iDreamPost
android-app
ios-app

రికార్డు ధర పలికిన బాలాపూర్ లడ్డు.. దక్కించుకున్నది ఎవరంటే..?

Balapur Laddu: హైదరాబాద్ మహా నగరంలో వినాయక నిమజ్జన వేడుకలు జరుగుతున్నాయి. లక్షలాది వినాయక విగ్రహాలు హుస్సేన్ సాగర్ వైపు వస్తున్నాయి. అలాగే ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు చోటుచేసుకున్నాయి. అలాగే బాలాపూర్ వినాయకుడి లడ్డు ధర వేలం ముగిసింది.

Balapur Laddu: హైదరాబాద్ మహా నగరంలో వినాయక నిమజ్జన వేడుకలు జరుగుతున్నాయి. లక్షలాది వినాయక విగ్రహాలు హుస్సేన్ సాగర్ వైపు వస్తున్నాయి. అలాగే ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు చోటుచేసుకున్నాయి. అలాగే బాలాపూర్ వినాయకుడి లడ్డు ధర వేలం ముగిసింది.

రికార్డు ధర పలికిన బాలాపూర్ లడ్డు.. దక్కించుకున్నది ఎవరంటే..?

వినాయక చవితి పండుగ సందడి చివరి దశకు చేరుకుంది. పదకొండు రోజుల పాటు జరిగిన ఉత్సవాలు.. ఈ రోజు నిమజ్జనంతో ముగియనున్నాయి. హైదరాబాద్ నగర వ్యాప్తంగా గణేశుని శోభాయాత్ర కొనసాగుతుంది. హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేసేందుకు లక్షలాది విగ్రహాలు తరలి వస్తున్నాయి. అక్కడంతా కోలాహలం నెలకొంది. భక్తుల రద్దీ నెలకొంది. వినాయక విగ్రహాల నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. గణేశుని ఉత్సవాలు అనగానే.. ఖైరతాబాద్ వినాయకుడు ఎంత ఫేమస్సో, బాలాపూర్ కూడా అంతే ఫేమస్. ఆయనకు సమర్పించే లడ్డు వల్ల మరింత పేరు వచ్చింది. గత 30 సంవత్సరాల నుండి ఇక్కడ పూజలు అందుకుంటున్నాడు వినాయకుడు. ఇక్కడ లడ్డు వేలం పాట ప్రత్యేకం.

ప్రతి ఏడాది వేలం పాటలో బాలాపూర్ లడ్డు రికార్డు ధర పలుకుతున్న సంగతి విదితమే. తాజాగా నిర్వహించిన వేలంలో రికార్డు స్థాయి ధర పలికింది.  రూ. 30, 01,000ల ధర పలికింది. ఈ లడ్డును కొలను శంకర్ రెడ్డి సొంతం చేసుకున్నారు. గత ఏడాది ఈ లడ్డు రూ. 27 లక్షలు పోగా.. ఈ సంవత్సరం మూడు లక్షల వెయ్యి రూపాయల అదనంగా పలకడం విశేషం. 1994లో మొదలైన లడ్డూ వేలం పాట.. ఏడాదికోడాది పెరుగుతూ వస్తుంది. తొలి సారి కొలను మోహన్ రెడ్డి 450 రూపాయలతో తన సొంతం చేసుకున్నారు. అప్పటి నుంచి ధర పెరుగుతూనే ఉంది. ఈ ఏడాది కొత్త తీసుకొచ్చిన రూల్ తీసుకు వచ్చారు. గత ఏడాది లడ్డూ అమ్ముడుపోయిన ధర డబ్బులు డిపాజిట్ చేస్తేనే ఈసారి వేలంలో పాల్గొనే అవకాశం ఇచ్చారు.

ఈ సారి కొలను శంకర్ రెడ్డి దక్కించుకున్నారు. కాగా, ఇప్పటి వరకు వేలం పాటు ఎక్కువగా కొలను ఇంటి పేరు ఉన్న వ్యక్తులే లడ్డును సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది. గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చివరి రోజైన సెప్టెంబర్ 17న నిమజ్జన వేడుకలు జరుగుతున్నాయి. బాలాపూర్ వినాయకుడు సైతం శోభాయాత్రగా తరలి వెళుతున్నాడు. మొదట బాలాపూర్ గణనాధుడికి చివరిపూజ నిర్వహించిన తర్వాత గణేశుడి ఉద్వాసన పూజ చేపట్టారు. ఊరేగింపు అనంతరం గ్రామ బొడ్రాయి వద్ద లడ్డూ వేలంపాట జరిగింది. ఈ ఆక్షన్ లో రికార్డు స్థాయి ధర ముప్పై లక్షల వెయ్యి రూపాయలు పలికింది.