iDreamPost
android-app
ios-app

మార్కెట్ లోకి కొత్త విస్కీ.. తాగితే కిక్కుతో పాటు ఆరోగ్యం కూడా

  • Published Apr 04, 2024 | 8:51 AM Updated Updated Apr 04, 2024 | 8:51 AM

Bio Liquor: మద్యపానం వల్ల అనారోగ్యం అని ఇప్పటి వరకు చదివాం. కానీ తాజాగా ఓ కంపెనీ కిక్కుతో పాటు ఆరోగ్యాన్ని పెంచే మద్యాన్ని మార్కెట్ లోకి తెచ్చింది. ఆ వివరాలు..

Bio Liquor: మద్యపానం వల్ల అనారోగ్యం అని ఇప్పటి వరకు చదివాం. కానీ తాజాగా ఓ కంపెనీ కిక్కుతో పాటు ఆరోగ్యాన్ని పెంచే మద్యాన్ని మార్కెట్ లోకి తెచ్చింది. ఆ వివరాలు..

  • Published Apr 04, 2024 | 8:51 AMUpdated Apr 04, 2024 | 8:51 AM
మార్కెట్ లోకి కొత్త విస్కీ.. తాగితే కిక్కుతో పాటు ఆరోగ్యం కూడా

మద్యం సేవించడం వల్ల ఎంత నష్టం కలుగుతుందో ప్రత్యేకంగా వివరించాల్సిన పని లేదు. మద్యానికి బానిసై చిన్న వయసులోనే కన్ను మూస్తున్న వారు ఎందరో ఉన్నారు. ఇక సమాజంలో చోటు చేసుకుంటున్న అనేక నేరాలకు మద్యపానమే ప్రధాన కారణం. తాగిన మత్తులో డ్రైవింగ్ చేస్తూ.. తమ ప్రాణాలు తీసుకోవడమే కాక.. అమాయకులను కూడా బలి తీసుకుంటున్నారు. మరి మద్యం వల్ల ఇన్ని నష్టాలున్నప్పుడు ప్రభుత్వాలు దాన్ని నిషేధించవచ్చు కదా అంటే ఆ పని మాత్రం చేయవు. ఎందుకంటే మద్యం మీద వచ్చే ఆదాయమే ప్రభుత్వాలకు ప్రధాన వనరు. అందుకే దాని జోలికి పోవు.

అయితే ఇప్పటి వరకు మద్యం సేవిస్తే ఆరోగ్యం పాడవుతుంది అన్న మాటలే విన్నం. పైగా మందు తాగిన వారి దగ్గర నుంచి భరించలేని దుర్వాసన వస్తుంది. ఈ రెండు సమస్యలకు చెక్ పెడుతూ మార్కెట్ లోకి కొత్త తరహా మద్యాన్ని తీసుకవచ్చారు. దీన్ని తాగితే కిక్కు ఎక్కుతుంది.. తప్ప ఆరోగ్యం పాడవ్వుదు.. దుర్వాసన రాదు.. పైగా ఇది ఒంటికి ఎంతో మేలు చేస్తుంది అంటున్నారు. ఇంతకు ఆ మందు ఏంటిది అంటే..

తాజాగా హైదరాబాద్ కు చెందిన ఓ లిక్కర్ కంపెనీ కీలక ప్రకటన చేసింది. తాము తయారు చేసిన మద్యం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రావని.. సాధారణ మద్యం మాదిరే కిక్కు ఎక్కుతుందని ప్రకటించింది. ఇంతకు ఆ కంపెనీ ఏది అంటే.. అదే హైదరాబాద్‌ కు చెందిన బయో లిక్కర్స్‌ అండ్‌ డిస్టలరీస్‌ సంస్థ. తాజాగా ఈ కంపెనీ ఆయుర్వేద మద్యాన్ని రూపొందించింది. ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు తీసుకున్న తర్వాత బుధవారం నాడు ఈ లిక్కర్‌ను మార్కెట్ లోకి విడుదల చేసినట్టు తెలిసింది.

BIO whisky good for health

ఆయుర్వేద వైద్యుడు డాక్టర్‌ బీ శ్రీనివాస అమర్‌నాథ్‌ ఈ లిక్కర్‌ను సృష్టించారు. ఈమద్యంలో ఎలాంటి సింథటిక్‌ రుచులు, రంగులను ఉపయోగించకుండా ఆయుర్వేద పద్ధతిలో తయారు చేసినట్లు వెల్లడించారు. అంతేకాక ఈ లిక్కర్‌లో బయో ఫ్లేవనాయిడ్స్‌, బయో ఆల్కలాయిడ్స్‌, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటోకెమికల్స్‌, వివిధ మూలికలు ఉంటాయన్నారు.

ఈమద్యం తయారీలో అకాసియా, కలబంద, పసుపు, తులసి, లవంగాలు, కొత్తిమీర, అల్లం, దాల్చినచెక, జీలకర్ర, నల్ల మిరియాలు, బ్లాక్‌బెర్రీస్‌, చిరాటా, దుంప, మెంతులు, ఎలికంపేన్‌, జెనిటన్‌, రైజోమ్‌, గ్వారానా, రటానీ రూట్‌, సహజసిద్ధమైన వెనిల్లా, వలేరియన్‌, వెరోనికా, వైల్డ్‌ చెర్రీ, తేనె, బే ఆకులు, బ్రయోనియా రూట్‌ తదితర పదార్థాలు వినియోగించినట్లు తెలిపారు. అందువల్ల ఈ మద్యాన్ని సేవిస్తే కిక్కుతో పాటు ఆరోగ్యం కూడా అంటున్నారు.