iDreamPost
android-app
ios-app

హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. ఆ రూట్లలో 15 రోజులు ట్రాఫిక్ ఆంక్షలు!

  • Published Sep 14, 2024 | 2:36 PM Updated Updated Sep 14, 2024 | 2:36 PM

Cyberabad Police Restricts Traffic: నగరంలో నిత్యం పెరిగిపోతున్న వాహనాల రద్దీని తగ్గించేందుకు జీహెచ్ఎంసీ అధికారులు సర్వీస్ రోడ్లను అభివృద్ది చేస్తున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ వాసులు బీ అలర్ట్..

Cyberabad Police Restricts Traffic: నగరంలో నిత్యం పెరిగిపోతున్న వాహనాల రద్దీని తగ్గించేందుకు జీహెచ్ఎంసీ అధికారులు సర్వీస్ రోడ్లను అభివృద్ది చేస్తున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ వాసులు బీ అలర్ట్..

హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. ఆ రూట్లలో 15 రోజులు ట్రాఫిక్ ఆంక్షలు!

గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు.. ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చే వారితో జనాభా శాతం పెరిగిపోతుంది. దీంతో రోడ్లపై వాహనాల రద్దీ విపరీతంగా పెరిగిపోవడంతో ట్రాఫిక్ జామ్, ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటిని అరికట్టేందుకు ప్రభుత్వం సర్వీస్ రోడ్లను అభివృద్ది చేస్తుంది. సైబర్ టవర్స్ ఫ్లై ఓవర్ ల్యాండింగ్ పాయింట్ నుంచి జేఎన్టీయూ రూట్ లోని యశోధ ఆస్పత్రి వరకు సర్వీస్ రోడ్డును నిర్మిస్తున్నారు.ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని.. ఆయా రూట్స్ లో ఇప్పటికే ట్రాఫిక్ ఆంక్షలు ప్రకటించారు. వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో చూద్దాం..

హైదరాబాద్ నగరంలో రోడ్ల విస్తరణలో భాగంగా సైబర్ టవర్స్ నుంచి యశోధ హాస్పిల్ వరకు రోడ్డు పని సాగుతుంది. ఆ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు శుక్రవారం ప్రకటించారు. సెప్టెంబర్ 14 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని అన్నారు. సైబర్ టవర్స్, 100 ఫీట్ జంక్షన్, కొత్త గూడ నుంచి జేఎన్టీయూ, ముసాపేట్ వైపు వెళ్లే ప్రయాణికులు పర్వతనగర్ జంక్షన్ వద్ద టర్న్ తీసుకొని ఖైత్లాపూర్ బ్రిడ్జ్ మీదుగా వెళ్లాలని సూచించారు. ఐకియా, సైబర్ గేట్వే, సీఓడీ జంక్షన్ నుంచి సైబర్ టవర్స్ ఫ్లై ఓవర్ మీదుగా జేఎన్టీయూ వైపు వెళ్లాలి. సైబర్ టవర్స్ ఫ్లై ఓవర్ కింద నుంచి జేఎన్టీయూ వైపు వెళ్లే వాహనదారులు ఎన్ – గ్రాండ్ హైటల్ దగ్గర నుంచి మల్లిస్తారు.

ఎన్ – కన్వేన్షన్ మీదుగా వెళ్లి.. జైన్ ఎన్‌క్లేవ్ దగ్గర రైట్ టర్న్ తీసుకోవాలి. జేఎన్టీయూ వైపు ROB ఫ్లై ఓవర్ లో విలీనం చేయడానికి యశోధ హాస్పిటల్ వెనుక రోడ్డు వైపు వెళ్లాలని సూచించారు. ఈ మర్గాల్లో వెళ్లే వాహనదారులు ట్రాఫిక్ పోలీసులకు సహకరించాల్సిందిగా కోరారు. ఇటీవల నగరంలో పెరిగిపోతున్న రద్దీని నియంత్రించే క్రమంలో రోడ్ల విస్తరణ తప్పని సరి అయ్యిందని.. ఆ సమయంలో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. కాకపోత ఆ సమయంలో ప్రత్యామ్నాయ రహదారులు గురించి సరైన అవగాహన లేకుంటే ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని వాహనదారులు వాపోతున్నారు.