iDreamPost
android-app
ios-app

SBI బ్యాంక్‌లో భారీ స్కాం! రూ.2.80 కోట్లతో పరారీలో మేనేజర్‌

  • Published Mar 09, 2024 | 4:28 PM Updated Updated Mar 09, 2024 | 4:28 PM

దేశంలో అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకింగ్ రంగ సంస్థ లో ఒకటైనా ఎస్బీఐలో తరుచు మోసాలనేవి ఎక్కువైపోతున్నాయి. తాజాగా ఓ ఎస్బీఐ బ్రాంచ్ లో ఏకంగా మేనేజర్లే చేసిన పనికి స్థానికంగా సంచలనంగా మారింది.

దేశంలో అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకింగ్ రంగ సంస్థ లో ఒకటైనా ఎస్బీఐలో తరుచు మోసాలనేవి ఎక్కువైపోతున్నాయి. తాజాగా ఓ ఎస్బీఐ బ్రాంచ్ లో ఏకంగా మేనేజర్లే చేసిన పనికి స్థానికంగా సంచలనంగా మారింది.

  • Published Mar 09, 2024 | 4:28 PMUpdated Mar 09, 2024 | 4:28 PM
SBI బ్యాంక్‌లో భారీ స్కాం! రూ.2.80 కోట్లతో పరారీలో మేనేజర్‌

దేశంలో అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకింగ్ రంగ సంస్థ లో ఎస్బీఐ కూడా ఒకటి. అయితే ఈ ఎస్బీఐ కు సంబంధించి ఈ మధ్యకాలంలో తరుచు మోసాలు అనేవి ఎక్కువైపోతున్నాయి. ముఖ్యంగా ఆన్ లైన్ వెరిఫికేషన్ పేరుతో అని, డిపాజిట్ ల పేరుతో ఇలా వివిధ రకాలుగా ప్రజలు ఎంతో నమ్మకంగా దాచుకున్న సోమ్మును కొల్లగొడుతున్నారు. అయితే ఈ మోసాలకు పాల్పడుతున్న వారిలో బ్యాంకింగ్ అధికారులు కూడా ఉండడం గమన్హారం. ఇటీవలే చాలా ప్రాంతాల్లో ఈ బ్యాంక్ అధికారులు ప్రజలు దాచుకున్న బంగారన్ని, డిపాజిట్ ల పేరిట కోట్ల విలువ చేసే నగదును తమ సొంత ఖర్చులకు వాడుకొని దివాలతీసే ఘటనలు ఎన్నో చూస్తున్నాం. అయితే తాజాగా తెలంగాణలో జరిగిన ఓ ఘటనలో ఏకంగా బ్యాంకు మేనేజర్లు చేసిన ఘరానా మోసానికి స్థానికంగా సంచలనంగా మారింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

తాజాగా తెలంగాణలోని ఓ బ్యాంకు మేనేజర్లు అన్నం పెట్టిన బ్యాంకునే కన్నం వేశారు. లోన్ కోసం దరఖాస్తున్న చేసుకున్న ఖాతాదారుల నుంచి డాక్యుమెంట్లు తీసుకుని మరీ మోసానికి పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే దాదాపు రూ.2.80 కోట్లు కాజేశారు. ఈ ఘటన నగరంలోని రామంతపూర్ ఎస్‌బీఐ బ్రాంచ్‌లో చోటు చేసుకుంది. అయితే ఆ ఎస్బీఐ బ్యాంకు మేనేజర్లు షేక్ సైదులు, గంగమల్లయ్య గా వెలుగులోకి వచ్చింది. కాగా, వీరిద్దరూ.. ఖాతాదారులకు తెలియకుండా రూ.2.80 కోట్లను కాజేశారు. అందుకోసం మొదటగా వీరు లోన్ కోసం అప్లై చేసిన ఖాతాదారుల నుంచి డాక్యుమెంట్లు తీసుకున్నారు. ఆ తర్వాత ఫామ్ 16ను ఫోర్జరీ చేసి తప్పుడు స్టేట్‌మెంట్లతో లోన్లు తీసుకున్నారు.ఇక ఆ వచ్చిన లోన్ నగదును వారి భార్య, కొడుకు ఖాతాలకు బదిలీ చేసుకున్నారు. అయితే ఇలా ఫోర్జరీ డాక్యుమెంట్లతో ఇప్పటి వరకు దాదాపు 19 మంది పేర్లపై ఈ మేనేజర్లు లోన్లు తీసుకున్నారు.

కాగా, ఈ నేపథ్యంలోనే ఈ ఎస్బీఐ బ్రాంచ్ కి కొత్త మేనేజర్ రావడంతో వీరి బండారం బయటపడింది. దీంతో బ్యాంకులో జరిగిన మోసాన్ని గుర్తించిన కొత్త మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, ప్రస్తుతం ఆ బ్రాంచ్ మేనేజర్ లు షేక్ సైదులు, భార్య సుష్మ, కొడుకు పీరయ్య, మరో మేనేజర్ గంగమల్లయ్య పరారీలో ఉన్నారు. అయితే కేసు నమోదు చేసుకున్న పోలీసులు మేనేజర్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మరి, బాధ్యతగా ప్రజల నగదును సురక్షితంగా ఉంచాల్సిన బ్యాంకు మేనేజర్లే ఇలాంటి మోసాలకు పాల్పడిన ఘటన పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.