పంజాగుట్ట: కల్కి సినిమా చూస్తుండగా.. PVR థియేటర్‌లో వర్షం

Rain At Panjagutta PVR-Kalki Screening: ఆదివారం సాయంత్రం నగరంలో భారీ వర్షం కురిసిన సంగతి తెలిసిందే. ఒక థియేటర్‌లో కూడా వర్షం పడింది. ఇప్పుడీ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వివరాలు..

Rain At Panjagutta PVR-Kalki Screening: ఆదివారం సాయంత్రం నగరంలో భారీ వర్షం కురిసిన సంగతి తెలిసిందే. ఒక థియేటర్‌లో కూడా వర్షం పడింది. ఇప్పుడీ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వివరాలు..

ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌ నగరంలో భారీ వర్షం కురిసిన సంగతి తెలిసిందే. జోరు వానలో నగరం తడిసి ముద్దయ్యింది. రాత్రి 11 గంటల ప్రాంతం వరకు కూడా నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో రోడ్ల మీద భారీ ఎత్తున నీరు నిలవడమే కాక పెద్ద ఎత్తున ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. భారీ వర్షాల నేపథ్యంలో.. నగరవాసులు బయటకు రావద్దని అధికారులు అలర్ట్‌ జారీ చేశారు. పలు ప్రాంతాల్లో చెట్లు, కరెంట్ స్తంభాలు నేలకూలడంతో విద్యుత్​ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. వెంటనే పోలీసులు, బల్దియా, హెచ్​ఎండీఏ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. ఇలా ఉండగా.. ఆదివారం నాడు కురిసిన భారీ వర్షాల కారణంగా పంజాగుట్ట పీవీఆర్‌ థియేటర్‌లో వాటర్‌ లీక్‌ అయ్యింది. దీనిపై ప్రేక్షకులు అసహనం వ్యక్తం చేశారు. ఆ వివరాలు..

ఆదివారం సామాన్యంగా అందరికి సెలవు ఉండటం.. కల్కి సినిమాకు రద్దీ తగ్గడంతో చాలా మంది మూవీ ప్లాన్‌ చేసుకున్నారు. సినిమా చూసి ఎంజాయ్‌ చేద్దామని వెళ్లిన వారికి విచిత్ర అనుభవం ఎదురయ్యింది. థియేటర్‌లో వర్షం కురిసింది. ఈ సంఘటన పంజాగుట్ట పీవీఆర్‌ థియేటర్‌లో వెలుగు చూసింది. ప్రేక్షకులు థియేటర్‌కు వెళ్లి సినిమా చూస్తున్నారు. ఇంతలో సడెన్‌గా వర్షం పడటం మొదలయ్యింది.

థియేటర్‌ పైకప్పు నుంచి వర్షపు చినుకులు పడ్డాయి. ఇది చూసి ప్రేక్షకులు ముందు షాకయ్యారు. వార్నీ ఇండ్లే కాదు.. థియేటర్‌లో కూడా లీకేజీలు ఉన్నాయా అని ఆశ్చర్యపోయారు. ఇంతకంటే చిత్రమైన అంశం ఏంటంటే.. థియేటర్లో వర్షం పడుతున్నా సరే.. యాజమాన్యం మాత్రం షో ఆపేయలేదు. దీనిపై ప్రేక్షకులు థియేటర్‌ యాజమాన్యాన్ని ప్రశ్నించగా.. వారు దురుసుగా సమాధానం చెప్పారు.

ఇష్టమైతే సినిమా చూడండి.. లేదంటే వెళ్లిపొండి అంటూ వెటకారంగా సమాధానం ఇచ్చారు థియేటర్‌ యాజమాన్యం. అయితే ఈ ఘటనపై అసహనానికి గురైన ప్రేక్షకులు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. వర్షం నీరు వల్ల షార్ట్‌సర్క్యూట్‌ జరిగి ఏదైనా ప్రమాదాం జరిగితే.. ఎవరు బాధ్యత వహిస్తారు అంటూ మండి పడుతున్నారు.

ఇదిలా ఉండగా మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో.. ఎల్లో, ఆరెంజ​ అలెర్ట్‌ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రానున్న నాలుగు రోజులు జోరు వానలు కురుస్తాయని తెలిపారు.

 

Show comments