P Krishna
Key Orders of CM Revanth Reddy: సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిపాలనలో తనదైన మార్క్ చాటుకుంటున్నారు. ఇప్పటికే ఆరు గ్యారెంటీ పథకాల్లో కొన్ని అమలు చేశారు. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.
Key Orders of CM Revanth Reddy: సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిపాలనలో తనదైన మార్క్ చాటుకుంటున్నారు. ఇప్పటికే ఆరు గ్యారెంటీ పథకాల్లో కొన్ని అమలు చేశారు. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.
P Krishna
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీ హామీల్లో మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్, రూ.500 గ్యాస్ సిలిండర్ పథకాలు అమలు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో అక్రమ కట్టడాలపై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోన ‘హైడ్రా’ అధ్వర్యంలో అక్రమ కట్టడాల కూల్చివేతలు జరుపుతున్నారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్ వాసులకు మరో శుభవార్త. రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాల అభివృద్దికి కొత్త విధానం రూపొందించడానికి సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఏకో టూరిజం, హెల్త్ టూరిజం, టెంపుల్ టూరిజంలో ముందంజలో ఉన్న ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న పద్దతుల, విధి విధానాలను తెలుసుకోవాలని, వాటిని మెరుగైనవి, మన రాష్ట్రానికి అనుకూలంగా ఉండే పాలసీలను రూపొందించాలని సూచించారు. హైదరాబాద్ పరిసర ప్రాంతంలో దాదాపు వెయ్యి ఎవరాల విస్తీర్ణంలో కొత్త జూ పార్క్ ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.
ఈ పార్క్ లో వివిధ ప్రాంతాల నుంచి జంతువులు, పక్షులను తీసుకువచ్చి కొత్త జూ పార్క్ ఆకర్షణీయంగా ఉండేలా చూడాలని, అర్బన్ ఫారెస్టీని అభివృద్ది చేయాలని అధికారులతో చెప్పారు. జూమ్ నగర్ లోని అనంత్ అంబానీ 3 వేల ఎకరాల్లో వనతార వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని నెలకొల్పిన విషయాన్ని ఈ సందర్భంగా సీఎం ప్రస్తావించారు. అలాగే అనంతగిరి ప్రాంతంలో అద్భుతమైన ప్రకృతి అటవీ సంపద ఉందని, అక్కడ ఉన్న 200 ఏకరాల ప్రభుత్వ భూములను హెల్త్ టూరీజం అభివృద్దికి వినియోగించుకోవాలని రేవంత్ రెడ్డి సూచించారు.