iDreamPost
android-app
ios-app

వాళ్లను మనుషుల్లా చూస్తున్నారా.. శ్రీచైతన్య కాలేజీ యాజమాన్యం తీరుపై మహిళా కమిషన్ ఫైర్

తోపు కాలేజీ మాదే, మా కాలేజీకే ఆల్ ఇండియన్ ర్యాంక్స్ అంటూ ఊదరగొడుతున్న విద్యా సంస్థల ప్రకటనలకు ఎట్రాక్ట్ అవుతున్నారు పేరేంట్స్. దీంతో లక్షలు పోసి కాలేజీల్లో చేర్పిస్తున్నారు. ర్యాంకుల మోజులో పడి పిల్లల భవితవ్యాన్ని అంధకారంలోకి నెట్టేస్తున్నారు

తోపు కాలేజీ మాదే, మా కాలేజీకే ఆల్ ఇండియన్ ర్యాంక్స్ అంటూ ఊదరగొడుతున్న విద్యా సంస్థల ప్రకటనలకు ఎట్రాక్ట్ అవుతున్నారు పేరేంట్స్. దీంతో లక్షలు పోసి కాలేజీల్లో చేర్పిస్తున్నారు. ర్యాంకుల మోజులో పడి పిల్లల భవితవ్యాన్ని అంధకారంలోకి నెట్టేస్తున్నారు

వాళ్లను మనుషుల్లా చూస్తున్నారా.. శ్రీచైతన్య కాలేజీ యాజమాన్యం తీరుపై మహిళా కమిషన్ ఫైర్

మాదాపూర్‌లోని శ్రీ చైతన్య గర్ల్ కాలేజీ క్యాంపస్‌లో మహిళా కమిషన్ ఛైర్మన్ నేరెళ్ల శారద ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. కాలేజీ క్లాస్ రూమ్స్, హాస్టల్ భవనం పరిశీలించి కాలేజీ మౌలిక సదుపాయాల లేమిపై యాజమాన్యంపై అసహనం వ్యక్తం చేశారు. మూడు రోజుల క్రితం ఇదే క్యాంపస్‌లో విద్యార్థినులు ఫుడ్ పాయిజన్ బారిన పడ్డారు. సుమారు 100 మంది అమ్మాయిలు అస్వస్థతకు గురయ్యారు. గుట్టుచప్పుడు కాకుండా కాలేజీ క్యాంపస్‌లోనే వైద్యం అందించింది యాజమాన్యం. ఈ విషయం విద్యార్థి సంఘాల దృష్టికి వెళ్లడంతో నిరసలు చేపట్టాయి. పోలీసులు ఎంట్రీ ఇచ్చి పలువుర్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఆందోళనలు మిన్నండటంతో ఈ విషయాన్ని మహిళా కమీషన్ సీరియస్‌గా తీసుకుంది. మహిళా కమిషన్ చైర్మన్ శారద రంగంలోకి దిగారు.

కాలేజీ ప్రాంగణం, క్లాస్ రూమ్స్, విద్యార్థినుల హాస్టల్, మెస్‌లను తనిఖీ చేశారు. విద్యార్థినులతో మాట్లాడారు. హాస్టల్లో వెంటిలేషన్ లేకపోవడంపై ఫైర్ అయ్యారు. కనీసం ఎగ్జాస్ట్ ఫ్యాన్లు కూడా ఏర్పాటు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నాసిరకమైన ఫుడ్ వండటంతో పాటు సరైన వసతులు లేకపోవడంపై ఫైర్ అయ్యారు. యాజమాన్యంపై ప్రశ్నల వర్షం కురిపించారు. ‘ఇరుకు గదుల్లో మీరైతే ఉండగలరా.? విద్యార్థినులను మనుషుల్లా చూస్తున్నారా..? భవనంపై నుండి లీకేజీ నీరు భోజనంలో పడింది అని విద్యార్థులు చెబితే తినండని సలహా ఇస్తారా..? దోమలు పడ్డాయంటే అలాగే తినండని చెబుతారా..? మీరేతే తింటారా.? వారిని పశువులు అని భావించి సౌకర్యాలు కల్పించడం లేదా.? రెండు రోజుల పాటు పిల్లలను గదిలో బంధించారట.. మీరు అసలు మనుషులేనా..? మీరు ఈ హాస్టల్లో రెండు రోజుల పాటు ఉండండి మీకు తెలుస్తుంది వాళ్ల బాధలు ఏంటో’ అంటూ ఫైర్ అయ్యారు చైర్మన్ శారద.

ప్రతి ఫ్లోర్ తనిఖీ చేశారు. చివరకు బాత్రూమ్‌లు కూడా నీట్‌గా లేకపోవడంపై మండిపడ్డారు శారద. ‘మీ ఇంట్లో, మా ఇంట్లో ఇలాగే ఉంటాయా? రీజన్స్ చెప్పొద్దు.. ప్రొవిజన్స్ కావాలి. మీకంటే గవర్నమెంట్ హాస్టల్స్ బాగున్నాయి. లగేజీకి సెపరేట్ రూం లేదు. అన్నిహాస్టల్లోనే సర్దుకుంటున్నారు. లీకేజ్ సమస్యలు, గదులు శుభ్రంగా లేవు. వీళ్లు మనుషులా, పశువులా..? పశువులను కూడా ఇలా చూడటం లేదు’ అని మండిపడ్డారు. విద్యార్థులు ఉంటున్న ప్రతి రూం రూం తనిఖీలు చేసిన తర్వాత స్టూడెంట్స్ ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యలను ఏకరువు పెట్టారు. ‘ప్రతి స్టూడెంట్ ఇక్కడ ప్రాబ్లమ్ ఉందనే చెబుతున్నారు. కిడ్నీ ప్రాబ్లం, అప్రెంటిసైట్ వచ్చింది. ప్రతి ఒక్కరికీ డైజేషన్ ప్రాబ్లం, డెంగ్యూ, మలేరియా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు’.  పిల్లలకు చదువులిస్తుస్తున్నారా, అనారోగ్యాన్ని అందిస్తున్నారా అంటూ ప్రశ్నించారు. పిల్లల భద్రత పైన రాజీపడబోమని, విద్యార్థులకు ఇబ్బందులు ఎదురైతే ఎవ్వర్ని ఉపేక్షించేది లేదని మహిళా కమిషన్ చైర్మన్ నెరేళ్ల శారద హెచ్చరించారు.