iDreamPost
android-app
ios-app

థియేటర్లో ఉక్కపోత.. ముక్త ఏ2 సినిమాస్‌ నిర్లక్ష్యానికి జరిమానా!

  • Published May 28, 2024 | 8:24 AM Updated Updated May 28, 2024 | 8:24 AM

Hyderabad: మనిషికి ఎన్ని టెన్షన్లు ఉన్నా.. కాస్త రిలాక్స్ పొందెందుకు కుటుంబంతో కలిసి పార్కులు, సినిమాలకు వెళ్తుంటారు. ఈ మధ్య సినిమా థియేటర్లలో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఓ ప్రేక్షకులు తనకు కలిగిన అసౌకర్యానికి థియేటర్ యాజమాన్యానికి సరైను గుణపాఠం చెప్పాడు.

Hyderabad: మనిషికి ఎన్ని టెన్షన్లు ఉన్నా.. కాస్త రిలాక్స్ పొందెందుకు కుటుంబంతో కలిసి పార్కులు, సినిమాలకు వెళ్తుంటారు. ఈ మధ్య సినిమా థియేటర్లలో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఓ ప్రేక్షకులు తనకు కలిగిన అసౌకర్యానికి థియేటర్ యాజమాన్యానికి సరైను గుణపాఠం చెప్పాడు.

థియేటర్లో ఉక్కపోత.. ముక్త ఏ2 సినిమాస్‌ నిర్లక్ష్యానికి జరిమానా!

ప్రేక్షకులు తమకు లైఫ్ లో ఎన్ని టెన్షన్లు ఉన్నా.. తమ అభిమాన హీరో సినిమా చూస్తు కాస్త రిలాక్స్ అవుతుంటారు. సినిమా చూసి ఎంజాయ్ చేయాలనుకునే వారికి కొంతమంది థియేటర్ల యాజమాన్యం చుక్కలు చూపిస్తున్నారు.  పార్కింగ్ నుంచి మొదలు థియేటర్లో వసతుల వరకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.   ప్రేక్షకులకు సరైన వసతి కల్పించడం లేదని ఫిర్యాదులు వస్తున్న విషయం తెలిసిందే.  సినిమా చూస్తు కాస్త రిలాక్స్ కావాలని చూసిన ఓ ప్రేక్షకుడు తీవ్ర అసౌకర్యానికి గురయ్యాడు. ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అయ్యాడు. తనకు కలిగిన అసౌకర్యానికి థియేటర్ యాజమాన్యానికి సరైన బుద్ది చెప్పాడు. ఈ ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్ లో ఓ వినియోగదారుడు చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. హ్యాపీగా థియేటర్ కి వెళ్లి సినిమా చూసి ఎంజాయ్ చేయాలని భావించాడు. తీరా థియెటర్లోకి వెళ్లిన తర్వాత ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. దాంతో సినిమా చూసిన ఎంజాయ్ మెంట్ లేదని భావించి తనకు జరిగిన అసౌకర్యానికి సరైన గుణపాఠం చెప్పాలని భావించాడు. వెంటనే వినియోగదారుల కమీషన్ కి ఫిర్యాదు చేశాడు. వెంటనే థియేటర్ యాజమాన్యానికి వినియోగదారులు కమిషన్ – 2 జరిమానా విధించింది. అసలు ఏం జరిగిందంటే.. హైదరాబాద్ కి చెందిన నిష్పర్ అనే వ్యక్తి ‘కిసి కా భాయ్.. కిసికా జాన్’ మూవీ చూసేందుకు 2023 ఏప్రిల్ 28న అబిడ్స్ లోని ‘ముక్త ఏ2 సినిమాస్’ థియేటర్ కి వెళ్లారు. తన ద్విచక్రవాహనం పార్క్ చేసినందుకు రూ.20 రుసుము, సినిమా టికెట్ కి రూ.150 చెల్లించాడు. సినిమా మొదలైనప్పటి నుంచి థియేటర్లో ఏసీ పనిచేయకపోవడం, అక్కడ ఏర్పాటు చేసిన ఫ్యాన్ల గాలి అంతంత మాత్రమే రావడంతో ప్రేక్షకులు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. సినిమా చూస్తున్న ఎంజాయ్ లేకుండా పోయింది.

ఇంట్రవెల్ సమయంలో థియేటర్ యాజమాన్యాన్ని ప్రశ్నించాడు.. దీనికి వారు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. పైగా నిష్పర్ ని బండ బూతులు తిట్టి చూస్తే చూడు లేదంటే వెళ్లిపో అంటూ దురుసుగా ప్రవర్తించారు. తనకు జరిగిన అవమానం, అసౌకర్యానికి థియేటర్ యాజమాన్యానికి బుద్ది వచ్చేలా చేయాలని భావించాడు. వెంటనే వినియోగదారుల కమీషన్ ని ఆశ్రయించాడు. గోల్డ్ క్లాస్ సీట్ లోనూ ఏసీ ఏర్పాటు చేయలేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు తెలంగాణ సినిమాస్ (రెగ్యూలేషన్) చట్టం – 1955 ప్రకారం రూ.110 ఉండాల్సిన టికెట్ ధర రూ.150 కు పెంచి అమ్ముతున్నారని ఆరోపించాడు. నోటీసులు అందుకున్న ప్రతివాద థియేటర్ యాజమాన్యం ఫిర్యాదుదారు ఆరోపణలు నిరాధారమైనవని తెలిపింది. ఇరు వర్గాల వాదనలు, సాక్ష్యాలు పరిశీలించిన అనంతరం కమీషన్ – 2 ఫిర్యాదుదారుడికి పరిహారంగా రూ.30 వేలు, కేసు ఖర్చులు నిమిత్తం రూ.1000 తో పాటు టికెట్ డబ్బులు రిఫండ్ చేయాలని తీర్పునిచ్చింది. ఈ తీర్పు వెలువడిన అనంతరం 45 రోజుల గడువు విధించింది.