రూ.23 కోట్లు విలువైన బంగారం, వెండి పట్టివేత..ఎక్కడంటే?

Gold and Silver Seized: ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభ పెట్టి తమకే ఓటు వేయాలని బడా రాజకీయ నేతలు పలు రకాల గిఫ్టులు ఇస్తుంటారు. అదే సమయంలో పోలీసులు, ఎన్నికల అధికారులు విసృత తనిఖీలు చేపట్టి వారి అక్రమార్కులకు చెక్ పెడతారు.

Gold and Silver Seized: ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభ పెట్టి తమకే ఓటు వేయాలని బడా రాజకీయ నేతలు పలు రకాల గిఫ్టులు ఇస్తుంటారు. అదే సమయంలో పోలీసులు, ఎన్నికల అధికారులు విసృత తనిఖీలు చేపట్టి వారి అక్రమార్కులకు చెక్ పెడతారు.

తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఎన్నికల హడావుడి కొనసాగుతుంది. గత ఏడాది చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి అధికారాన్ని చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం రాబోయే లోక్ సభ ఎన్నికల్లో మరోసారి సత్తా చాటేందుకు రంగం సిద్దం చేసుకుంటుంది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత పదేళ్ల పాటు పరిపాలన కొనసాగించిన బీఆర్ఎస్ తమ పూర్వవైభవాన్ని చాటుకునేందుకు ప్రయత్నిస్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా ప్రచారాలు మార్మోగుతున్నాయి. ఇదిలా ఉంటే ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే పోలీసు తనిఖీల్లో భారీ ఎత్తున డబ్బు, బంగారం, వెండి పట్టుబడుతున్నాయి. తాజాగా హైదరాబాద్ లో భారీ ఎత్తున బంగారం పట్టుబడింది. వివరాల్లోకి వెళితే..

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పలు రాజకీయ పార్టీలు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాయి. గుట్టు చప్పుడు కాకుండా డబ్బు, బంగారం, వెండి, పట్టు చీరలు ఇలా ఎన్నో రకాలుగా ఓటర్లకు పంచుతూ తమకు ఓటేయాలని చెబుతున్నారు రాజకీయ నేతలు. ఇది ప్రతి ఎన్నికల సమయంలో జరిగే తంతే. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అక్రమంగా తరలిస్తున్న నగదు, బంగారం ఎలక్షన్ అధికారులు ఎప్పటికప్పుడు పట్టుకొని సీజ్ చేస్తూనే ఉంటారు. తెలంగాణ వ్యాప్తంగా పోలీసులతో పాటు తనిఖీ బృందాలు ఇప్పటి వరకు డబ్బు, బంగారం, వెండి పట్టుకొని సీజ్ చేశారు.. వీటి విలువ కోట్లలో ఉంది. తాజాగా హైదరాబాద్ లో భారీ ఎత్తున బంగారం, వెండి పట్టబడింది.

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మాదాపూర్ ఎస్ఓటీ పోలీసు, ఆర్‌జీఐ పోలీసులు సంయుక్తంగా వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సరైన పత్రాలు లేకుండా 34.78 కిలోల బంగారు నగలు, 43.60 కిలోల వెండి పట్టుకున్నారు. తర్వాత ఆర్‌జీఐ పోలీస్ స్టేషన్ కి తరలించారు. పట్టుకున్న బంగారం, వెండి విలువ రూ.23 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. విచారణలో భాగంగా బంగారు, వెండి ఆభరణాలను ఎఫ్ఎస్‌టీ టీంకు అప్పగించారు. ఈ కేసులో ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులు వారి విచారణ మొదలు పెట్టారు. పట్టుబడ్డ బంగారం, వెండి ఆభరణాలు జీఎంఆర్ డొమాస్టిక్ ఎయిర్ కార్గో ద్వారా ముంబై నుంచి హైదరాబాద్ కు తరలి వస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని అధికారులు తెలిపారు. ఈ మధ్య కాలంలో ఇంద పెద్ద ఎత్తున బంగారం, వెండి పట్టుబడటం ఇదే మొదటిసారి అంటున్నారు.

Show comments