Dharani
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్. త్వరలోనే ఛార్జీలు భారీగా పెంచే అవకాశం ఉందని సమాచారం. ఆ వివరాలు..
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్. త్వరలోనే ఛార్జీలు భారీగా పెంచే అవకాశం ఉందని సమాచారం. ఆ వివరాలు..
Dharani
హైదరాబాద్‌లో మెట్రో అందుబాటులోకి వచ్చాక.. ప్రయాణం చాలా సౌకర్యవంతంగా మారింది. నగరంలో ఆ చివరి నుంచి.. ఈ చివరి వరకు మెట్రో ఉండటం వల్ల.. దూర ప్రాంతాలకు ప్రయాణం చేసే వారికి ఇది ఎంతో కలిసి వస్తుంది. ట్రాఫిక్ సమస్య లేకుండా.. ప్రశాంతంగా ప్రయాణం చేయవచ్చు. వర్షం పడినా.. ఇతరాత్ర ఎలాంటి సమస్యలు వచ్చినా.. మెట్రో అందుబాటులో ఉండటం వల్ల అర్థరాత్రి సమయంలో వరకు కూడా ఎంతో సురక్షితంగా ప్రయాణం చేసే అవకాశం లభించింది. అయితే మెట్రోలో ఉన్న ఒకే ఒక్క నెగిటివ్ పాయింట్ ఏంటంటే.. దీని ఛార్జీలు కాస్త ఎక్కువగా ఉంటాయి. బస్ టికెట్ ధరతో పోలిస్తే.. మెట్రో ఛార్జీలు చాలా ఎక్కువ. కనుక ఇప్పటికి కూడా చాలా మంది మెట్రోప్రయాణం అంటే కాస్త వెనకడుగు వేస్తారు. ఈ క్రమంలో హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్ చెప్పింది. ఛార్జీలు భారీగా పెరగనున్నాయి. ఎంతంటే..
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే మీ జేబులకు చిల్లు పడనుంది. మెట్రో ఛార్జీలను పెంచేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. మెట్రో నిర్వహణ ఖర్చులు పెరిగిన నేపథ్యంలో.. ఉన్నతాధికారుల సూచన మేరకు.. టికెట్ ధరలను పెంచేందుకు ఎల్ అండ్ టీ సంస్థ రెడీ అవుతోంది. రోజువారి నిర్వహణ ఖర్చులు, నష్టాల భారాన్ని తగ్గించుకునేందుకు.. మెట్రో టికెట్ ధరలను పెంచాలని ఎల్ అండ్ టీ సంస్థ రెడీ అవుతోంది. దాంతో తర్వలోనే మెట్రో టికెట్ ఛార్జీలు భారీగా పెరిగే అవకాశం ఉంది అంటున్నారు. మెట్రో ప్రారంభమైన సమయంలో ఉన్న ధరలే ఇప్పటికీ అమల్లో ఉన్నాయి. ఒకసారి మెట్రో ఛార్జీలు పెంచితే మరో ఐదేళ్ల వరకు పెంచే అవకాశం ఉండదు. అందుకే అన్ని అంశాలను బేరీజు వేసుకొని ఛార్జీల ఎంత పెంచాలనే దానిపై కసరత్తు చేసినట్లు సమాచారం.
హైదరాబాద్ మెట్రో… మూడు లైన్ల ద్వారా ప్రస్తుతం రోజుకు 5 లక్షల మంది ప్రయాణికులు తమ గ్యమస్థానాలకు చేరుకుంటున్నారు. మహిళకు ఫ్రీ బస్సు జర్నీతో మెట్రోకు గతంతో పోలిస్తే కాస్త రద్దీ తగ్గింది అని చెప్పవచ్చు. అదే సమయంలో నిర్వహణ వ్యయం పెరిగింది. ప్రతి నెలా రూ. 45 కోట్ల చొప్పున ఏడాదికి రూ. 540 కోట్ల నష్టం వస్తున్నట్లు తాజాగా ఎల్అండ్‌టీ చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో ధరలు పెంచి నిర్వహణ భారాన్ని తగ్గించుకునేందుకు మెట్రో ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం మెట్రోలో 2 కిమీ దూరానికి టికెట్ ధర రూ.10గా ఉంది. 2-4 కి.మీ దూరానికి రూ.15 టికెట్ ఛార్జ్ చేస్తున్నారు.
అలానే 4-6 కి.మీ. దూరానికి రూ.25, 6-8 కి.మీ. దూరానికి రూ.30, 8-10 కి.మీ. దూరానికి రూ.35, 10-14 కి.మీ. దూరానికి రూ.40, 14-18 కి.మీ. దూరానికి రూ.45, 18-22 కి.మీ. దూరానికి రూ.50, 22-26 కి.మీ. దూరానికి రూ.55, 26 కిలోమీటర్లకు పైగా దూరానికి రూ.60 మేర టికెట్ ధర వసూలు చేస్తున్నారు. అంటే ప్రస్తుతం ప్రారంభ టికెట్ ధర రూ.10 ఉండగా.. గరిష్ఠంగా రూ. 60 ఉంది. టికెట్ రేట్లు 5-10 శాతం పెంచి కనీస ధర రూ. రూ.20కి, గరిష్ఠ ధర రూ.80కి పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీని వల్ల ప్రయాణికుల భారం పెరగనుంది.