P Krishna
CM Revanth Reddy Govt: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి పలు విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటూ తనదైన మార్క్ చాటుకుంటున్నారు. తాజాగా మరో గుడ్‌న్యూస్ అందించింది తెలంగాణ సర్కార్.
CM Revanth Reddy Govt: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి పలు విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటూ తనదైన మార్క్ చాటుకుంటున్నారు. తాజాగా మరో గుడ్‌న్యూస్ అందించింది తెలంగాణ సర్కార్.
P Krishna
ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ చూసినా ‘హైడ్రా’ పేరు వినిపిస్తుంది. గత కొన్నేళ్లుగా హైదరాబాద్ లో చిన్నపాటి వర్షం వచ్చినా వరదలు ముంచెత్తుతున్న నేపథ్యంలో అక్రమ కట్టడాల కూల్చివేత కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ క్రమంలోనే చెరువులు, కుంటలు, నాలాలతో పాటు ప్రభుత్వ భూములు ఆక్రమించుకొని ఇష్టానుసారంగా నిర్మించిన కట్టడాలన బుల్డోజర్లతో కూల్చివేత కార్యక్రమం చేపట్టింది హైడ్రా. ఇందులో భాగంగా మూసీ సుందరీకరణ కోసం అక్కడ నిర్మించిన ఇళ్లును కూల్చి వేస్తున్నారు. అయితే ఇళ్లు కోల్పోతున్న నిర్వాసితులకు రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పింది. వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్‌లోని మూసీ సుందరీకరణపై రేవంత్ సర్కార్ పనులు ముమ్మరం చేసింది. ఇప్పటికే మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న కొన్ని ఇళ్లను కూల్చి వేయగా మరికొన్ని ఇళ్లకు మార్కింగ్ చేశారు. ఇళ్లు కోల్పోతున్న నిర్వాసితులకు వారికి నచ్చిన ఏరియాల్లో డబుల్ బెడ్రూంతో పాటు రూ.25 వేల నగదు కూడా ఇవ్వనున్నట్లు సీఎం రేవంత్ సర్కార్ ప్రకటించారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టులో ఇళ్లు కోల్పోతున్న వారి కోసం ఏకంగా 16 వేల డబుల్ బెడ్రూం ఇళ్లను కేటాయిస్తూ తెలంగాణ సర్కార్ ఉత్వర్వులు జారీ చేసింది. నిర్వాసితులు తాము ఎంచుకున్న డబుల్ బెడ్రూంకి షిఫ్ట్ అయ్యేందుకు ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉండే అంగన్వాడిలో చదువుతున్న పిల్లల దగ్గరి నుంచి కాలేజీ విద్యార్థుల వరకు అధికారులు వివరాలను సేకరించారు. అంతేకాదు వారికి ఏ ఇతర ఇబ్బందులు ఉన్న ప్రభుత్వ అధికారులను సంప్రదించాల్సిందిగా తెలిపింది.
కొత్తగా డబుల్ బెడ్రూం ఇళ్లలోకి వచ్చిన నిర్వాసితులకు సమీపంలో ఉన్న పాఠశాలలు, కాలేజీల్లో ప్రవేశాలు కల్పించేందుకు సన్నాహాలు చేస్తుంది. పునరావాస ప్రాంతాలకు తరలించే విషయంలో ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా వారికి నచ్చజెప్పి ఒప్పించి తరలించాలని చూస్తుంది ప్రభుత్వం. ఇందుకోసం ప్రత్యేకంగా 25 అధికార బృందాలను కూడా ఏర్పాటు చేసింది. మూసీ నది గర్భంలో.. బఫర్ జోన్ లో ఉన్న నిర్మాణాల్లో ఉన్న వారికి పునరావాసం తో పాటు ఖర్చులకు రూ.25 ఆర్థిక సాయంపై హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ ఒక ప్రకటన విడుదల చేశారు. మూసీ సుందరీకరణలో భాగాంగా ఇక్కడ ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన దాదాపు 1600 నిర్మాణాలను సర్వే ద్వారా గుర్తించినట్లు మూసీ రిఫర్ ఫ్రంట్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ అధికారి దాన కిషోర్ వెల్లడించారు. అలాగే రిఫర్ ఫ్రంట్ లో దాదాపు 10,200 మంది నిర్వాసితులు ఉన్నారని అధికారులు చేపట్టిన సర్వేలో తేలింది. వారందరికీ డబుల్ బెడ్రూం కేటాయించి ఆర్థిక సాయం అందజేస్తారని తాజాగా రేవంత్ సర్కార్ ప్రకటించింది. పుకార్లు, ప్రతిపక్ష నేతల మాటలు నమ్మవొద్దని, నగర సుందరీకరణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కలెక్టర్ కోరారు.