iDreamPost
android-app
ios-app

బాబోయ్.. బయట చూస్తే కిరాణం షాపు.. లోపల యవ్వారం మొత్తం వేరే!

  • Published Apr 15, 2024 | 9:43 AM Updated Updated Apr 15, 2024 | 9:43 AM

Police Seized Ganja Chocolate: డబ్బుకు లోకం దాసోహం అన్నట్లు.. ఈ మధ్య కాలంలో కొంతమంది డబ్బు కోసం ఎలాంటి పనులకైనా తెగబడుతున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ సంపాదన కోసం వెంపర్లాడుతున్నారు.

Police Seized Ganja Chocolate: డబ్బుకు లోకం దాసోహం అన్నట్లు.. ఈ మధ్య కాలంలో కొంతమంది డబ్బు కోసం ఎలాంటి పనులకైనా తెగబడుతున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ సంపాదన కోసం వెంపర్లాడుతున్నారు.

బాబోయ్.. బయట చూస్తే కిరాణం షాపు.. లోపల యవ్వారం మొత్తం వేరే!

ఈ మధ్యకాలంలో ఈజీ మనీ కోసం చాలా మంది ఎన్నో అక్రమాలు, అన్యాయాలకు తెగబడుతున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలి.. సొసైటీలో లగ్జరీగా బతకాలి అన్న దురాలోచనతో ఎన్నో దుర్మార్గమైన పనులు చేస్తున్నారు. ఎదుటి వారి జీవితాలు ఏమైనా పరవాలేదు.. తాము బాగుండాలన్న ఆలోచనలో నిత్యాసర సరుకుల్లో నకిలీలు, దొంగ నోట్లు, హైటెక్ వ్యభిచారం, డ్రగ్స్ వ్యాపారం ఇలా ఎన్నో రకాల దందాలు చేస్తూ కోట్లు సంపాదిస్తున్నారు. కానీ.. నేరాలు చేసే ఎవరైనా చట్టం నుంచి తప్పించుకోలేరని తెలిసిందే. కిరాణ షాపు ముసుగులో చేస్తున్న దందా పోలీసులు బట్టబయలు చేశారు. వివరాల్లోకి వెళితే..

మనం చూస్తున్న ప్రతీది నిజం కాదు.. దాని వెనుక ఏదో మర్మం ఉంటుందని అంటుంటారు పెద్దలు. ఈ మధ్య కొంతమంది కేటుగాళ్లు డబ్బు సంపాదించడానికి పలు అక్రమాలకు పాల్పపడుతున్నారు. యువతను పెడదోవ పట్టిస్తూ డగ్ర్, గంజాయి అమ్మకాలు చేస్తూ లక్షలు, కోట్లు సంపాదిస్తున్నారు. ఇటీవల పోలీసుల తనిఖీల్లో నిజాలు బయట పడుతున్నాయి. హైదరాబాద్ లో ఓ కిరాణ దుకాణానికి సంబంధించి యవ్వారం పోలీసులు బయటపెట్టారు. గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్రంలో చాపకింద నీరులా డ్రగ్స్, గంజాయి సరఫరా సాగుతుంది. ప్రభుత్వం వీటిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నా.. ఏదో ఒక విధంగా అక్రమార్కులు ఈ దందా కొనసాగిస్తూనే ఉన్నారు. ఇటీవల తెలంగాణలో పలు ప్రాంతాల్లో గంజాయి చాక్లెట్ల రూపంలో అమ్ముతూ యువత మాత్రమే కాదు చిన్న పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు కేటుగాళ్ళు.

హైదరాబాద్ లోని జగద్గిరి గుట్టలోని జయశ్రీ ట్రేడర్స్ పేరుతో ఉన్న కిరాణా షాపు లో భారీ ఎత్తున గంజాయి చాక్లెట్లు బయటపడ్డాయి. కిరాణా షాప్ లో కొంత కాలంగా గుట్టు చప్పుడు కాకుండా గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్నట్లు పక్కా సమాచారంతో ఎస్‌ఓటీ పోలీసులు దాడి చేశారు. ఈ క్రమంలోనే గంజాయి చాక్లెట్లు రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నారు. మొత్తం 26 కిలోల బరువు ఉన్న 6400 గంజాయి చాక్లెట్స్ తో పాటు 4 కేజీల గంజాయిని పోలీసులు సీజ్ చేశారు. మొటి మొత్తం మూడు లక్షలకు పైగా ఉండవొచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ కేసులో కోల్‌కొతాకు చెందిన మనోజ్ కుమార్ అగర్వాల్ ని అరెస్ట్ చేయగా.. మోహన్ అనే నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరు నిందితులపై ఎన్‌డీపీఎస్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.