iDreamPost
android-app
ios-app

Hyderabad: CMR షాపింగ్ మాల్ లో భారీ అగ్ని ప్రమాదం

  • Published Jan 03, 2024 | 8:14 AM Updated Updated Jan 03, 2024 | 8:14 AM

కొత్త ఏడాది ప్రారంభంలోనే నగరంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుని జనాలను భయభ్రాంతులకు గురి చేసింది. ప్రసిద్ధ సీఎంఆర్ షాపింగ్ మాల్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆ వివరాలు..

కొత్త ఏడాది ప్రారంభంలోనే నగరంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుని జనాలను భయభ్రాంతులకు గురి చేసింది. ప్రసిద్ధ సీఎంఆర్ షాపింగ్ మాల్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆ వివరాలు..

  • Published Jan 03, 2024 | 8:14 AMUpdated Jan 03, 2024 | 8:14 AM
Hyderabad: CMR షాపింగ్ మాల్ లో భారీ అగ్ని ప్రమాదం

కొత్త సంవత్సరం ప్రారంభంలోనే.. నగరంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో.. జనాలు భయభ్రాంతులకు గురవుతున్నారు. మంగళవారం అర్థరాత్రి పూట ఈ ఘటన చోటు చేసుకోవడంతో.. ప్రాణ నష్టం సంభవించలేదు. దాంతో ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇక అగ్ని ప్రమాదం కారణంగా భారీ ఎత్తున నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. హైదరాద్ లోని ప్రముఖ షాపింగ్ మాల్ సీఎంఆర్ లో ఈ ఘటన వెలుగు చూసింది. ఆ వివరాలు..

రాజధాని హైదరాబాద్, ఉప్పల్ ఏరియాలో.. ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న, సీఎంఆర్‌ షాపింగ్‌ మాల్‌లో మంగళవారం అర్థరాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. షాపింగ్ మాల్.. నాలుగంతస్తుల భవనంలోని ముందు భాగంలో ఒక్కసారిగా భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. క్రమంగా అవి పెరగడంతో.. భవనం మొత్తం అగ్ని కీలల్లో చిక్కుకుంది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు.. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

fire accident cm shopping mall

అగ్నిప్రమాదం గురించి తెలిసిన వెంటనే.. అగ్నిమాపక సిబ్బంది, ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. సుమారు మూడు గంటల పాటు ఫైరిజంన్లతో పని చేసి.. మంటలను అదుపు చేశారు. మంటల ధాటికి భవనంలోని పైకప్పు సీలింగ్‌ కుప్పకూలింది. అగ్నిప్రమాదం జరగడానికి కొద్ది సేపు క్రితమే అక్కడ పనిచేసే సిబ్బంది, మాల్‌ను మూసివేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత ప్రమాదం జరగడంతో ఎలాటి ప్రాణనష్టం వాటిల్లలేదు అని తెలిపారు.

షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్టు అగ్నిమాపక శాఖ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. బట్టలకు సంబంధించిన మాల్‌ కావడంతో ప్రమాద తీవ్రత అధికమైంది. ప్రమాదం నేపథ్యంలో.. భవనంలో అగ్నిమాపక భద్రత ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయనే విషయంపై పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు ఆరా తీస్తున్నారు. మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత షాపింగ్‌ మాల్‌లో ఎవరైనా చిక్కుకున్నారా అనే విషయాన్నిపరిశీలించిన అధికారులు.. భవనం లోపల ఎవరూ లేరని నిర్థారించారు.

ప్రమాదం నేపథ్యంలో.. ఎల్బీ నగర్ డీసీపీ, స్థానిక ఎమ్మెల్యే  ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మంటలు పూర్తిస్థాయిలో అదుపులోకి రావడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రాణ నష్టం లేకపోయినా.. భారీ ఎత్తున ఆస్తి నష్టం సంభవించి ఉంటుందని భావిస్తున్నారు.