iDreamPost
android-app
ios-app

30 లక్షల్లో ఒకరికి వచ్చే వ్యాధితో చిన్నారి.. సాహసం చేసి కాపాడిన వైద్యులు!

Hyderabad: ఇలాంటి అరుదైన వ్యాధుల చికిత్సకు కేరాఫ్ అడ్రెస్ గా మారుతుంది హైదరాబాద్ నగరం. తాజాగా 30 లక్షల్లో ఒకరి సోకే వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి భాగ్యనగరం వైద్యులు ప్రాణం పోశారు.

Hyderabad: ఇలాంటి అరుదైన వ్యాధుల చికిత్సకు కేరాఫ్ అడ్రెస్ గా మారుతుంది హైదరాబాద్ నగరం. తాజాగా 30 లక్షల్లో ఒకరి సోకే వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి భాగ్యనగరం వైద్యులు ప్రాణం పోశారు.

30 లక్షల్లో ఒకరికి వచ్చే వ్యాధితో చిన్నారి.. సాహసం చేసి కాపాడిన వైద్యులు!

కాలం మారుతున్న క్రమంలో మనుషులతో పాటు ప్రకృతిలోనూ అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇదే సమయంలో వింత వింత జబ్బులు, అరుదైన వ్యాధులు మనుషులను ఇబ్బంది పెడుతున్నారు. ఇక కొన్ని వ్యాధుల గురించి వింటుంటే ఆశ్చర్యం కలుగుతుంది. లక్షల్లో, కోట్లల్లో ఒకరికి వచ్చే కొన్ని అరుదైన  వ్యాధులు జనాలను భయపెడుతుంటాయి.  కొన్ని సార్లు చికిత్స చేసినా ప్రాణాలు నిలవకపోవచ్చు. అయితే ఇలాంటి అరుదైన వ్యాధుల చికిత్సకు కేరాఫ్ అడ్రెస్ గా మారుతుంది హైదరాబాద్ నగరం. తాజాగా లక్షల్లో ఒకరి సోకే వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి భాగ్యనగరం వైద్యులు ప్రాణం పోశారు. ఇక అసలు ఆ వ్యాధి ఏమిటి, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

హైదరాబాద్ నగరానికి చెందిన 14 ఏళ్ల బాలికను ఇటీవల ఆమె తల్లిదండ్రులు సిటిజన్‌ ఆస్పత్రిలో చేరింది. ఆ సమయంలో బాలిక చాలా డేంజర్ స్థితిలో ఉంది. అప్పటికే బాలికలో ఆక్సిజన్ లెవల్స్ తక్కువగా ఉండటంతో ఐసీయూకు తరలించారు. ఇక ఆ బాలిక అనారోగ్య సమస్య గురించి వైద్యలు ఆమె తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. గత రెండేళ్లుగా బాలిక ఓ సమస్యతో బాధపడుతుందని తెలిసింది. ఆమె తినడానికి చాలా ఇబ్బంది పడుతోందని, అందుకే అప్పటి నుంచి కేవలం జ్యూసుల రూపంలో లిక్వెడ్ ను మాత్రమే తీసుకుంటుంది. దీంతో ఆ పాప  బరువు కూడా ఏకంగా 32 కిలోలకు తగ్గింది. అలానే గొంతులో ఉండే వివిధ రకాల కండరాలు, నాలుక బలహీనపడ్డాడు.

ఇక ఆ బాలికకు వివిధ రకాల పరీక్షలు చేసిన వైద్యులు..ఓ అరుదైన వ్యాధి సోకినట్లు గుర్తించారు. 30 లక్షల్లో ఒకరికి సోకే అరుదైన వ్యాధి  ‘మస్తీనియ గ్రావిస్’ వ్యాధి సోకినట్లు వైద్యులు తేల్చారు. దీంతో ఆ వ్యాధికి సిటిజన్‌ ఆసుపత్రి  వెద్యులు చికిత్స అందించారు. న్యూరాలజిస్టు డాక్టర్‌ అపర్ణ, సీనియర్‌ పిడియాట్రిషీయన్‌ డాక్టర్‌ కిరణ్‌ కుమార్‌ ఆధ్వర్యంలోని వైద్య బృందం ఆ బాలికకు చికిత్స  అందించారు. ఆ పాపకు సుదీర్ఘంగా చికిత్స అందించిన తరువాత ప్రస్తుతం బాలిక పరిస్థితి మెరుగైంది. ట్రిట్మెంట్ లో భాగంగా తొలుత లిక్విడ్ ఫుడ్ ను మాత్రమే అందించామని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం బాలిక ఘనాహారం కూడా తీసుకుంటుందని వైద్యులు తెలిపారు. అలానే బాలిక  స్వయంగా నడక మొదలు పెట్టిందన్నారు. ఇక ఈ  అరుదైన వ్యాధి గురించి వైద్యులు కీలక  విషయాలను వెల్లడించారు. ఈ వ్యాధి బారినపడిన వారికి క్రమేపీ నాడీ కండరాలు బలహీనపడతాయన్నారు. ఆ తర్వాత బాధితులు చనిపోయే ప్రమాదం కూడా ఉంటుందని వైద్యులు వెల్లడించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి