iDreamPost
android-app
ios-app

భార్య లావు అయ్యిందని వద్దుపొమ్మన్న భర్త! వీడేమి మనిషి?

  • Published Jan 27, 2024 | 11:16 AM Updated Updated Jan 27, 2024 | 11:16 AM

కొంత మంది భర్తలు అదనపు కట్నం కోసం భార్యలను వేధించడం మనం చూశాం. కానీ ఓ భర్త చేసిన పని చూస్తే షాకవ్వాల్సిందే. తన భార్య లావు అయ్యిందని తనకు అవసరం లేదని వెళ్లిపొమ్మంటున్నాడు ఆమె భర్త.

కొంత మంది భర్తలు అదనపు కట్నం కోసం భార్యలను వేధించడం మనం చూశాం. కానీ ఓ భర్త చేసిన పని చూస్తే షాకవ్వాల్సిందే. తన భార్య లావు అయ్యిందని తనకు అవసరం లేదని వెళ్లిపొమ్మంటున్నాడు ఆమె భర్త.

  • Published Jan 27, 2024 | 11:16 AMUpdated Jan 27, 2024 | 11:16 AM
భార్య లావు అయ్యిందని వద్దుపొమ్మన్న భర్త! వీడేమి మనిషి?

భార్యాభర్తలన్నాక సంసారంలో చిన్నపాటి అలకలు, గొడవలు సాధారణం. కానీ నేటి రోజుల్లో ప్రతి చిన్న విషయాలకు దారుణ నిర్ణయాలు తీసుకుంటున్నారు. కుటుంబ కలహాల వల్ల, ఆర్థిక పరమైన గొడవల వల్ల కలకాలం కలిసి ఉండాల్సిన భార్యాభర్తలు విడిపోతున్నారు. నిండు నూరేళ్ల వైవాహిక జీవితం మూన్నాళ్ల ముచ్చటగానే మారిపోతుంది. కాగా కొంత మంది భర్తలు అదనపు కట్నం కోసం భార్యలను వేధించడం మనం చూశాం. కానీ ఓ భర్త చేసిన పని చూస్తే షాకవ్వాల్సిందే. తన భార్య లావు అయ్యిందని తనకు అవసరం లేదని వెళ్లిపొమ్మంటున్నాడు ఆమె భర్త. అయితే ఈ వ్యవహారంలో వీరిద్దరు 22ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకోవడం గమనార్హంగా మారింది.

వారిద్దరు 22 ఏళ్ల క్రితం ప్రేమించుకున్నారు. ఆ తర్వాత పెద్దలను ఎదిరించి మరి పెళ్లి కూడా చేసుకున్నారు. వీరికి ఐదుగురు సంతానం కాగా వారిలో ఇద్దరు చనిపోయారు. అయితే ఇప్పుడు ఆ భర్త దాదాపు 22 సంవత్సారాలు కాపురం చేశాక భార్య లావయ్యిందని ఆమెను వదిలేశాడు. దీంతో ఆ మహిళ అత్తింటి ముందు నిరసనకు దిగింది. ఈ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నేరేడ్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంతయ్య కాలనీలో నివాసం ఉండే నాగమణి, అంతోని లాజరస్‌లు 2002 సంవత్సరంలో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఐదుగురు పిల్లలు కాగా అందులో పెద్ద కుమార్తెకు వివాహం కూడా జరిగింది. అయితే సుమారు 22 ఏళ్ల తర్వాత ఆ ఇల్లాలిని భర్త విచిత్ర రీతిలో వేధింపులకు పాల్పడుతున్నాడు.

భార్య లావయ్యిందని.. అందం తగ్గిందని తనకు వద్దంటూ వదిలేశాడు. కూతుర్లకు పెళ్లిల్లు అవుతున్న తరుణంలో భర్త ఇలా మూర్ఖంగా వ్యవహరించడంతో ఆ మహిళ షాక్ కు గురైంది. దీంతో ఆమె అత్తింటి ముందు నిరసనకు దిగింది. తనకు న్యాయం చేయాలంటూ కోరుతోంది. తన భర్త పరాయి మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని తనను ఇంట్లో నుండి కొట్టి వెళ్లగొట్టాడని ఆమె ఆరోపిస్తోంది. దాదాపు సంవత్సర కాలం నుండి తనను ఇంటికి రానివ్వడంలేదని తెలిపింది.

ఇంటికి వెళ్తే దాడులకు పాల్పడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తుంది. తనకు న్యాయం చేయాలని పోలీసులకు కంప్లైంట్ చేసినా పట్టించుకోవడంలేదని గోడు వెళ్ళబోసుకుంది. ఇక భార్య లావయ్యిందని వదిలేసిన భర్తపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు వీడు మనిషేనా ఇన్నేళ్లు కాపురం చేసి భార్యను వదిలేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. వీడు మొగుడు కాదు మూర్కుడు అంటూ మండిపడుతున్నారు. ఇలాంటి వారికి తగిన బుద్ది చెప్పాలంటూ కోరుతున్నారు. ఇక ఈ వ్యవహారంపై ఇదివరకే కేసు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం కేసు కోర్టులో నడుస్తోందని వారు తెలిపారు.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş