Dharani
Dharani
పదకొండు రోజుల పాటు.. అంగరంగ వైభవంగా భక్తుల పూజలు అందుకున్న గణపయ్య.. తల్లి గంగమ్మ ఒడికి పయనమయ్యాడు. గురువారం నుంచి హైదరాబాద్ నగరంలో గణేష్ నిమజ్జన వేడుక అంగరంగ వైభవంగా జరుగుతోంది. సుమారు లక్ష విగ్రహాలు.. నిమజ్జనానికి తరలి వచ్చాయి. ఇందుకోసం ఏకంగా హుస్సెన్ సాగర్ చుట్టూ.. ఏకంగా 30 క్రేన్లు పెట్టి.. వినాయకులను గంగమ్మ ఒడికి చేర్చుతున్నారు. మహానిమజ్జనాన్ని చూసేందుకు జనాలు తండోపతండాలుగా తరలివచ్చారు. నిమజ్జనం చూడటం కోసం తరలి వచ్చిన జనాలతో ట్యాంక్ బండ్ పరిసరాలు కిక్కిరిపోయాయి. ఇక ఖైరతాబాద్ మహాగణపతి నిమిజ్జనం.. మధ్యాహ్నం లోపే పూర్తి కావడంతో.. తరువాత నిమజ్జనం ప్రాసెస్ వేగంగా సాగింది. శుక్రవారం కూడా నిమజ్జన కొనసాగుతోంది.
ఇక గణేష్ నిమజ్జనం అంటే.. ఎంత సందడిగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. డీజే మోతలు, డప్పు చప్పుళ్లు, తీన్మార్ డ్యాన్స్‌లతో మోత మోగిపోతుంది. వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లలు మొదలు.. ముసలి వాళ్ల వరకు.. డీజే సాంగ్స్‌కు కాలు కదుపుతారు. అయితే ఈ సారి గణేష్ నిమజ్జనంలో పోలీసుల డ్యాన్స్ హైలెట్‌గా మారింది. మగ పోలీసులకు ధీటుగా.. లేడీ కానిస్టేబుల్స్ కూడా డీజే సాంగ్‌కు ఊర మాస్ స్టెప్పులేసి.. డ్యాన్స్‌తో ఇరగదీశారు.
నిమజ్జనం డ్యూటీలో ఉన్న ఇద్దరు మహిళా పోలీసులు.. మిగతా యుతులతో కలిసి డీజే పాటలకు డ్యాన్స్ చేశారు. తీన్మార్ పాటకు.. ఊర మాస్ స్టెప్పులతో దుమ్ము రేపారు. మహిళా పోలీసులు చేస్తున్న డ్యాన్సులు చూసి అక్కడున్నవాళ్లంతా విజిల్స్ వేసి.. చప్పట్లతో హుషారు పెంచారు. ప్రస్తుతం మహిళా పోలీసులు డ్యాన్స్ చేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. మొత్తం నిమజ్జనం ప్రాసెస్‌లోనే ఇది హైలెట్ సీన్ అంటున్నారు జనాలు.
గణేష్ నిమజ్జనంలో డాన్స్ ఇరగదీసిన హైదరాబాద్ మహిళా పోలీసులు pic.twitter.com/0cJJdECl55
— Telugu Scribe (@TeluguScribe) September 28, 2023