సినీ ఇండస్ట్రీకి హైదరాబాద్ కొత్త సీపీ మాస్ వార్నింగ్! పద్ధతి మారాలంటూ!

టాలీవుడ్ ఇండస్ట్రీని మాదక ద్రవ్యాల అంశం కుదిపేసిన సంగతి విదితమే. మొన్న మాదాపూర్ సోదాల్లో కూడా ప్రముఖ హీరో పేరు బయటకు వచ్చింది. ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ ఉండే హైదరాబాద్ కు కొత్త సీపీ వచ్చారు. ఈ క్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు.

టాలీవుడ్ ఇండస్ట్రీని మాదక ద్రవ్యాల అంశం కుదిపేసిన సంగతి విదితమే. మొన్న మాదాపూర్ సోదాల్లో కూడా ప్రముఖ హీరో పేరు బయటకు వచ్చింది. ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ ఉండే హైదరాబాద్ కు కొత్త సీపీ వచ్చారు. ఈ క్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇండస్ట్రీలో డ్రగ్స్ కలకలం టాలీవుడ్‌కు చెడ్డ పేరు తీసుకువస్తోంది. కొన్ని సంవత్సరాల నుండి తెలుగు ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులు డ్రగ్స్ తీసుకున్నట్లు ఆరోపణలు రావడంతో పలువురు నటీనటులు, డైరెక్టర్లు.. విచారణ కూడా ఎదుర్కొన్నారు. ఆ కేసు విచారించిన తెలంగాణ పోలీసులు, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఎలాంటి ఆధారాలు లేవని తేల్చి చెప్పడంతో కేసు క్లోజ్ అయ్యింది. అయితే తాజాగా మాదాపూర్‌లో రైడ్స్ చేపట్టిన సమయంలో మరోసారి నవదీప్ పేరు బయటకు వచ్చింది. అతడు పలు మార్లు విచారణకు కూడా హాజరయ్యాడు. ఇప్పుడు తెలంగాణలో ప్రభుత్వం మారింది. ఈ నేపథ్యంలో భాగ్య నగరికి కొత్త సీపీ వచ్చారు. డ్రగ్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.

హైదరాబాద్ సీపీగా కొత్త కోట శ్రీనివాస్ రెడ్డి నియమించగా.. ఆయన బుధవారం బాధ్యతలు స్వీకరించారు. రోడ్ నంబర్ 12లోని కమాండ్ కంట్రోల్ సెంట్రల్‌లో బాధ్యతలు స్వీకరించిన తర్వాత మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ నగరాన్ని డ్రగ్స్ రహిత నగరిగా మారుస్తానని అన్నారు. ఈ సమయంలోనే టాలీవుడ్ పరిశ్రమకి మాస్ వార్నింగ్ ఇచ్చారు. సినీ పరిశ్రమలో కొంత మంది డ్రగ్స్ తీసుకుంటున్నట్లు గుర్తించామని, సినిమా ఇండస్ట్రీ పెద్దలతో దీనిపై చర్చిస్తామన్నారు. పార్టీల పేరు చెప్పి.. సినీ సెలబ్రిటీలు మాదక ద్రవ్యాలు సేవిస్తున్నారని, కొంత మంది సినీ వర్గాల వాళ్లు కూడా ఇలాంటి పార్టీలను ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. ఇది సరైన పద్ధతి కాదని,  మారాలంటూ పేర్కొన్నారు.

డ్రగ్స్ డిమాండ్ ఉంది కాబట్టే సప్లై ఉందని అన్నారు. డిమాండ్ లేకపోతే సప్లై ఆటోమేటిక్ గా ఆగిపోతుందని పేర్కొన్నారు.  సినిమా పెద్దలు, పబ్ యాజమాన్య సంఘాల వాళ్లు.. మీలో మీరు మీటింగ్స్ పెట్టుకుని డ్రగ్స్ ఫ్రీ నగరంగా ఉంచేలా చేయండని సూచించారు.  వినకపోతే.. వారిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. డ్రగ్స్ వెరీ డేంజరస్ అంశమన్నారు. ఎవరైతే.. ఎక్కడైతే ప్రోత్సాహం లభిస్తుందో.. అక్కడ ఉన్న పెద్దలు చొరవ తీసుకోవాలని విన్నవించారు. తాము చొరవ తీసుకుని, ఆ పెద్దలతో మాట్లాడి.. డ్రగ్స్ నివారణకు తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇప్పుడు స్వయంగా సీపీనే ప్రెస్ మీట్‌లో టాలీవుడ్‌లో మాదక ద్రవ్యాల వినియోగంపై వార్నింగ్ ఇవ్వడం చర్చనీయాంశమైంది. తెలుగు ఇండస్ట్రీలో డ్రగ్స్ వ్యవహారంపై సీపీ చేసిన వ్యాఖ్యలపై  మీ అభిప్రాయాలను కామెంట్లలో తెలియజేయండి.

Show comments