iDreamPost
android-app
ios-app

హైదరాబాద్‌లో అక్రమ కట్టడాలు కూల్చివేత! ఇలాంటి ఆస్తులు మీరు కొనకండి!

Hyderabad: హైదరాబాద్ నగరంలో అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతుంది హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ). బఫర్ జోన్స్, అక్రమ స్థలాల్లో నిర్మాణాలపై చర్యలు తీసుకుంటామని చెప్పిన కొన్ని రోజులకే...

Hyderabad: హైదరాబాద్ నగరంలో అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతుంది హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ). బఫర్ జోన్స్, అక్రమ స్థలాల్లో నిర్మాణాలపై చర్యలు తీసుకుంటామని చెప్పిన కొన్ని రోజులకే...

హైదరాబాద్‌లో అక్రమ కట్టడాలు కూల్చివేత! ఇలాంటి ఆస్తులు మీరు కొనకండి!

జీవనోపాధి, వ్యాపారం, ఉద్యోగం అంటూ చాలా మంది హైదరాబాద్ నగరంలో అడుగుపెడుతున్నారు. దీంతో జన జీవనం పెరిగి నగరం అభివృద్ధి బాట పడుతుంది. నిర్మాణాలు, కట్టడాలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. ప్రభుత్వ జాగాలతో పాటు చెరువులు, కుంటలు కబ్జా చేసి బహుళ అంతస్థులు నిర్మిస్తున్నారు. దీంతో నిర్మాణాలు చేపట్టిన కొన్ని రోజులకే తీవ్ర ఆస్థి, ప్రాణ నష్టం జరుగుతుంది. ఇలాంటి అక్రమ కట్టడాలకు అడ్డుకట్ట వేసేందుకు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్.. హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ)ని తీసుకు వచ్చింది. ఇక ఈ సంస్థ ఏర్పడిన నాటి నుండి హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాలపై కొరడా ఝుళిపిస్తూ ఉంది. తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ కబ్జాల్లో నిర్మాణాలు, బఫర్ జోన్స్‌లో కట్టడాలపై చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.

మొదటి దశలో భాగంగా అక్రమ కట్టడాలను కూల్చివేస్తామని, రెండో దశలో భవనాలు నిర్మించిన వారిపై చర్యలు తీసుకుంటామని, మూడో దశలో చెరువుల పూడిక తీసివేస్తామని రంగనాథ్ తెలిపారు. ఇలా మాస్ వార్నింగ్ వచ్చిందో లేదో.. అప్పుడే మరింత దూకుడు పెంచింది హైడ్రా.. అక్రమ కట్టడాలను కూల్చివేత పనులు ప్రారంభించింది. బాచుపల్లి మండల పరిధి ప్రగతి నగర్ పరిధిలోని 134 సర్వే నంబరులో 3.303 ఎకరాల్లో విస్తరించిన ఎర్రకుంటలో నిర్మిస్తున్న మూడు బహుళ అంతస్తుల భవనాలను హైడ్రా కూల్చి వేసింది. గత ప్రభుత్వం ఇక్కడ నిర్మాణాలు చేపట్టేందుకు మ్యాప్స్ ఇన్ ఫ్రా సంస్థకు అనుమతిని ఇవ్వగా.. అవి ఎర్రకుంటకు చెందిన ఎఫ్టీఎల్, బఫర్ జోన్స్ భూముల కిందకు వస్తాయని పేర్కొంటూ ఆ అంతస్తులను నేల మట్టం చేసింది. అర్థరాత్రి రెండు గంటల సమయంలో కూల్చివేసింది.

గత వారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గాజులరామారం, దేవేందర్‌నగర్‌లో హైడ్రా ఆధ్వర్యంలో అక్రమ కట్టడాలను కూల్చివేసిన విషయం తెలిసిందే. అలాగే హైదరాబాద్‌లోని పురాతనమైన బంరుకున్‌దౌల చెరువులోని ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపింది. చెరువును ఆక్రమించి నిర్మిస్తున్న ఐదు బహుళ అంతస్తుల భవనాలను నేల మట్టం చేసింది. తాజాగా జీడిమెట్లలో కూడా అక్రమ కట్టడాలను కూల్చివేస్తుంది. ఇవే కాదు హైడ్రా ఏర్పడిన ఈ మూడు నెలల కాలంలో కబ్జా కోరల నుండి ప్రభుత్వ భూములను విడిపించింది. సుమారు 100 ఎకరాలకు పైగా గవర్నమెంట్ ల్యాండ్స్ స్వాధీనం చేసుకుంది. జూబ్లీహిల్స్‌లోని నందగిరి హిల్స్‌కు సంబంధించిన 2 వేల గజాల పార్కు సంస్థలో గురు బ్రహ్మ నగర్ వాసులు గుడిసెలు వేసుకున్నారు. వీటిని హైడ్రా తొలగించి ప్రహరీ నిర్మించింది. కాగా, ప్రభుత్వ చెరువు, కుంటలు కాపాడే లక్ష్యంగా హైడ్రా ఈ చర్యలు చేపడుతుంది.

ఈ మధ్య కాలంలో రియల్ ఎస్టేట్ రంగం విస్తరిస్తోంది. నగరంలో జనాభా పెరగడం, స్థలాలు లేకపోవడంతో.. చిన్న చిన్న ప్రాంతాల్లోనే బహుళ అంతస్థులు నిర్మిస్తున్నారు. అలాగే అక్రమ స్థలాల్లో నిర్మాణాలు చేపడుతున్నారు. రియట్ ఎస్టేట్ ముసుగులో వాటిని జనాలకు అంటగడుతున్నారు. తప్పుడు డాక్యుమెంట్స్ చూపించి.. ప్రజలను మోసం చేస్తున్నారు. ఇలాంటి ఇళ్లను కొంటున్నారా తస్మాత్ జాగ్రత్త. హైడ్రా ఏర్పడిన తర్వాత .. అక్రమ కట్టడాలను చాలా సీరియస్‌గా తీసుకుంది. చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములు కబ్జా దారులపై చర్యలకు ఉపక్రమించింది. ఎన్ని అంతస్థులైనా సరే అక్రమ నిర్మాణాలైతే నేల మట్టం చేస్తుంది. సో ఇటువంటి నిర్మాణాల జోలికి వెళ్లకపోవడమే మంచిది.