iDreamPost
android-app
ios-app

HYD: వాహనదారులకు అలర్ట్.. వాహనాలకు అది లేకుంటే ఇక పోలీస్ స్టేషన్‌కే..!

  • Published May 16, 2024 | 9:05 AM Updated Updated May 16, 2024 | 9:05 AM

హైదరాబాద్‌ పోలీసులు నగర వాసులకు కీలక అలర్ట్‌ జారీ చేశారు. అది లేకుండా వాహనాలు రోడ్డెక్కితే.. ఇక పోలీస్‌ స్టేషన్‌కే అని హెచ్చరికలు జారీ చేశారు. ఆ వివరాలు..

హైదరాబాద్‌ పోలీసులు నగర వాసులకు కీలక అలర్ట్‌ జారీ చేశారు. అది లేకుండా వాహనాలు రోడ్డెక్కితే.. ఇక పోలీస్‌ స్టేషన్‌కే అని హెచ్చరికలు జారీ చేశారు. ఆ వివరాలు..

  • Published May 16, 2024 | 9:05 AMUpdated May 16, 2024 | 9:05 AM
HYD: వాహనదారులకు అలర్ట్.. వాహనాలకు అది లేకుంటే ఇక పోలీస్ స్టేషన్‌కే..!

వాహనదారులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అనేక మార్గదర్శకాలు, కొత్త రూల్స్‌ అమల్లోకి తీసుకొస్తుంది. ఈ క్రమంలో తాజాగా ఆర్టీఓ అధికారులు.. కార్లు, బైక్‌లకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్‌ ప్లేట్‌ తప్పని సరి చేసిన సంగతి తెలిసిందే. ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించని వారికి పది వేల రూపాయల జరిమానా.. కాలుష్య నియంత్రణ ధృవీకరణ పత్రం లేని వాహనాలకు పెట్రోలు పంపుల వద్ద జరిమానా విధించే కొత్త విధానాన్ని అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు వాహనదారులకు కీలక అలర్ట్‌ జారీ చేశారు. అది లేకుండా రోడ్డు ఎక్కితే.. ఇక పోలీస్‌ స్టేషన్‌కే అంటున్నారు. ఆ వివరాలు..

గత కొంత కాలంగా నగరంలో సెలఫోన్‌ దొంగతనాలు, చైన్‌ స్నాచింగ్‌లు ఎక్కువయ్యాయి. రోడ్డు మీద నడుచుకుంటూ.. ఫోన్‌ మాట్లాడుతూ వెళ్లే వారిని టార్గెట్‌ చేసి.. సడెన్‌గా వచ్చి వారి మెడలోని చైన్‌లు, సెల్‌ఫోన్‌లు లాక్కెళ్తున్నారు దుండగులు. బైక్‌ల మీద వచ్చి ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నారు. ఆ తర్వాత పోలీసులు వీరిని పట్టుకునేందుకు సీసీ కెమరాలను పరిశీలించగా.. వాటికి నంబర్‌ ప్లేట్లు ఉండటం లేదు. దీంతో దొంగల్ని పట్టుకోవడం పోలీసులకు కష్టంగా మారుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు.

If the vehicles don't have it then the police station

ఈ క్రమంలో నగరంలో నంబర్‌ ప్లేట్‌ లేని వాహనాలను సీజ్‌ చేయాలని ఉన్నతాధికారలు నిర్ణయం తీసుకున్నారు. దీనిలో భాగంగా బుధవారం నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రత్యేక సోదాలు నిర్వహిస్తున్నారు. మొదటి రోజే 20కి పైగా నంబర్‌ ప్లేట్‌ లేని వాహనాలను సీజ్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. కొత్త నంబర్‌ ప్లేట్‌ బిగించుకున్న తర్వాతే ఆ వాహనాలను తిరిగి యజమానికి అప్పగించారు. ఇలా నంబర్‌ ప్లేట్‌ లేని వాహనాలు నడుపుతున్న వారిలో యువకులే అధికంగా ఉంటున్నారన్నారు. ఇలాంటి వాహనాలపై తల్లిదండ్రులు.. వారి పిల్లలను అప్రమత్తం చేయాలని పోలీసులు సూచిస్తున్నారు.

నంబర్‌ ప్లేట్‌ లేకుండా వాహనాలు నడపడంతో పాటు.. చివరి అంకెలు కనిపించకుండా.. నంబర్‌ ప్లేట్‌ను ట్యాంపరింగ్‌ చేసినా.. కనిపించకుండా స్టిక్కర్లు అంటించినా చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. నగరవ్యాప్తంగా అన్ని పోలీసు స్టేషన్ల పరిధీలో ఈ ప్రత్యేక డ్రైవ్‌లు కొనసాగుతాయని వెల్లడించారు.