iDreamPost
android-app
ios-app

హైదరాబాద్‌లో ఎన్‌ కన్వెన్షన్‌కి ఆల్టర్నేటివ్ కన్వెన్షన్స్ ఎన్ని ఉన్నాయంటే?

  • Published Aug 26, 2024 | 8:54 PM Updated Updated Aug 26, 2024 | 8:54 PM

N Convention Alternatives: ఇప్పుడు బర్త్ డే పార్టీలు, పెళ్లిళ్లు, ఈవెంట్లు ఏవైనా గానీ పెద్ద పెద్ద కన్వెన్షన్ సెంటర్స్ లో నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లో అతి పెద్ద కన్వెన్షన్ గా ఉన్న ఎన్ కన్వెన్షన్ కి ఆల్టర్నేటివ్ గా ఉన్న కన్వెన్షన్స్ ఏంటి అని చాలా మందికి తెలుసుకోవాలన్న కుతూహలం ఉంటుంది. అలాంటి వారి కోసమే ఈ కథనం.

N Convention Alternatives: ఇప్పుడు బర్త్ డే పార్టీలు, పెళ్లిళ్లు, ఈవెంట్లు ఏవైనా గానీ పెద్ద పెద్ద కన్వెన్షన్ సెంటర్స్ లో నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లో అతి పెద్ద కన్వెన్షన్ గా ఉన్న ఎన్ కన్వెన్షన్ కి ఆల్టర్నేటివ్ గా ఉన్న కన్వెన్షన్స్ ఏంటి అని చాలా మందికి తెలుసుకోవాలన్న కుతూహలం ఉంటుంది. అలాంటి వారి కోసమే ఈ కథనం.

హైదరాబాద్‌లో ఎన్‌ కన్వెన్షన్‌కి ఆల్టర్నేటివ్ కన్వెన్షన్స్ ఎన్ని ఉన్నాయంటే?

పెళ్లిళ్లు, పార్టీలు వంటి సామాజిక వేడుకలకు, ఎగ్జిబిషన్స్, లాంచెస్ వంటి కార్పొరేట్ వేడుకలకు డెస్టినేషన్ అడ్డాగా ఎన్ కన్వెన్షన్ కి మంచి గుర్తింపు ఉంది. హైదరాబాద్ హైటెక్ సిటీలో బెస్ట్ ఇన్ క్లాస్ సర్వీసులని అందిస్తూ మోడర్న్ వెన్యూగా ప్రధాన లొకేషన్ లో ఉన్న కారణంగా డిమాండ్ బాగా ఉండేది. 27 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో 3 వేల మంది సీటింగ్ సామర్థ్యంతో అతి పెద్ద హాలు ఉండేది. చిన్న డైమండ్ హాలు ఒకటి ఉండేది. 5 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో 500 మంది కూర్చునే చిన్న హాలు ఉండేది. అనెక్స్ హాలు ఒకటి చిన్నది ఉండేది.

ఇది 7 వేల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగి ఉంది. డైమండ్ హాలులోకి, మర్రిచెట్టు ఉన్న ఏరియాకి వెళ్లేలా ప్రవేశం ఉంది. 37 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఓపెన్ ఎయిర్ వెన్యూ గార్డెన్ ఒకటి ఉండేది. ఈ గార్డెన్ లోంచి మెయిన్ హాలులోకి వెళ్లేలా ప్రవేశం ఉంది. మర్రిచెట్టు ఉన్న ఏరియా 26 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. ఓపెన్ ప్లేస్ లో ఉంది. ఈ ఎన్ కన్వెన్షన్ సెంటర్.. 4 వేల మంది కూర్చునే సామర్ధ్యం కలిగి ఉంది. లక్ష చదరపు అడుగుల పైనే విస్తీర్ణం కలిగి ఉంది. అయితే హైడ్రా అధికారులు ఎన్ కన్వెన్షన్ ని కూల్చివేశారు. దీంతో ఇప్పుడు హైదరాబాద్ లో ఎన్ కన్వెన్షన్ లాంటి కన్వెన్షన్ సెంటర్స్ ఏమున్నాయి అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 

హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్:

హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఒకటి ఉంది. ఇది ఎన్ కన్వెన్షన్ కంటే చిన్నదే అయినా కూడా సీటింగ్ కెపాసిటీతో పోల్చుకుంటే దాని కంటే ఇదే పెద్దది. 6,480 చదరపు మీటర్లు అంటే 69 వేల 750 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక పెద్ద హాలు ఉంటుంది. ఈ హాలుని 6 చిన్న హాలులుగా కూడా విభజించుకోవచ్చు. అంత పెద్ద హాలు ఇది. ఈ హాలులో 6 వేల మంది కూర్చోవచ్చు. ఇది నోవాటెల్ హోటల్ కి అనుసంధానం అయి ఉంటుంది. ఇది హైటెక్ సిటీ దగ్గరలో ఉంది.            

కింగ్స్ కోహినూర్ కన్వెన్షన్:

కింగ్స్ కోహినూర్ కన్వెన్షన్ మెహిదీపట్నంలో ఉంది. ఇందులో 5 వేల మంది కూర్చునేలా ఉంటుంది. 15 రూమ్స్, 2 పెద్ద హాలులు ఉన్నాయి. 150 కార్లు పట్టేంత పార్కింగ్ ఏరియా ఉంది. 

జేఆర్సీ కన్వెన్షన్స్:

ఇది జూబ్లీహిల్స్ లో ఉంది. 5 వేల సీటింగ్ సామర్థ్యం కలిగి ఉన్న ఈ కన్వెన్షన్ సెంటర్ లో 3 హాలులు ఉన్నాయి. 100 కార్లు పట్టేంత పార్కింగ్ ఏరియా ఉంది. 

జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్:

ఇది పటాన్ చేరులో ఉంది. 5 వేల మంది కూర్చునేంత సీటింగ్ కెపాసిటీ కలిగి ఉంది. 150 కార్లు పట్టేంత పార్కింగ్ ఏరియా ఉంది. ఇందులో నాలుగు హాలులు ఉన్నాయి. 

అన్వయ కన్వెన్షన్:

5 వేల మంది సీటింగ్ కెపాసిటీ కలిగిన అన్వయ కన్వెన్షన్ గచ్చిబౌలిలో ఉంది. 2 హాలులు ఉన్న ఈ కన్వెన్షన్ లో 100 కార్లు సరిపోయేంత పార్కింగ్ ఏరియా ఉంది. 

ఓం కన్వెన్షన్:

ఇది నార్సింగిలో ఉంది. 3 హాలులు ఉన్న ఈ కన్వెన్షన్ లో 7 వేల మంది గెస్టులు కూర్చోవచ్చు. 100 కార్లకు సరిపడా పార్కింగ్ ఏరియా ఉంది. ఇందులో 10 రూములు ఉన్నాయి. 

ఇలా సిటీలో చాలా కన్వెన్షన్ సెంటర్లు ఉన్నాయి. ఇవన్నీ అంతర్జాలంలో దొరికిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. ఎన్ కన్వెన్షన్ లో ఒకే హాలులో గరిష్టంగా 3 వేల మంది కూర్చునే కెపాసిటీ ఉంటే.. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ లలో ఒకే హాలులో ఏకంగా 6 వేల మంది కూర్చునే సీటింగ్ కెపాసిటీ ఉంది. ఇంకా ఎక్కువ సీటింగ్ కెపాసిటీ ఉన్న కన్వెన్షన్ సెంటర్లు ఉన్నాయి. కానీ ఒకే హాలులో ఇంత సీటింగ్ కెపాసిటీ లేదు.