iDreamPost
android-app
ios-app

చదువుల తల్లి.. ఇంటర్‌లో440కి 432 మార్కులు.. కన్నీరు పెట్టిస్తోన్న సూ*సైడ్‌ నోట్‌..

  • Published Jul 22, 2024 | 2:55 PMUpdated Jul 22, 2024 | 2:55 PM

Hyderabad: ఆ విద్యార్థిని చదువుల తల్లి అని చెప్పవచ్చు. ఇంటర్‌ ఫస్టియర్‌లో 440 మార్కులకి గాను ఏకంగా 432 తెచ్చుకుంది. మరి ఏం కష్టం వచ్చిందో తెలియదు దారుణ నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు..

Hyderabad: ఆ విద్యార్థిని చదువుల తల్లి అని చెప్పవచ్చు. ఇంటర్‌ ఫస్టియర్‌లో 440 మార్కులకి గాను ఏకంగా 432 తెచ్చుకుంది. మరి ఏం కష్టం వచ్చిందో తెలియదు దారుణ నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు..

  • Published Jul 22, 2024 | 2:55 PMUpdated Jul 22, 2024 | 2:55 PM
చదువుల తల్లి.. ఇంటర్‌లో440కి 432 మార్కులు.. కన్నీరు పెట్టిస్తోన్న సూ*సైడ్‌ నోట్‌..

ఆ విద్యార్థిని చదువుల తల్లి అని చెప్పవచ్చు. ఇంటర్‌ ఫస్టియర్‌లో ఏకంగా 440కి 432 మార్కులు సాధించింది అంటే ఆమె ప్రతిభను అర్థం చేసుకోవచ్చు. చిన్నప్పటి నుంచి చదువులో రాణిస్తోన్న ఆ యువతి కల డాక్టర్‌ కావడం. అందుకోసం రాత్రింబవళ్లు కష్టపడి చదవసాగింది. తల్లిదండ్రులు పేదవాళ్లైనా సరే.. చదువు విషయంలో మాత్రం కుమార్తెను ప్రోత్సాహించారు. ప్రస్తుతం ఇంటర్‌ సెకండియర్‌ చదువుతోన్న ఆ యువతి.. హాస్టల్‌లో ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ క్రమంలో సదరు విద్యార్థిని రాసిన సూసైడ్‌ నోట్‌.. ప్రతి ఒక్కరిని కంట తడి పెట్టిస్తోంది. నాన్న నీ కూతురిగా ఉండే అర్హత నాకు లేదు.. నా బాధ మీకు చెప్పుకోలేను.. నా వల్ల ఇంకా మీకు ఖర్చే అంటూ ఆమె రాసిన సూసైడ్‌ నోట్‌ సంచలనంగా మారింది. ఆ వివరాలు..

ఈ విషాదకర సంఘటన హైదరాబాద్‌లోని చైతన్యపురి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఆర్కేపురం గ్రీన్‌హిల్స్‌ కాలనీలోని శ్రీచైతన్య కాలేజీలో చోటు చేసుకుంది. ఇంటర్‌ సెకండియర్‌ చదువుతోన్న వేణు శ్రీ అనే విద్యార్థిని కాలేజీ హాస్టల్‌లో ఆత్మహత్యాయత్నం చేసింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నాగర్‌కర్నూల్‌ జిల్లా, అచ్చంపేట మండలం, చేదురుబావి తండాకు చెందిన వేణశ్రీ.. చైతన్యపురి, గ్రీన్‌హిల్స్‌లోని కాలేజీలో ఇంటర్‌ సెకండియర్‌ చదువుతోంది. ఫస్టియర్‌లో ఆమెకు 440 మార్కులకు గాను 432 మార్క్స్‌ వచ్చాయని తెలిసింది.

డాక్టర్‌ కావాలనేది వేణుశ్రీ కల. అందుకోసం రాత్రింబవళ్లు కష్టపడి చదివేది. మరి ఏం జరిగిందో తెలియదు కానీ.. తాజాగా వేణుశ్రీ ఆత్మహత్యకు పాల్పడింది. ఇది గమనించిన తోటి విద్యార్థులు.. వెంటనే వేణుశ్రీ మెడకున్న ఉరి తొలగించి.. ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. వేణుశ్రీ రాసిన సూసైడ్‌ నోట్‌ ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది.

సూసైడ్‌ నోట్‌లో వేణుశ్రీ తన ఆవేదనను ఇలా వ్యక్తం చేసింది. ‘‘నాన్న నన్ను క్షమించు.. నేను రేపటి వరకు ఉంటానో, ఉండనో తెలీదు. నా వరకు నేను బాగానే ప్రయత్నం చేస్తున్నాను. కానీ నీ పరువు కాపాడలేనేమోనని భయమేస్తుంది. నీ కుమార్తెగా ఉండే అర్హతను కోల్పోయా. నా ఆరోగ్యం కూడా బాగుండటం లేదు. నా సమస్యల గురించి మీకు చెప్పలేను. మీరు నా ఫీజ్‌ కట్టేందుకు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. మళ్లీ నా సమస్యలను చెప్పుకుని.. మిమ్మల్ని ఇంకా కష్టపెట్టలేను. నా వల్ల మీరు ఇబ్బంది పడొద్దు.. ఈ జీవితానికి ఇక సెలవు. రేణూ నా బదులు నువ్వు నాన్న వాళ్లను మంచిగా చూసుకో. నా కుమార్తె డాక్టర్‌ అని డాడీ గర్వంగా చెప్పుకుని తిరగాలి. సో.. బై మరి ఉంటాను’’ అంటూ తనలోని అంతర్మథనాన్ని పేపర్‌ మీద పెట్టింది వేణు శ్రీ. పోలీసులు ఈ ఘటనపై విచారిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి