iDreamPost
android-app
ios-app

Hyderabad వాసులకు అలర్ట్.. వర్షాకాలంలో ఆ పని చేస్తే జైలుకే..!

  • Published Jun 13, 2024 | 8:48 AM Updated Updated Jun 13, 2024 | 8:57 AM

హైదరాబాద్‌ వాసులకు జీహెచ్‌ఎంసీ, జలమండలి అధికారులు కీలక ప్రకటన చేశారు. వానాకాలంలో ఆ పని చేస్తే జైలుకే అన్నారు. ఆ వివరాలు..

హైదరాబాద్‌ వాసులకు జీహెచ్‌ఎంసీ, జలమండలి అధికారులు కీలక ప్రకటన చేశారు. వానాకాలంలో ఆ పని చేస్తే జైలుకే అన్నారు. ఆ వివరాలు..

  • Published Jun 13, 2024 | 8:48 AMUpdated Jun 13, 2024 | 8:57 AM
Hyderabad వాసులకు అలర్ట్.. వర్షాకాలంలో ఆ పని చేస్తే జైలుకే..!

తెలంగాణలో నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్నాయి. జూన్‌ నెలారంభం నుంచే వానలు జోరందుకున్నాయి. అన్నదాతలు వ్యవసాయ పనులు కూడా ప్రారంభించారు. ఇక వర్షాకాలంలో గ్రామల సంగతి ఎలా ఉన్నా.. పట్టణాలు, నగరవాసులుకు తీవ్ర ఇబ్బుందులు ఎదురవుతాయి. చిన్న వర్షానికే రోడ్లు జలమయం అవుతాయి. గంటల తరబడి ట్రాఫిక్‌లో ఇరుక్కోవాల్సిన పరిస్థితి. ఇక చిన్న వర్షానికే భాగ్య నగరం రోడ్లు చెరువులును తలపిస్తుంటాయి. ఎక్కడ ఏం ఉందో అర్థం కాదు. ఈ క్రమంలో జీహెచ్‌ఎంసీ, జలమండలి అధికారులు నగర వాసులకు కీలక అలర్ట్‌ జారీ చేశారు. వర్షాకాలంలో ఆ పని చేస్తే.. జైలుకే అంటూ సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చారు. ఆ వివరాలు..

నగరవాసులకు జీహెచ్‌ఎంసీ, జలమండలి అలర్ట్‌ జారీ చేశారు. నగరంలోని రహదారులు, ఇతర ప్రాంతాల్లో ఉన్న మ్యాన్‌హోళ్లను ఎవరైనా తెరిస్తే క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అంతేకాక మ్యాన్‌హోల్స్‌ తెరిచిన వారిని జైలుకు పంపుతామని జలమండలి అధికారులు హెచ్చరించారు. జలమండలి చట్టం 1989 సెక్షన్‌ 74 ప్రకారం అక్రమంగా మ్యాన్‌హోళ్లు తెరిస్తే క్రిమినల్‌ కేసులు పెట్టే అధికారం ఉందని ఈ సందర్భంగా అధికారులు వెల్లడించారు. సీవరేజ్‌ సమస్యలు ఉంటే జలమండలి వినియోగదారుల సేవా కేంద్రం 155313కు ఫోన్‌ చేసి సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. వర్షాకాలంలో ఎప్పటికప్పుడు మ్యాన్‌హోళ్లను శుభ్రం చేసేందుకు ఎయిర్‌టెక్‌ యంత్రాలను సిద్ధం చేశామని తెలిపారు.

నగరంలో ప్రతి ఏటా మ్యాన్‌హోల్స్‌లో పడి ఎందరో జనాలు ప్రాణాలు కోల్పుతుంటారు. ఈ క్రమంలో జలమండలి, జీహెచ్‌ఎంసీ అధికారులు దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. నగరవ్యాప్తంగా ఉన్న లోతైన మ్యాన్‌హోళ్లను ప్రజలు గుర్తించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఆయా మ్యాన్‌హోల్స్‌ అత్యంత ప్రమాదకరమైనవి అని తెలిపేలా.. వాటికి ఎరుపు రంగు వేస్తున్నారు. ఇక హైదరాబాద్‌ వ్యాప్తంగా.. 25 వేలకు పైగా లోతైన మ్యాన్‌హోల్స్‌ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇక వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో మ్యాన్‌హోళ్ల వల్ల జనాలు ఇబ్బంది పడకూడదని భావించిన అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి ఏటా వర్షాకాలంలో మ్యాన్‌హోల్స్‌ కారణంగా ఎందరో మృతి చెందుతున్నారు. మరీ ముఖ్యంగా ఇలాంటి ఘటనల్లో చిన్నారులే ఎక్కవ శాతంత బలవుతున్నారు. ఈ క్రమంలో జీహెచ్‌ఎంసీ, జలమండలి అధికారులు ఇలాంటి ప్రకటన చేశారు.