Hyderabad: హైదరాబాద్ లో డేంజర్ బెల్స్.. ప్రమాదకర స్థాయిలో విష వాయువులు!

ground level ozone level is increasing in Hyderabad: హైదరాబాద్ లో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ప్రమాదకర స్థాయిలో విష వాయులు పెరిగిపోతున్నాయని తాజాగా ఓ అధ్యాయనంలో వెల్లడైంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

ground level ozone level is increasing in Hyderabad: హైదరాబాద్ లో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ప్రమాదకర స్థాయిలో విష వాయులు పెరిగిపోతున్నాయని తాజాగా ఓ అధ్యాయనంలో వెల్లడైంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్.. బతుకుదెరువు కోసం అందరి చూపు ఈ మహానగరం వైపే. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి వేలల్లో కుటుంబాలు హైదరాబాద్ కు వచ్చి బతుకుతున్నాయి. దాంతో నగరంలో జనాభా విపరీతంగా పెరిగిపోయింది. దీనికి తోడు ట్రాఫిక్ కష్టాలు మరోవైపు. ఇదిలా ఉండగా.. మహానగరంలో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ప్రమాదకర స్థాయిలో విష వాయులు పెరిగిపోతున్నాయని తాజాగా ఓ అధ్యాయనంలో వెల్లడైంది. పట్టణంలో పలు చోట్ల ‘గ్రౌండ్ లెవల్ ఓజోన్’ స్థాయి ప్రమాణాలు ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన దానికంటే ఎక్కువగా నమోదు అవుతున్నట్లు వెల్లడైంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్ లో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. గాలి నాణ్యత రోజు రోజుకు క్షీణిస్తోంది. ఈ విషయం తాజాగా అధ్యాయనంలో వెల్లడైంది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(AQI)ను కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి(CPCB) విడుదల చేస్తుంటుంది. దీంతో పాటుగా గాలిలోని పార్టిక్యూలేట్ మ్యాటర్(కాలుష్య కారకాలు)ను ఢిల్లీకి చెందిన సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్ మెంట్ అనే సంస్థ  స్టడీ చేస్తుంది. ఈ క్రమంలో హైదరాబాద్ లోనూ సీపీసీబీ పరిధిలోకి వచ్చే 14 ప్రాంతాల్లో కూడా 2020 నుంచి 2024 జూన్ వరకు ఈ సంస్థ గ్రౌండ్ లెవల్ ఓజోన్ స్థాయిలను నమోదు చేసింది. అందులో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.

హైదరాబాద్ లో 9 చోట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన దాని కంటే ఎక్కువ ఓజోన్ విష వాయువు విడుదల అవుతున్నట్లు తేలింది. WHO ప్రకారం ఒక క్యూబిక్ మీటర్ గాలిలో ఓజోన్ వాయువు 100 మైక్రోగ్రాముల కంటే తక్కువ ఉంటేనే సేఫ్. కానీ హైదరాబాద్ లోని 9 ప్రాంతాల్లో ఇది 100 నుంచి 150 వరకు ఉన్నట్లు స్టడీలో తేలింది. పైగా ప్రతీ సంవత్సం ఇది పెరుగుతూ వస్తుండటం ఆందోళన కలిగించే విషయం. పట్టణంలో ఓజోన్ స్థాయి ఎక్కువగా నమోదు అవుతున్న ఏరియాల్లో సనత్ నగర్ తొలి స్థానంలో ఉంది. ఈ ప్రాంతంలో గ్రౌండ్ లెవల్ ఓజోన్ 150.9 మైక్రోగ్రాముల మేర ఉందని తేలింది. మిగతా ఏరియాలు అయిన ఇక్రిశాల్ లో 145.9, ECIL 140.8, రామచంద్రాపురం 129.1, IITH 121.3, కొంపల్లి 118.1, న్యూ మలక్ పేట్ 112, జూ పార్క్ లో 111, సోమాజిగూడ 100.6 మైక్రోగ్రాముల ఓజోన్ స్థాయిలు ఉన్నట్లు అధ్యయనంలో తేలింది.

కాగా.. అతి తక్కువ ఓజోన్ స్థాయి సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలో నమోదు అయ్యింది. అక్కడ 4.6 మైక్రోగ్రాముల ఓజోన్ స్థాయిలు ఉన్నట్లు తేలింది. అయితే రాత్రి పూట తగ్గాల్సిన ఈ స్థాయిలు.. పెరుగుతుండటం మరింత ఆందోళనకరం. ఇక ఈ ఓజోన్ వాయువును పీల్చినవారికి దగ్గు, శ్వాస సంబంధిత వ్యాధులు, గొంతు నొప్పి లాంటి సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ వాయువును అధికంగా పీలిస్తే.. ఊపిరితిత్తులు దెబ్బతింటాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా మేల్కొని ఈ కాలుష్యాన్ని తగ్గించాలి. లేకపోతే భవిష్యత్ లో ఈ మహానగరంలో బతకడం కష్టమే.

Show comments