P Krishna
Hyderabad Real Estate Scam: ఈ మధ్య కొంతమంది కేటుగాళ్లు ఫేక్ కంపెనీలు స్థాపించి ఘరానా మోసాలకు తెగబడుతున్నారు. తక్కువ పెట్టుబడులకు భారీ లాభాలు ఇస్తామని ఆశ చూపించి కోట్లు వసూళ్లు చేసిన తర్వాత బిషానా ఎత్తేస్తున్నారు. దీంతో బాధితులు సైబర్ పోలీసులను ఆశ్రయిస్తున్నారు.
Hyderabad Real Estate Scam: ఈ మధ్య కొంతమంది కేటుగాళ్లు ఫేక్ కంపెనీలు స్థాపించి ఘరానా మోసాలకు తెగబడుతున్నారు. తక్కువ పెట్టుబడులకు భారీ లాభాలు ఇస్తామని ఆశ చూపించి కోట్లు వసూళ్లు చేసిన తర్వాత బిషానా ఎత్తేస్తున్నారు. దీంతో బాధితులు సైబర్ పోలీసులను ఆశ్రయిస్తున్నారు.
P Krishna
హైదరాబాద్ ఈ మధ్య కాలంలో ఘరానా మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. పలు రకాల స్కీములు, రియల్ ఎస్టేట్ కంపెనీల పేరుతో మోసాలకు తెగబడుతున్నారు. రక రకాల స్కీములు, కంపెనీల్లో పెట్టుబడులు పెడితే భారీగా లాభాలు చూపిస్తామంటూ అమాయకులను బుట్టలో వేసుకొని కోట్లు వసూళ్లు చేస్తున్నారు. తర్వాత చెప్పా పెట్టకుండా రాత్రికి రాత్రే బిషానా ఎత్తేస్తున్నారు. ఈ మధ్య కాలంలో హైదరాబాద్ లో పలు కంపెనీలు కస్టమర్లను కోట్లలో ముంచి బోర్డు తిప్పేశారు. తాజాగా హైదరాబాద్‌లో మరో రియల్ ఎస్టేట్ కంపెనీ స్కామ్ బయటపడింది. స్క్వైర్ అండ్ యార్డ్స్ ఫామ్ హౌజ్ విల్లాల పేరుతో కస్టమర్ల నుంచి కోట్లలో వసూళ్లు చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్‌లో మరో రియల్ ఎస్టేట్ కంపెనీ బోర్డు తిప్పేసింది. చెప్పా పెట్టకుండా రాత్రికి రాత్రే బిషానా ఎత్తేసింది. దీంతో బాధితులు లబో దిబో సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించారు. ఈ సంస్థపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే సంస్థ యజమాని బైరా చంద్రశేఖర్ తో పాటు మరో నలుగురిని అరెస్ట్ చేశారు. ఏపీకి చెందిన బైరా చంద్రశేఖర్ తో సహా నలుగురు కలిసి స్క్వేర్ అండ్ యార్డ్స్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఓ సంస్థను స్థాపించారు. హైదరాబాద్ శివారులో ఫామ్ హౌజ్, విల్లాలు నిర్మిస్తున్నట్లు ఏజెంట్లను పెట్టుకొని విస్తృతంగా ప్రచారం చేసుకుంది. యాడ్స్ తో దుమ్మురేపారు. మొదట్లో ఎన్నో లగ్జరీ కార్యక్రమాలు నిర్వహించారు. తాము నిర్మించే నిర్మాణాల్లో పెట్టుబడి పెడితే రెట్టింపు డబ్బులు ఇస్తానని చంద్రశేఖర్ బాధితులకు ఆశ చూపించాడు.
కొత్తలో బాధితులకు డబ్బులు వారి అకౌంట్స్‌లో వేశారు. ఆ సంస్థ చేపట్టిన హంగూ, ఆర్భాటాలు చూసి వందల మంది స్క్వేర్ అండ్ యార్డ్స్ సంస్థలో దాదాపు 120 మంది వరకు పెట్టుబడులు పెట్టారు. అలా చంద్ర శేఖర్ అండ్ కో బాధితుల నుంచి దాదాపు రూ.24 కోట్లు వసూళ్లు చేసినట్లు సమాచారం. స్థలాలు లేకపోయినా ఉన్నట్లు చూపించి డబ్బులు వసూళ్లు చేశారు. నెలలు గడుస్తున్నా పెట్టిన పెట్టుబడికి చంద్రశేఖర్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు.తమ డబ్బు తిరిగి ఇవ్వడకపోవడంబతో బాధితులంతా ఆ కంపెనీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. దీంతో ఆఫీస్ వద్దకు వచ్చి నిలదీయగా తన వద్ద డబ్బులు లేవని చేతులెత్తేశాడు. దీంతో తాము దారుణంగా మోసపోయామని గ్రహించిన బాధితులు సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించారు. స్క్వేర్ అండ్ యార్డ్స్ సంస్థపై పలు కేసులు నమోదు చేసిన పోలీసులు బైరా చంద్రశేఖర్ తో డైరెక్టర్లు గరిమెళ్ళ వెంకట అఖిల్, రెడ్డిపల్లి కృష్ణ చైతన్య, వేములపల్లి జాన్వీలను అరెస్ట్ చేశారు.
స్క్వేర్ అండ్ యార్డ్స్ సంస్థ యజమాని బైరా చంద్రశేఖర్ ప్రస్తుతం మూసాపేటలో ఉంటున్నాడు. ఇతని స్వస్థలం ఏపీలోని చిలకలూరిపేట. బాధితుల ఆరోపణల నేపథ్యంలో చంద్రశేఖర్ పై సీఆర్ నెంబర్ 75/2024 U/S 316(2), 318(4), 61(2) బీఎన్ఎస్, సెక్షన్ 5 కింద కేసులు నమోదు చేశారు.తమ కంపెనీకి చెందిన భూముల్లో గంధపు చెట్లు నాటుతమని బాధితులకు చెప్పాడు చంద్రశేఖర్. మొదట రూ.17 లక్షలు డిపాజిట్ చేస్తే.. 100 నెలలపాటు రూ.30 వేల రూపాయలు చొప్పున అందిస్తామని కస్టమర్లు ఆకర్షించారు. అలాగే చెట్లు పెరిగిన తర్వాత కోట్లలో లాభాలు ఉంటాయని బాధితులను బుట్టలో వేసుకొని క్రమంగ వారి వద్ద నుంచి కోట్లు వసూళ్లు చేసిన తర్వాత ముఖం చాటేసినట్లు పోలీసులు వివరించారు. ఇటీవల ఇలాంటి ఘరానా మోసాలు ఎన్నో జరుగుతున్నాయి.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.