Arjun Suravaram
Balapur Ganesh Laddu: ఇప్పటివరకు హైదరాబాద్‌లో అత్యంత ఖరీదైన లడ్డూగా.. బాలాపూర్ గణేషుని లడ్డూ మాత్రమే ఉండేది. కాగా.. తాజాగా ఆ రికార్డును బ్రేక్ పడింది.
Balapur Ganesh Laddu: ఇప్పటివరకు హైదరాబాద్‌లో అత్యంత ఖరీదైన లడ్డూగా.. బాలాపూర్ గణేషుని లడ్డూ మాత్రమే ఉండేది. కాగా.. తాజాగా ఆ రికార్డును బ్రేక్ పడింది.
Arjun Suravaram
దేశ వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రతి గ్రామంలో, వీధిల్లో వినాయకుడి మండపాలు విద్యుదీపాలకరణలతో దేదీప్యమానంగా వెలుగొందుతున్నాయి. ఇక వినాయక చవితి వేడుకలు అనగానే ఠక్కున గుర్తుకు వచ్చేది హైదరాబాద్. ఇక్కడ వినాయకులు ఎంత ఫేమసో.. ఆయన చేతిలో లడ్డు కూడా అంతే ఫేమస్. అందులోనూ బాలాపూర్ వినాయకుడి లడ్డుకు ఉండే క్రేజ్ గురించి ఇంకా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఖైరాతాబాద్ వినాయకుడి, బాలాపూర్ లడ్డు వేలం పాటపై ఏటా భక్తులో ఎంతో ఆసక్తి ఉంటుంది. ఈ నేపథ్యంలో గతేడాది బాలాపూర్ వినాయకుడి లడ్డుపై ఉన్న రికార్డు బ్రేక్ అయ్యింది. మరి… ఆపూర్తి వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…
హైదరాబాద్ లో ఖైరతాబాద్ వినాయకుడు ఎంతో ఫేమస్ అందరికి తెలిసిందే. ఏటా ఈ వినాయకుడిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఇదే సమయంలో బాలాపూర్ గణేషుడికి కూడా మరో ప్రత్యేకత ఉంది. ఇక్కడి వినాయకుడి చేతిలో ఉండే లడ్డుకు ఎంతో క్రేజ్ ఉంది. గణేషుడి లడ్డు వేలం పాట అనగానే అందరికీ బాలాపూర్ వినాయకుడు గుర్తుకు వస్తాడు. భాగ్యనగరంలో ఇప్పటివరకు అన్ని రికార్డులు బాలాపూర్ గణేషుని లడ్డూవే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే..బాలాపూర్ లడ్డు..తన పేరిట ఉన్న రికార్డును తానే తిరగరాస్తూ వచ్చింది. 2023లో ఏకంగా రూ.27 లక్షలు పలికి.. తెలంగాణలోనే అత్యంత ఖరీదైన లడ్డూగా బాలాపూర్ గణేషుడు రికార్డు సృష్టించాడు.
కాగా.. ఈసారి ఆ బాలాపూర్ గణేషుని రికార్డును మాదాపూర్ మైహోమ్ భుజా వినాయకుడు కూడా బ్రేక్ చేశాడు. అత్యంత ఖరీదైన లడ్డూగా మాదాపూర్ మైహోమ్ భుజా గణేషుడు కొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఏటా మాదిరిగానే ఈసారి కూడా మైహోం భుజా అపార్ట్ మెంట్స్ లో ప్రతిష్ఠించిన వినాయకుడి లడ్డూకు వేలం పాట నిర్వహించారు. ఈసారి వేలం పాట హోరా హోరీగా సాగింది. ఈ సారి గణేషుని లడ్డూ ఏకంగా 29 లక్షలు పలికింది. ఖమ్మంకు చెందిన కొండపల్లి గణేష్.. వినాయకుడి లడ్డూను రూ. 29 లక్షలకు సొంతం చేసుకున్నాడు. దీంతో.. హైదరాబాద్ మహానగరంలోని అత్యంత ఖరీదైన ధర పలికిన లడ్డూగా ఈ గణపయ్య లడ్డూ నిలిచింది. అయితే.. బాలాపూర్ గణేషుని వేలం సెప్టెంబర్ 17వ తేదీ మంగళవారం జరగనుంది.
బాలాపూర్ లడ్డు క్రియేట్ చేసిన గతేడాది రికార్డును మైహోం భుజా గణపతి బ్రేక్ చేసింది. దీంతో మైహోం భుజా వినాయకుడు బ్రేక్ చేసి..బాలాపూర్ వినాయకుడి కొత్త టార్గెట్ పెట్టాడు. దీంతో.. మంగళవారం జరగబోయే బాలాపూర్ లడ్డూ వేలంపై అందరి దృష్టి పడింది. విపరీతమైన డిమాండ్ ఉన్న బాలాపూర్ లడ్డూ ఇంకెంత పలకనుందోనని ప్రజలు ఇప్పటి నుంచి అంచనాలు వేయటం మొదలుపెట్టేశారు. మరి..తాజాగా మైహోం భుజ గణపతి క్రియేట్ చేసిన రికార్డుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.