iDreamPost
android-app
ios-app

Hyderabad: హుస్సేన్ సాగర్ వద్ద ఉద్రిక్తత.. గణేశ్ ఉత్సవ కమిటీ, పోలీసులు మధ్య రచ్చ!

Hyderabad: హైదరాబాద్ లోని ట్యాంక్ బాండ్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. ట్యాంక్ బాండ్ వద్ద వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం విధించారు. దీనిపై భాగ్యనగర్ ఉత్సవ కమిటీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Hyderabad: హైదరాబాద్ లోని ట్యాంక్ బాండ్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. ట్యాంక్ బాండ్ వద్ద వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం విధించారు. దీనిపై భాగ్యనగర్ ఉత్సవ కమిటీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Hyderabad: హుస్సేన్ సాగర్ వద్ద ఉద్రిక్తత.. గణేశ్ ఉత్సవ కమిటీ, పోలీసులు మధ్య రచ్చ!

ఆదివారం హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. గతకొన్ని రోజుల క్రితం హుస్సేన్ సాగర్ లో వినాయకుడి విగ్రహాల నిమజ్జనాలపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. నిమజ్జనంకు అనుమతి లేదంటూ ట్యాంక్ బండ్ పరిసరాల్లో ఫ్లెక్సీలు, ఇనుప కంచెంలు ఏర్పాటు చేశారు. అయితే ఈ ఆంక్షలపై భాగ్యనగర్ ఉత్సవ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను, బారికేడ్లను భాగ్యనగర్ ఉత్సవ కమిటీ సభ్యులు తొలగించారు. అనంతరంలో హుస్సేన్ సాగర్‌లో గణేష్ విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. కొత్త నిబంధనలు తెచ్చి ప్రభుత్వం భక్తుల మనోభావాలను ప్రభుత్వం దెబ్బతీస్తోందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్యాంక్ బండ్ పై గణేషుడు విగ్రహాల నిమజ్జనాలు ఎన్నో ఏళ్లు నుంచి జరుగుతున్నాయని తెలిపారు. ఇప్పుడు కొత్త రూల్స్ ఎందుకు పెట్టారంటూ వాళ్లు ప్రశ్నించారు. 2022, 2023లో కూడా ఇలాగే చెప్పారని, చివరకు హుస్సేన్ సాగర్ లోనే లోనే నిమజ్జనాలు జరిగాయని గుర్తు చేశారు. ప్రభుత్వం వెంటనే ట్యాంక్ బండ్ పై వినాయకుల విగ్రహాల నిమజ్జనానికి ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. తమ విజ్ఞప్తులను పట్టించుకోకుంటే సోమవారం హైదరాబాద్ వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

ప్రభుత్వం వెంటనే హుస్సేన్ సాగర్ పై వినాయక నిమజ్జన ఏర్పాట్లు ఆదివారం మధ్యాహ్నం వరకు చేయాలని డిమాండ్ చేశారు. అలా ఏర్పాట్లు చేయని పక్షంలో ఈ రోజు అన్ని గణేష్ మండపాల నిర్వాహకులకు సమాచారం తెలియజేసి..సోమవారం నగర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఎక్కడికక్కడ మండపాల్లో వినాయకుల విగ్రహాలను అదే విధంగా ఉంచుతామంటూ భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులు హెచ్చరించారు. అయితే గణేష్ విగ్రహాల నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.  వినాయక విగ్రహాల నిమజ్జనానికి సంబంధించి 2021లో రూపొందించిన మార్గదర్శకాలనే పాటించాలని హైకోర్టు స్పష్టం చేసింది.

మట్టి, ఎకో ఫ్రెండ్లో విగ్రహాలు మాత్రమే హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయాలని హైకోర్టు పేర్కొంది.  ఇక ప్లాస్టర్​ఆఫ్​ప్యారిస్​విగ్రహాలను జీహెచ్‌ఎంసీ అధికారులు ఏర్పాటు చేసిన కృత్రిమ నీటికుంటలోనే నిమజ్జనం చేయాలని స్పష్టం చేసింది. ఇదే సమయంలో ఇప్పటికే ప్రారంభమైన నిమజ్జనాల కోసం జీహెచ్ఎంసీ, పోలీసు శాఖ సమన్వయంతో పని చేస్తోంది. గణేషుడి నిమజ్జనం సందర్భంగా పోలీసులు భారీగా భద్రత ఏర్పాటు చేశారు. మరోవైపు ఖైరతాబాద్ వినాయకుడి భక్తులు పోటెత్తుతున్నారు. ఆదివారం కావడంతో భారీ సంఖ్యలో భక్తులు ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకునేందుకు వస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు పోలీసులు అన్నీ రకాల చర్యలు తీసుకున్నారు.