P Krishna
Hyderabad Water Board Alert: హైదరాబాద్ లో భారీ వర్షాల కారణంగా రోడ్లపై నీరు చేరడంతో కాల్వలు, చెరువులను తలపించాయి. ఉదయం పూట ఉద్యోగాలు, వ్యాపారాలు చేసేవారు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి నానా తంటాలు పడ్డారు.
Hyderabad Water Board Alert: హైదరాబాద్ లో భారీ వర్షాల కారణంగా రోడ్లపై నీరు చేరడంతో కాల్వలు, చెరువులను తలపించాయి. ఉదయం పూట ఉద్యోగాలు, వ్యాపారాలు చేసేవారు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి నానా తంటాలు పడ్డారు.
P Krishna
తెలంగాణలో కొన్నిరోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో పాటు హైదరాబాద్‌లో మంగళవారం (ఆగస్ 20) తెల్లవారు జామున ఏకధాటిగా సుమారు మూడు గంటల పాటు వర్షం దంచి కొట్టింది. దీంతో హైదరాబాద్ నగరం తడిసి ముద్దయ్యింది. మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. భారీ వర్షాల కారణంగా రోడ్లన్నీ జలమయం అయ్యాయి.. నాలాలు పొంగిపొర్లాయి. రోడ్లపై చేరిన నీటితో వాహనాదారులు తీవ్ర అవస్థలు పడ్డారు. పరిస్థితి చక్కదిద్దేందుకు జీహెచ్ఎంసీ అధికారులు రంగంలోకి దిగారు. భారీ వర్షాల కారణంగా జలమండి అప్రమత్తమయ్యింది. ఈ క్రమంలోనే కీలక ఆదేశాలు జారీ చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్ లో భారీ వర్షాల నేపథ్యంలో జలమండలి అప్రమత్తమైంది. జలమండలి ఎండీ అశోక్ రెడ్డి మంగళవారం ఉన్నతాధికారులు, జీఎం, డీజీఎం, మేనేజర్లతో జూమ్ మీటింగ ఏర్పాటు చేసి పలు విషయాలపై చర్చించారు. నగరంలో క్షేత్రస్థాయిలో పర్యటించాలని అదేశించారు. ముంపు ప్రాంతాల్లో నీటి నాణ్యత పరీక్షలు నిర్వహించాలని, వాటర్ లాగింగ్ పాయింట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని కీలక ఆదేశాలు జారీ చేశారు. సాధ్యమైన ప్రాంతాల్లో క్లోరిన్ బిల్లలు పంపిణీ చేయాలని సూచించారు. కలుషిత నీరు సరఫరా అయ్యే ప్రాంతాలను గుర్తించి వెంటనే ఆయా ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా మంచినీటి సరఫరా చేయాలని ఆదేశించారు. పని చేసే ప్రాంతాల్లో బారీ కేడ్లు ఏర్పాటు చేయాని.. ఎట్టి పరిస్థితుల్లోనూ మ్యాన్ హూల్స్ తెరవొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఎలాంటి సమస్యలు ఉన్నా కస్టమర్ కేర్ నెంబర్ 155313 కు పఓన్ చేసి సమస్యల గురించి తెలియజేయాలని కోరారు. రానున్న మరో రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అలర్ట్ గా ఉండాలని సూచించారు. ఉద్యోగులు, సిబ్బంది సెలవులను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. హైదరాబద్‌లో నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. ఇదిలా ఉంటే.. మరో రెండు గంటల పాటు భారీ వర్షం పడే సూచన ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో హైదరాబాద్ కి జీహెచ్ఎంసీ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ప్రజలు అత్యవసర పనులు ఉంటేనే బయటకు రావాలని సూచించింది.