Biryani: HYDలో రూ. 99కే తిన్నంత బిర్యానీ.. ఎక్కడంటే..?

హైదరాబాద్ నగరవాసులకు బిర్యానీ కొత్తేమీ కాదూ.. అలాగే ఈ నగరానికి వచ్చిన వారు బిర్యానీ టేస్ట్ చేయకుండా వెళ్లలేరు. కడుపారా బిర్యానీ తినాలనుకుంటే మీకొక బెస్ట్ ప్లేస్ ఉందండోయ్. అతి కూడా తక్కువ రేటుకే. అందులో అడిగినంత పెడతారు. ఇంతకు ఎక్కడ ఉందంటే..?

హైదరాబాద్ నగరవాసులకు బిర్యానీ కొత్తేమీ కాదూ.. అలాగే ఈ నగరానికి వచ్చిన వారు బిర్యానీ టేస్ట్ చేయకుండా వెళ్లలేరు. కడుపారా బిర్యానీ తినాలనుకుంటే మీకొక బెస్ట్ ప్లేస్ ఉందండోయ్. అతి కూడా తక్కువ రేటుకే. అందులో అడిగినంత పెడతారు. ఇంతకు ఎక్కడ ఉందంటే..?

బిర్యానీ అంటే హైదరాబాద్.. హైదరాబాద్ అంటేనే బిర్యానీనే గుర్తుకు వస్తుంది. భాగ్య నగరి వాళ్లకు బిర్యానీ అంటే ఓ ఎమోషన్ కూడా. పండుగ, పబ్బాలతో పని లేదు.. వీకెండ్, శాలరీతో సంబంధం లేదు.. బిర్యానీ ఉంటే చాలు లొట్టలేసుకుని ఆరగించేస్తుంటారు. ఇక అందులో దొరికే వెరైటీ ఫుడ్స్ ఎంజాయ్ చేస్తుంటారు. వెజ్ బిర్యానీ, చికెన్, మటన్, ఫ్రాన్స్ అంటూ రకరకాల బిర్యానీలు ట్రై చేస్తుంటారు. చిన్న చిన్న దుకాణాల నుండి స్టార్ హోటల్స్ వరకు ఎక్కడ బాగుంటే అక్కడ వాలిపోతుంటారు. అలాగే ఎక్కడ బిర్యానీ బాగుంటుందో కూడా ఎంక్వైరీ చేస్తుంటారు. అలాంటి బిర్యానీ ప్రియులకు ఓ సూపర్ ప్లేస్ ఉంది. కేవలం వంద రూపాయల లోపే.. తిన్నంత బిర్యానీ దొరకుతుందక్కడ.

ఆ ప్లేస్ ఏంటో.. ఎక్కడో చెబితే.. అక్కడ వాలిపోదామనుకుంటున్నారా.. అయితే బీ రెడీ. మరెక్కడో కాదూ.. హైదరాబాద్ నడి బొడ్డున ఉన్న అమీర్ పేటలో. నగర వాసులకే కాదూ.. ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వాళ్లు (ముఖ్యంగా యువత) ఒక్కసారైనా అమీర్ పేటలో అడుగుపెట్టకుండా తిరిగి వెళ్లలేరేమో. ఎందుకుంటే అమీర్ పేట అనగానే కోచింగ్ సెంటర్లు, షాపింగ్, బుక్ స్టాల్స్, హాస్టల్స్ ఇవే జిందగీ గుర్తుకువస్తుంది. కానీ అదే అమీర్ పేటలో స్ట్రీట్ ఫుడ్ కూడా మస్తు ఉంటుంది. అక్కడే ఈ బిర్యానీ కూడా లభిస్తుంది. మామూలుగా బిర్యానీ అంటే మినిమంలో మినిమం రూ. 150 పెట్టాల్సిందే. అదీ కూడా ఒక్కసారే పెడతారు. తిరిగి అడగడానికి ఛాన్స్ లేదు. కొంచెం రైతా ఎక్కువ అడిగితే.. చంపేస్తున్నారు కూడా.. అయినా అది వేరే విషయం లెండి.

కానీ ఈ బిర్యానీ పాయింట్‌లో మాత్రం తిన్నంత పెడతారు.. అది కూడా కేవలం 99 రూపాయలకే. అమీర్ పేట్ మైత్రి వనం దగ్గర పంజాబ్ నేషనల్ బ్యాంకు ఎదురుగా మధు బిర్యానీ పాయింట్ (తోపుడు బండి) స్టార్ చేశారు. తోపుడు బండి కదా అని తీసిపారేయకండి. టేస్ట్ వేరే లెవలట వర్మ.. 99 రూపాయలకు వర్త్ వర్మ. రుచితో ఏ మాత్రం రాజీ పడలేదట. చికెన్, ప్రై పీస్ బిర్యానీ రూ. 99 కాగా, ఎగ్ బిర్యానీ రూ. 79కే అందిస్తున్నారు. అడిగినంత బిర్యానీ ఆ రేటుకే అందిస్తున్నారు. ప్రతి రోజు ఇక్కడ 600 మందికి పైగా బిర్యానీలు తింటున్నారని యజమానులు చెబుతున్నారు. అలాగే వీరు సమాజ హితం కోరుతున్నారు. ఫుడ్ వేస్ట్ చేయకూడదని రూల్ ఉంది ఇక్కడ. ఒక వేళ వృధా చేస్తే.. ఫైన్ వేస్తారండోయ్. భోజనం వేస్ట్ చేస్తే రూ. 200 కట్టాల్సిందే మరీ. మరెందుకు ఆలస్యం పదండి అమీర్ పేటకు. ఇలాంటి ప్లేసుకు మరిన్ని కావాలనుకుంటున్నారా.. అలాగే మీకు తెలిసిన ఇలాంటి ప్లేసులు ఉంటే మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments