iDreamPost
android-app
ios-app

HYDRA: వారికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ వార్నింగ్.. అలా చేస్తే జైలుకే..!

  • Published Sep 04, 2024 | 3:09 PM Updated Updated Sep 04, 2024 | 3:09 PM

HYDRA AV Ranganath Warning: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్.. కఠిన హెచ్చరిక జారీ చేశారు. అలా చేస్తే జైలుకే అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఆ వివరాలు..

HYDRA AV Ranganath Warning: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్.. కఠిన హెచ్చరిక జారీ చేశారు. అలా చేస్తే జైలుకే అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఆ వివరాలు..

  • Published Sep 04, 2024 | 3:09 PMUpdated Sep 04, 2024 | 3:09 PM
HYDRA: వారికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ వార్నింగ్.. అలా చేస్తే జైలుకే..!

హైదరాబాద్ నగర పరిధిలో చెరువులు, కుంటలు, నాలాలు ఆక్రమించి ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో నిర్మించిన అక్రమ కట్టడాలపై హైడ్రా కొరడా ఝుళిపిస్తోన్న సంగతి తెలిసిందే. అక్రమ నిర్మాణం అని తెలిస్తే చాలు.. వార్నింగ్ ఇవ్వడం.. ఆపై కూల్చివేయడం చేస్తోంది. ఆక్రమణల విషయంలోహైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఎలాంటి ఒత్తిళ్లకు లోను కాకుండా కూల్చివేతలు చేపడుతున్నారు. సామాన్యులు, సెలబ్రిటీలు, సినీ రాజకీయ నాయకులు అనే తేడా లేకుండా అందరితో ఒకేలా వ్యవహరిస్తున్నారు. ఇక ఇదే అదునుగా భావించిన కొందరు కేటుగాళ్లు అక్రమాలకు తెర తీశారు. హైడ్రా పేరు చెప్పి.. అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. తాజాగా.. అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రాజెక్ట్ నిర్మిస్తున్న బిల్డర్‌ను హైడ్రా పేరిట బెదిరింపులకు పాల్పడ్డాడు. దాంతో సదరు బిల్డర్ పోలీసులను ఆశ్రయిండంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు..

డాక్టర్ బండ్ల విప్లవ సిన్హా అనే వ్యక్తి సోషల్ యాక్టివిస్ట్, సోషల్ వర్కర్ అని బోర్డు పెట్టుకొని నిర్మాణం పనులు చూడడానికి వస్తున్న కస్టమర్లకు అసత్య ప్రచారం చేస్తున్నారని సదరు బిల్డర్ ఆరోపించాడు.హైడ్రా కమిషనర్ రంగనాథ్‌తో మంచి పరిచయం ఉందని చెప్పి ఆయనతో కలిసి దిగిన ఫోటోలు చూపించి బెదిరింపులకు పాల్పడుతున్నారు. రంగనాథ్ తనకు బాగా దగ్గరని అమీన్‌పూర్‌లో ఎలాంటి విషయమైనా తననే అడుగుతారని చెప్పి.. విప్లవ సిన్హా.. బిల్డర్‌ను డబ్బలు డిమాండ్ చేశాడు.

మీ నిర్మాణం జోలికి రావద్దనుకుంటే రూ. 20 లక్షలు ఇవ్వాలని విప్లవ సిన్హా బిల్డర్ ను డిమాండ్ చేశాడు. లేదంటే హైడ్రాకు ఫిర్యాదు చేయటంతో పాటు అక్రమ కట్టడాలపై మీడియాలో వార్తలు రాయిస్తానని బెదిరించాడు. దీంతో బిల్డర్ పోలీసులను ఆశ్రయించగా.. బెదిరింపులకు పాల్పడిన విప్లవ సిన్హాపై కేసు నమోదు చేశారు.

వారికి రంగనాథ్ హెచ్చరిక..

ఇక తాజాగా ఈ వ్యవహారంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. హైడ్రా పేరు చెప్పి ఎవరైనా అక్రమసంగా డబ్బు వసూళ్లకు పాల్పడితే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. హైడ్రా పేరు చెప్పి అక్రమ వసూళ్లకు పాల్పడిన వారిని జైలుకు పంపుతామని వార్నింగ్ ఇచ్చారు. హైడ్రా పేరుతో ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే తమ దృష్టికి తేవాలని రంగనాథ్ కోరారు.

హైడ్రా పేరుతో డబ్బు వసూళ్లకు పాల్పడితే ప్రభుత్వ విభాగానికి చెందిన అధికారులు, సిబ్బందికి సమాచారం ఇవ్వాలన్నారు. వసూళ్లకు పాల్పడి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. హైడ్రా అక్రమ కట్టడాలు మాత్రమే కూలుస్తుందని.. ప్రజలు అనవసరంగా ఆందోలళ చెందాల్సిన పని లేదని అన్నారు. కేటుగాళ్ల మాటలు నమ్మి మోసపోవద్దని ఈ సందర్భంగా రంనాథ్ సూచించారు.