iDreamPost
android-app
ios-app

అఘోరి నాగసాధు సంచలనం నిర్ణయం.. నవంబర్1 ఉదయం 9 కి..!

  • Published Oct 30, 2024 | 10:41 AM Updated Updated Oct 30, 2024 | 10:41 AM

Aghori naga Saadhu: నిన్న మొన్నటి వరకు సోషల్ మీడియాలో హల్చల్ చేసింది నాగాసాదు అఘోరి మాత. సనాతన ధర్మాన్ని కాపాడడానికి వచ్చానంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ క్రమంలో తాజాగా ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Aghori naga Saadhu: నిన్న మొన్నటి వరకు సోషల్ మీడియాలో హల్చల్ చేసింది నాగాసాదు అఘోరి మాత. సనాతన ధర్మాన్ని కాపాడడానికి వచ్చానంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ క్రమంలో తాజాగా ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Oct 30, 2024 | 10:41 AMUpdated Oct 30, 2024 | 10:41 AM
అఘోరి నాగసాధు సంచలనం నిర్ణయం.. నవంబర్1 ఉదయం 9 కి..!

గత కొన్ని రోజులుగా తెలంగాణాలో అఘోరి నాగసాధు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయంలో ఓ వ్యక్తి అమ్మవారి విగ్రహం ధ్వంసం చేయడం , ఆ కారణంగా ప్రక్షాళన పేరుతో అఘోరి నాగసాధు అక్కడకి రావడం , ఒంటి కాలి మీద నిల్చుని ప్రత్యేక పూజలు చేయడం , ఆ తర్వాత ఎన్నో ఇంటర్వ్యూలను కూడా ఇవ్వడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలు ఎన్నో వివాదాలకు , చర్చలకు దారి తీశాయి. మీడియా , సోషల్ మీడియా లో ఆఘోరి నాగ సాధు హాట్ టాపిక్ గా మారింది. ఆమె నిజమైన అఘోరి కాదు అంటూ కూడా పలువురు తేల్చి చెప్పారు. ఆఖరికి తన తల్లిదండ్రులను కూడా ఇంటర్వ్యూ చేశారు. ఇన్ని జరిగిన తర్వాత కూడా ఆమె మాత్రం తానూ అఘోరినే అంటూ అదే మాట మీద ఉన్నారు. సనాతన ధర్మాన్ని కాపాడడమే తన లక్ష్యం అంటూ చెప్పుకొస్తుంది. వరుస ఇంటర్వ్యూల తర్వాత ఆమె కేదార్నాథ్ కు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కూడా అక్కడి నుంచి పలు వీడియోలు , ఆడియోల ద్వారా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోనే ఉంది.

ఇక్కడ ఇంత రచ్చ జరిగింది కాబట్టి ఆమె మళ్ళీ ఇక్కడికి అడుగుపెట్టే అవకాశం లేదని.. అంతా భావించారు. కానీ , అందరికి షాక్ ఇస్తూ ఆమె ఊహించని నిర్ణయం తీసుకుంది. తాజాగా ఆమె మరోసారి తెలంగాణాలో అడుగుపెట్టినట్లు సమాచారం. అంతే కాకుండా ఆమె ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. నవంబర్ 1 శుక్రవారం ఉదయం 9 గంటలకు అదే ముత్యాలమ్మ ఆలయం ముందు.. ఆత్మార్పణ చేసుకుంటానని అఘోరి నాగ సాదు వెల్లడించింది. ముత్యాలమ్మ గుడిపై దాడి చేసిన వ్యక్తులను ఆమెకు అప్పగించాలని.. ప్రభుత్వం దానిపై ఏమి స్పందించడం లేదని.. హిందూ సంప్రదాయం కోసం ఇంత చేస్తున్న తనని మాత్రం విమర్శిస్తున్నారంటూ.. తనపై వస్తున్న ఆరోపణలు నిజం కాదని వాపోయింది.  ఇవన్నీ తుడిచిపెట్టుకు పోవాలన్నా.. సనాతన ధర్మాన్ని రక్షించాలన్నా.. తానూ ఆత్మర్పణ చేసుకోక తప్పదని ఆమె ప్రకటించింది. ఒకవేళ మరణం నుంచి బయట పడితే సృష్టిని మార్చుకుంటానని.. లేదయ్యా శివయ్య పాదాల దగ్గరకు చేరిపోతానని చెప్పుకొచ్చింది.

హిందూ సంప్రదాయం , సనాతన ధర్మం కాపాడడానికి మాత్రమే తానూ ఇక్కడకి వచ్చానని.. తనపై ఇలాంటి అబాండాలు వేయడం సరైనది కాదని ఆమె చెప్పారు. గత కొన్ని రోజులుగా ఆమె ఎన్నో మాటలు చెప్తూ వస్తున్నారు. కానీ ఇప్పుడు ఏకంగా పలానా రోజు పలానా టైం కు ఆత్మార్పణ చేసుకుంటానని నిక్కచ్చిగా చెప్పడంతో.. ఈ వార్తా అందరిని కలవరపెడుతుంది. అసలు ఆరోజున ఏం జరగబోతుంది.. చెప్పినట్లుగానే ఆమె చేసి చూపిస్తుందా.. అని అందరు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ రెండు రోజుల్లో ఇంకా ఏదైనా జరిగే అవకాశం లేకపోలేదు. ఈలోపు అఘోరి నాగసాదు తన నిర్ణయాన్ని మార్చుకుంటుందా లేదా అనుకున్నట్లుగానే చేస్తుందా అనేది తెలియాల్సి ఉంది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.