iDreamPost
android-app
ios-app

వాతావరణ శాఖ హెచ్చరికలు.. మూడ్రోజులపాటు అవసరమైతే తప్ప బయటకు రావొద్దు

Meteorological Department Big Alert: రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ కీలక అలర్ట్ ను జారీ చేసింది. వచ్చే మూడ్రోజుల్లో అవసరం అయితేనే బయటకు రావాలంటూ హెచ్చరిస్తోంది.

Meteorological Department Big Alert: రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ కీలక అలర్ట్ ను జారీ చేసింది. వచ్చే మూడ్రోజుల్లో అవసరం అయితేనే బయటకు రావాలంటూ హెచ్చరిస్తోంది.

వాతావరణ శాఖ హెచ్చరికలు.. మూడ్రోజులపాటు అవసరమైతే తప్ప బయటకు రావొద్దు

బాబోయ్ ఎండలు అంటూ బెంబేలెత్తిపోయే పరిస్థితి వచ్చేసింది. దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇదే సీన్ రిపీట్ అవుతోంది. పగటి పూట ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. భానుడి భగ భగలకు నీరు గారిపోతున్నారు. మరోవైపు వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరిస్తూనే ఉన్నారు. మరీ ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వచ్చే మూడ్రోజుల్లో అవసరం అయితేనే బయటకు రావాలంటూ సూచిస్తున్నారు. అలా కాకుండా బయటకు వస్తే ఎండ వేడికి తీవ్రంగా దెబ్బతింటారు అంటూ హెచ్చరిస్తున్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రావొద్దంటూ కోరుతున్నారు.

దేశవ్యాప్తంగా సూర్యుడి ప్రచండ కిరణాలకు ప్రజలు విలవిల్లాడుతున్నారు. శుక్రవారం జరిగిన రెండో విడత లోక్ సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. ఒక్క కేరళ రాష్ట్రంలోనే ముగ్గురు ఓటర్లు, ఒక పోలింగ్ ఏజెంట్ ఎండ తాపానికి కుప్పకూలి ప్రాణాలు కోల్పోయారు. తెలుగు రాష్ట్రాల్లోనూ ఎండల తీవ్రత అదే తరహాలో ఉంటోంది. ముఖ్యంగా పగటిపూట ఉష్ణోగ్రత 40 డిగ్రీలు కామన్ అయిపోయింది. అందుకే తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ అధికారులు, వైద్యులు సూచనలు చేస్తున్నారు. తాజాగా తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అవసరం అయితే తప్ప వచ్చే మూడ్రోజులు బయటకు రావొద్దంటూ హెచ్చరిస్తోంది.

Heavy temparature

వచ్చే మూడ్రోజుల్లో రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు. పొడి వాతవరణం కారణంగా రోజు ఉంటున్న ఉష్ణోగ్రత కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే ఆస్కారం ఉంది అంటున్నారు. అందుకో ఉదయం 11 గంటల నుంచి 3 గంటల మధ్య అవసరం లేకుండా బయటకు రావొద్దు అంటున్నారు. సాధారణం కంటే ఎక్కువగా పలు జిల్లాలు, ప్రాంతాల్లో ఈదురు గాలులు వచ్చే ప్రమాదం ఉదంటున్నారు. హైదరబాద్ వాతావరణ కేంద్రం ఈ హెచ్చరికలు జారీ చేసింది. అలాగే ఆదివారం(ఏప్రిల్ 28) రోజు రాష్ట్రంలో అక్కడక్కడ ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందంటున్నారు.

నిజానికి గతేడాదితో పోలిస్తే ఎండలు మండిపోతున్నాయి. అందుకే వైద్యులు కూడా పలు కీలక సూచనలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలు కాస్త అప్రమత్తంగా ఉండాలి అంటున్నారు. అవసరం లేనిదే బయటకు రాకూడదు. ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లలు, గర్భిణీలు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రాకండని చెబుతున్నారు. అలాగే ఉద్యోగాల రీత్యా పగటి పూట బయట తిరిగే వాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు. కాటన్ వస్త్రాలు ధరించడం, లైట్ కలర్స్ దుస్తులను మాత్రమే వేసుకోవడం, తగినంత నీరు తాగడం, బైక్ మీద వెళ్లేటప్పుడు కళ్లజోడు, హెల్మెట్ ధరించడం చేయాలంటున్నారు.