హైడ్రా ప్రభావం.. మీ ఆస్తులు బఫర్ జోన్ లో ఉన్నాయో లేదో చూసుకోండి

Check Your Property Comes Under Hydra Effect Or Not: చెరువులను, ప్రభుత్వ భూములను, స్థలాలను కబ్జా చేసిన వారిపై రేవంత్ సర్కార్ ఉక్కుపాదం మోపుతోంది. హైడ్రా ఆపరేషన్ పేరుతో పలు అక్రమ నిర్మాణాలపై, కబ్జాలపై గురి పెట్టింది. బుల్డోజర్లను రంగంలోకి దింపి అక్రమ నిర్మాణాలను కూల్చేస్తున్నారు. ఈ క్రమంలో బఫర్ జోన్ లో తమ ఆస్తులు ఉన్నాయేమో అని చాలా మంది కంగారు పడుతున్నారు. మరి మీ ఆస్తులు సురక్షితమో కాదో ఇక్కడ చెక్ చేసుకోండి.

Check Your Property Comes Under Hydra Effect Or Not: చెరువులను, ప్రభుత్వ భూములను, స్థలాలను కబ్జా చేసిన వారిపై రేవంత్ సర్కార్ ఉక్కుపాదం మోపుతోంది. హైడ్రా ఆపరేషన్ పేరుతో పలు అక్రమ నిర్మాణాలపై, కబ్జాలపై గురి పెట్టింది. బుల్డోజర్లను రంగంలోకి దింపి అక్రమ నిర్మాణాలను కూల్చేస్తున్నారు. ఈ క్రమంలో బఫర్ జోన్ లో తమ ఆస్తులు ఉన్నాయేమో అని చాలా మంది కంగారు పడుతున్నారు. మరి మీ ఆస్తులు సురక్షితమో కాదో ఇక్కడ చెక్ చేసుకోండి.

చెరువులను కబ్జా చేసి భవనాలను నిర్మించడం వల్ల వర్షాలు పడినప్పుడు నగరవాసులు అనేక ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. ఇష్టమొచ్చినట్లు అనుమతులు ఇచ్చేయడం వల్ల చెరువులను మింగేసి మరీ అక్రమ కట్టడాలను నిర్మించారు. దీని వల్ల చిన్న వాన పడితే రోడ్లనీ జలమయమైపోతున్నాయి. నీళ్లు వెళ్ళడానికి దారి లేక మోకాళ్ళ లోతు నీరి చేరిపోవడంతో వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కబ్జా చేయబడ్డ చెరువులను, పార్కులను, ప్రభుత్వ భూములను తిరిగి పునరుద్ధరించేందుకు హైడ్రాని నియమించింది ప్రభుత్వం. ప్రస్తుతం హైదరాబాద్ లో హైడ్రా ఎఫెక్ట్ నడుస్తోంది. జీహెచ్ఎంసీతో పాటు హైదరాబాద్ సిటీ లిమిట్స్ లోని మున్సిపాలిటీలు, గ్రామాల్లో కూడా హైడ్రా ప్రభావం కొనసాగుతుంది.

అక్రమంగా నిర్మిస్తున్న కట్టడాలపై హైడ్రా కొరడా ఝుళిపిస్తుంది. చెరువులు, పార్కులు, లేఅవుట్లలో సామాజిక అవసరాల కోసం కేటాయించిన స్థలాల్లో, పరిశ్రమలకు చెందిన స్థలాల్లో కబ్జాలను అడ్డుకునేందుకు హైడ్రా ఆపరేషన్ కొనసాగుతుంది. బుల్డోజర్లను ప్రయోగిస్తూ అక్రమ కట్టడాలను స్వాధీనం చేసుకుంటుంది హైడ్రా. ఈ క్రమంలో ఎప్పుడు ఎక్కడ ఏ నిర్మాణాలపై బుల్డోజర్లు ప్రయోగిస్తారో అన్న ఆందోళన నెలకొంది చాలా మందిలో. చెరువులను పూడ్చేసి, ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి నకిలీ డాక్యుమెంట్స్ ని సృష్టించి ఆ స్థలాలను రియల్ ఎస్టేట్ వ్యాపారులు అమాయకులకు అమ్మి సొమ్ము చేసుకున్నారు. నకిలీ డాక్యుమెంట్స్ అని తెలియక, ప్రభుత్వ స్థలాలు, చెరువులు అని తెలియక కొన్న అమాయకులు ఇప్పుడు బలైపోయే అవకాశాలు ఉన్నాయి.

చాలా మంది తాము కొనుగోలు చేసిన స్థలాల్లో నిర్మాణాలు కూడా చేపట్టారు. అయితే ఇప్పుడు హైడ్రా ప్రభావంతో తమ స్థలాలు, ఆస్తులు సురక్షితమేనా? కాదా? అని భయపడుతున్నారు. అయితే మీ ఆస్తులు సురక్షితమా? కదా? అనే విషయాన్ని ఆన్ లైన్ లో చెక్ చేసుకోవచ్చు. లేక్స్.హెచ్ఎండీఏ. జీఓవీ.ఇన్ వెబ్ సైట్ లోకి వెళ్లి మీ ఆస్తులు ఫుల్ ట్యాంక్ లెవల్ పరిధిలో ఉన్నాయా లేదాయే అనేది తెలుసుకోవచ్చు. వెబ్ సైట్ లోకి వెళ్తే లేక్స్ అనే వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో జిల్లా, మండల్/సర్కిల్, విలేజ్ వివరాలు నమోదు చేసి సెర్చ్ మీద క్లిక్ చేయాలి. మీరు నమోదు చేసిన వివరాల ఆధారంగా ఆ పరిధిలో ఉన్న చెరువుల వివరాలు కనిపిస్తాయి. చెరువు పేరు, చెరువు ఐడీ, ప్రిలిమినరీ నోటిఫికేషన్ తేదీ వంటి వివరాలు కనిపిస్తాయి. ఎఫ్టీఎల్, కాడాస్ట్రాల్ మీద క్లిక్ చేస్తే స్థలాలు ఎక్కడున్నాయి.. హైడ్రా ఎఫెక్ట్ ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు. 

Show comments