Dharani
హైదరాబాద్ వాసులకు కీలక అలర్ట్ జారీ చేశారు. నగరంలో రెండు రోజుల పాటు అనగా.. జూలై 4, 5న కొన్ని ప్రాంతాల్లో నీటి సరఫరా ఉండదని.. ప్రజలు గమనించుకోవాలని సూచించారు.
హైదరాబాద్ వాసులకు కీలక అలర్ట్ జారీ చేశారు. నగరంలో రెండు రోజుల పాటు అనగా.. జూలై 4, 5న కొన్ని ప్రాంతాల్లో నీటి సరఫరా ఉండదని.. ప్రజలు గమనించుకోవాలని సూచించారు.
Dharani
తెలంగాణలో మొత్తం ఎంత జనాభా ఉందో.. అందులో సగం హైదరాబాద్‌లో ఉంది. దేశంలోని వేర్వేరు రాష్ట్రాల వారు ఉపాధి కోసం భాగ్యనగరానికి వస్తారు. నగరంలో జనాభా కిక్కిరిసి ఉంటుంది. నగరంలో ఉన్న అందరికి తగ్గట్టుగా మౌలిక సౌకర్యాలు కల్పించడం అంటే మాటలు కాదు. వీటన్నింటిలో అతి ముఖ్యమైనది ప్రతి ఒక్కరికి తాగు నీటి సౌకర్యం కల్పించడం. నగరంలో ప్రతి ఇంట్లో బోర్లు ఉండవు. జలమండలి సరఫరా చేసే నీరే చాలా మందికి ఆధారం. అందుకే ఒక్క రోజు నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడిన జనాలు ఎంతో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి.
కానీ కొన్ని సందర్భాల్లో జలమండలి అధికారులు నీటి సరఫరాను ఆపేస్తుంటారు. మరమ్మత్తు పనులు, ఇతరాత్ర కారణాల వల్ల అప్పుడప్పుడు నీటి సరఫరా ఆపేస్తారు. ఈ క్రమంలో తాజాగా జలమండలి అధికారులు నగరవాసులకు కీలక అలర్ట్ జారీ చేశారు. రెండు రోజులు పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్ చేస్తామని వెల్లడించారు. రెండు రోజులు అనగా జూలై 4, 5 తేదీల్లో నగరంలోని పలు ప్రాంతాల్లో నీటి సరఫరా ఉండదని తెలిపారు. ఆ వివరాలు..
హైదరాబాద్ మహానగరానికి తాగునీరు సరఫరా చేసే సింగూరు 3, 4 ఫేజ్‌లకు విద్యుత్ సరఫరా చేసే 123 కేవీ పెద్దాపూర్, కంది సబ్‌స్టేషన్లలో టీజీ ట్రాన్స్‌కో అధికారులు మరమ్మతు పనులు చేపడుతున్నారు. ఈ క్రమంలో గురువారం ఉదయం 7 గంటల నుంచి 24 గంటల పాటు అనగా మరుసటి రోజు శుక్రవారం, జూలై 5వ తేదీ ఉదయం 7 గంటల వరకు ఈ పనులు జరుగుతాయని అధికారులు తెలిపారు. ఈనేపథ్యంలో.. ఈ 24 గంటల పాటు పలు రిజర్వాయర్ల పరిధిలో నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని అధికారులు వెల్లడించారు.
ఈ క్రమంలో జూలై 4, 5న నగరంలోని ఈ ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని చెప్పుకొచ్చారు. ఆ ప్రాంతాలు ఏవి అంటే.. షేక్‌పేట, భోజగుట్ట రిజర్వాయర్ (లోప్రెజర్), జూబ్లీహిల్స్, సోమాజిగూడ, బోరబండ, బంజారాహిల్స్, ఎర్రగడ్డ, మూసాపేట, కేపీహెచ్‌బీ, హైదర్‌నగర్, నల్లగండ్ల, చందానగర్, హుడా కాలనీ, హఫీజ్‌పేట, మణికొండ, నార్సింగి తదితర ప్రాంతాల్లో నీటి అంతరాయం ఉంటుందన్నారు. కనుక జనాలు దీన్ని గమనించుకుని.. ఆ మేరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.