నారు.

Hyderabad: డబ్బుకు లోకం దాసోహం.. డబ్బు కోసం ఎలాంటి దారుణాలకైనా తెగబడుతున్నారు. కొంతమంది కేటుగాళ్లు ఎంతో నమ్మకంగా ఉంటూ అన్నం పెడుతున్న కంపెనీలకే సున్నం పెడుతున్నారు.

ఈ మధ్య కొంతమంది కేటుగాళ్లు జల్సాలకు అలవాటు పడి ఎన్నో నేరాలకు పాల్పపడుతున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించి లగ్జరీగా బతకాలనే ఆలోచనతో ఎదుటి వాళ్లను దారుణంగా మోసం చేస్తున్నారు. చైన్ స్నాచింగ్, దొంగతనాలు, ఇల్లీగల్ వ్యాపారాలు, డ్రగ్స్ స్మగ్లింగ్ ఇలా ఎన్నో రకాల దందాలకు పాల్పపడుతున్నారు.. ఎక్కడో ఒక తప్పు చేసి పోలీసులకు అడ్డంగా బుక్ అవుతున్నారు. ఓ ఘరానా దొంగ తన ప్రియురాలి మోజులో పడి తనను ఎంతో నమ్మకంగా చూసిన కంపెనీకే టోకరా వేశాడు. కానీ ఎంతోకాలం అతని మోసం కొనసాగలేదు.. పోలీసులకు బుక్ అయి ఊచలు లెక్కబెడుతున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

తన ప్రియురాలి మెప్పు పొందాలి.. ఆమెతో సంతోషంగా షికార్లు చేయాలనే ఉద్దేశ్యంతో ఓ వ్యక్తి తాను చేస్తున్న కంపెనీకే శఠగోపం పెట్టాడు. బషిర్ బాగ్ చంద్రనగర్ కు చెందిన మర్రి లక్ష్మన్ అనే వ్యక్తి ఏనిమిదేళ్లుగా హైదరాబాద్ బషీర్ బాగ్ లోని సిద్ది వినాయక్ జ్యువెలర్స్ అండ్ ఎక్స్ పోర్ట్ కంపెనీలో స్టార్ ఇన్‌చార్జ్ గా వ్యవహరిస్తూ వస్తున్నాడు. ఇటీవల లక్ష్మణ్ కి ఓ యువతితో పరిచయం అయ్యింది.. అది కాస్త ప్రేమగా మారి ఇద్దరూ చట్టా పట్టాలేసుకుంటూ తిరగడం మొదలు పెట్టాడు. తన ప్రియురాలి కోసం డబ్బు అవసరం ఉండటంతో లక్ష్మణ్ చిన్న తాను చేస్తున్న కంపెనీలో బంగారం పక్కదారి పట్టించడం మొదలు పెట్టాడు. ఈ లెక్కలు ఆడిట్ లో చూపించకుండా జాగ్రత్తలు పడ్డాడు.

రెండు నెలలుగా లక్ష్మణ్ డ్యూటీకి రాకపోవడంతో యజమానికి అనుమానం వచ్చి ఆడిట్ నిర్వహించారు.. అందులో 28 తులాల బంగారం మిస్సింగ్ అయినట్లు తేలింది. బాధితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు లక్ష్మణ్ ని అదుపులోకి తీసుకుంది. విచారణలో తానే దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడు. దొంటించిన బంగారాన్ని వివిధ షాపులకు, వ్యక్తులకు అమ్మి తన లవర్ తో టూర్లు తిరిగినట్లు చెప్పాడు. నిందితుని నుంచి మూడు తులాల బంగారంతో పాటు మణప్పురంలో తాకట్టు పెట్టిన డైమండ్ నెక్లెస్ ను రికవరీ చేసినట్లు పోలీసులు తెలిపారు.

Show comments